Pitru Tarpanam – పితృతర్పణం

(గమనిక: ఈ తర్పణం “పితృదేవతా స్తోత్రనిధి” ఈ-బుక్ లో ఉచితంగా అందుబాటులో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి.)

ముఖ్యగమనిక: తండ్రి బ్రతికి ఉంటే పితృతర్పణము చేయరాదు.

కావలసిన సామాన్లు –
* దర్భలు
* నల్లనువ్వులు
* తడిపిన తెల్ల బియ్యం
* చెంబులో మంచినీరు (అర్ఘ్య పాత్ర)
* పంచపాత్ర (ఆచమన పాత్ర, ఉద్ధరిణి, అరివేణం)
* తర్పణం విడవడానికి పళ్ళెం
* చిటికెడు గంధం
* కూర్చోవడానికి ఆసనం

యజ్ఞోపవీతం ధరించు విధానములు
* సవ్యం – మామూలుగా ఎడమ భుజం మీదుగా కుడి నడుముకు వచ్చేది.
* నివీతీ – దండలాగా మెడలో నుండి పొట్ట మీదకు వేసుకునేది.
* ప్రాచీనావీతీ – కుడి భుజం మీదుగా ఎడమ నడుముకు వచ్చేది.

———-

శివాయ గురవే నమః |

శుచిః –
(తలమీద నీళ్ళను జల్లుకోండి)
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష ||

ప్రార్థనా –
(నమస్కారం చేస్తూ ఇవి చదవండి)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః |

ఆచమ్య –
(ఆచమనం చేయండి)
ఓం కేశవాయ స్వాహా |
ఓం నారాయణాయ స్వాహా |
ఓం మాధవాయ స్వాహా |
ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః |
ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః |
ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః |
ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః |
ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః |
ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః |
ఓం శ్రీ కృష్ణాయ నమః |

పవిత్రం –
ఓం పవిత్రవన్తః పరివాజమాసతే పితైషాం ప్రత్నో అభి రక్షతి వ్రతమ్ |
మహస్సముద్రం వరుణస్తిరో దధే ధీరా ఇచ్ఛేకుర్ధరుణేష్వారభమ్ ||
పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వతః |
అతప్తతనూర్న తదామో అశ్నుతే శృతాస ఇద్వహన్తస్తత్సమాశత ||
పవిత్రం ధృత్వా ||
(పవిత్రం ధరించండి)

భూతోచ్ఛాటనం –
ఉత్తిష్ఠన్తు భూతపిశాచాః ఏతే భూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
(అక్షతలు మీ వెనక్కు వేయండి)

ప్రాణాయామం –
ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ |
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |
(మూడు సార్లు అనులోమ-విలోమ ప్రాణాయామం చేయండి)

సంకల్పం –
(అక్షతలు చేతిలో పట్టుకోండి)
శ్రీ గోవింద గోవింద గోవింద | శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ___ ప్రదేశే ___, ___ నద్యోః మధ్యే పుణ్యప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ ____ నామ సంవత్సరే ___ అయనే ___ ఋతౌ ___ మాసే ___ పక్షే ___ తిథౌ ___ వాసరే శ్రీవిష్ణు నక్షత్రే శ్రీవిష్ణు యోగే శ్రీవిష్ణు కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథౌ || ప్రాచీనావీతీ || అస్మత్ పితౄనుద్దిశ్య అస్మత్ పితౄణాం పుణ్యలోకావాప్త్యర్థం పితృ తర్పణం కరిష్యే || సవ్యం ||

(నీరు తీసుకుని అక్షింతలు అరివేణం లో విడవండి)

నమస్కారం –
(నమస్కారం చేయండి)
ఈశానః పితృరూపేణ మహాదేవో మహేశ్వరః |
ప్రీయతాం భగవానీశః పరమాత్మా సదాశివః || ౧
దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ |
నమస్స్వాహాయై స్వధాయై నిత్యమేవ నమో నమః || ౨
మన్త్రమధ్యే క్రియామధ్యే విష్ణోస్స్మరణ పూర్వకం |
యత్కించిత్క్రియతే కర్మ తత్కోటి గుణితం భవేత్ || ౩
విష్ణుర్విష్ణుర్విష్ణుః ||

(దక్షిణం వైపు తిరగి కూర్చోండి)

అర్ఘ్యపాత్ర –
అర్ఘ్యపాత్రయోః అమీగంధాః |
(అర్ఘ్యపాత్రలో గంధం వేయండి)

