Sri Bhramarambika Ashtakam (Sri Kantarpita) – శ్రీ భ్రమరాంబికాష్టకం (శ్రీకంఠార్పిత)
శ్రీకంఠార్పితపత్రగండయుగళాం సింహాసనాధ్యాసినీం లోకానుగ్రహకారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీమ్ | పాకారిప్రముఖామరార్చితపదాం మత్తేభకుంభస్తనీం శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || ౧ || వింధ్యాద్రీంద్రగృహాంతరేనివసితాం వేదాన్తవేద్యాం నిధిం మందారద్రుమపుష్పవాసితకుచాం మాయాం మహామాయినీమ్...