Bhadragiri Pati Sri Rama Suprabhatam – భద్రగిరిపతి శ్రీ రామచంద్ర సుప్రభాతం
వామాంకస్థితజానకీపరిలసత్కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే | బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధస్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే || ౧ || శ్రీమచ్చందనచర్చితోన్నతకుచ వ్యాలోలమాలాంకితాం | తాటంకద్యుతిసత్కపోలయుగళాం పీతాంబరాలంకృతామ్...