పుష్పార్థా ఇమే అక్షతాః |
(అర్ఘ్యపాత్రలో అక్షతలు వేయండి)

అమీ కుశాః |
(అర్ఘ్యపాత్రలో ఒక దర్భ వేయండి)

|| సవ్యం || నమస్కృత్య |
ఓం ఆయంతు నః పితరస్సోమ్యాసోగ్నిష్వాత్తాః పథిభిర్దేవ యానైః |
అస్మిన్ యజ్ఞే స్వధయా మదం త్వధి బృవంతు తే అవంత్వ స్మాన్ ||
ఇదం పితృభ్యో నమో అస్త్వద్య యే పూర్వాసో య ఉపరాస ఈయుః |
యే పార్థివే రజస్యా నిషత్తా యే వా నూనం సువృజనాసు విక్షు ||
పితృదేవతాభ్యో నమః |

ఓం ఆగచ్ఛంతు మే పితర ఇమం గృహ్ణంతు జలాంజలిమ్ |
(పళ్ళెంలో ఒక దర్భ పెట్టండి)

|| ప్రాచీనావీతీ ||
సకలోపచారార్థే తిలాన్ సమర్పయామి |
(నల్లనువ్వులు పళ్ళెంలోని దర్భ మీద వేయండి)

పిత్రాది తర్పణం |
(కుడి బొటన వేలికి నల్లనువ్వులు అద్దుకుని పితృతీర్థముగా మూడేసిసార్లు నీరు విడవండి.
* బ్రాహ్మణులకు – శర్మాణం, క్షత్రియులకు – వర్మాణం, వైశ్యులకు – గుప్తం )
(** గతించిన వారికి మాత్రమే చేయండి. సజీవులకు చేయవద్దు.)

|| ప్రాచీనావీతీ ||
[తండ్రిగారు]
అస్మత్ పితరం __(గోత్రం)__ గోత్రం __(మనిషి పేరు)__ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తండ్రియొక్క తండ్రిగారు]
అస్మత్ పితామహం ___ గోత్రం ___ శర్మాణం* రుద్రరూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తండ్రియొక్క తండ్రిగారి తండ్రిగారు]
అస్మత్ ప్రపితామహం ___ గోత్రం ___ శర్మాణం* ఆదిత్యరూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[తల్లిగారు]
అస్మత్ మాతరం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తండ్రియొక్క తల్లిగారు]
అస్మత్ పితామహీం ___ గోత్రాం ___ దాం రుద్రరూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తండ్రియొక్క తండ్రిగారి తల్లిగారు]
అస్మత్ ప్రపితామహీం ___ గోత్రాం ___ దాం ఆదిత్యరూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[తండ్రియొక్క మారు భార్య (సవతితల్లి)]
(* సవతితల్లి ఉండి గతించినట్లైతేనే ఇది చేయండి)
అస్మత్ సాపత్నీమాతరం ___ గోత్రాం ___ దాం వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[తల్లియొక్క తండ్రిగారు]
అస్మత్ మాతామహం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తల్లియొక్క తండ్రిగారి తండ్రిగారు]
అస్మత్ మాతుః పితామహం ___ గోత్రం ___ శర్మాణం* రుద్రరూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తల్లియొక్క తండ్రిగారి తండ్రిగారికి తండ్రిగారు]
అస్మత్ మాతుః ప్రపితామహం ___ గోత్రం ___ శర్మాణం* ఆదిత్యరూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[తల్లియొక్క తల్లిగారు]
అస్మత్ మాతామహీం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తల్లియొక్క తల్లిగారి అత్తగారు (తల్లిగారి నాయనమ్మ)]
అస్మత్ మాతుః పితామహీం ___ గోత్రాం ___ దాం రుద్రరూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తల్లియొక్క తల్లిగారి అత్తగారి అత్తగారు (తల్లిగారి తాతమ్మ)]
అస్మత్ మాతుః ప్రపితామహీం ___ గోత్రాం ___ దాం ఆదిత్యరూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

(** ఈ క్రింది తర్పణలు వివాహం జరిగినవాళ్ళు మాత్రమే గతించినవారికి మాత్రమే ఇవ్వవలెను. సజీవులకు ఇవ్వరాదు.)

[భార్య]
అస్మత్ ఆత్మపత్నీం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[కుమారుడు]
అస్మత్ సుతం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[సోదరుడు]
అస్మత్ భ్రాతరం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[పెదతండ్రి(జ్యేష్ఠ)/పినతండ్రి(కనిష్ఠ)]
అస్మత్ జ్యేష్ఠ/కనిష్ఠ పితృవ్యం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[మేనమామ]
అస్మత్ మాతులం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[కూతురు]
అస్మత్ దుహితరం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తోబుట్టువు]
అస్మత్ భగినీం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[కూతురి కోడుకు (మనుమడు)]
అస్మత్ దౌహిత్రం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[మేనల్లుడు]
అస్మత్ భగినేయకం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[మేనత్త]
అస్మత్ పితృష్వసారం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[పెదతల్లి(జ్యేష్ఠ)/పినతల్లి(కనిష్ఠ)]
అస్మత్ జ్యేష్ఠ/కనిష్ఠ మాతృష్వసారం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[అల్లుడు]
అస్మత్ జామాతరం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తోబుట్టువు భర్త]
అస్మత్ భావుకం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[కోడలు]
అస్మత్ స్నుషాం ___ గోత్రం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[భార్యయొక్క తండ్రిగారు]
అస్మత్ శ్వశురం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[భార్యయొక్క తల్లిగారు]
అస్మత్ శ్వశ్రూం ___ గోత్రాం ___ దాం వసురూపాం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[బావమరుదులు]
అస్మత్ స్యాలకం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

[ఆచార్యుడు]
అస్మత్ స్వామినం/ఆచార్యం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[బ్రహ్మోపదేశం చేసిన గురువుగారు]
అస్మత్ గురుం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |
[తర్పణ కోరినవారు]
అస్మత్ రిక్థినం ___ గోత్రం ___ శర్మాణం* వసురూపం స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి |

పితృదేవతాభ్యో నమః |
సుప్రీతో భవతు |

కుశోదకం –
|| ప్రాచీనావీతీ ||
ఏషాన్నమాతా న పితా న బన్ధుః నాన్య గోత్రిణః |
తే సర్వే తృప్తిమాయాన్తు మయోత్సృష్టైః కుశోదకైః ||
తృప్యత తృప్యత తృప్యత తృప్యత తృప్యత |
(కొన్ని నువ్వులు, పళ్ళెం లోని దర్భ చేతిలోకి తీసుకుని చెంబులోని నీరు పితృతీర్థంగా పళ్ళెంలో విడవండి. దర్భ కూడా విడిచిపెట్టి చేతికి నువ్వులు లేకుండా శుభ్రం చేసుకోండి).

నిష్పీడనోదకం –
|| నివీతీ ||
యేకే చాస్మత్కులేజాతాః అపుత్రాః గోత్రిణో మృతాః |
తే గృహ్ణన్తు మయా దత్తం వస్త్రనిష్పీడనోదకమ్ |
(జంధ్యము దండలావేసుకొని బ్రహ్మముడులమీద నీరుపోసి తడిపి పిండి కళ్ళకు అద్దుకోండి)

సమర్పణం –
|| సవ్యం ||
కాయేన వాచా మనసైన్ద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేస్స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||

నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||

పవిత్రం విసృజ్య |

ఓం శాంతిః శాంతిః శాంతిః |

ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు |

పితృ స్తోత్రం (రుచి కృతం) >>


గమనిక: "శ్రీ శివ స్తోత్రనిధి" పుస్తకము ముద్రణ చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

Facebook Comments

You may also like...

20 వ్యాఖ్యలు

 1. Mallik Arjun అంటున్నారు:

  very useful

 2. kumar అంటున్నారు:

  maa poojari prathi amavasyaki raka pothe memu valla intiki velli moyana istamu
  ee sari nudni meeru rasinattu memu chaduvu koni memu chesina tharuvatha vallaki istamu

 3. kumar అంటున్నారు:

  print option ivvaledu meeru

 4. Stotra Nidhi అంటున్నారు:

  Please use this website or use Stotra Nidhi mobile app.

 5. Satyanarayana Murthy అంటున్నారు:

  Namaskaram.

  Chala baaga iccharu tarpana vidhi.

  Nadoka sandeham.
  Ippudu unna paristitulu valla ,Taddinam pette veelu lekapote, ila tarpanam ivvacha, leka vere paddati unda. daya chesi cheppandi.
  ipudu unna paristitulu

 6. Stotra Nidhi అంటున్నారు:

  Ippatiki idi chesukondi, konni rojula tarvata panthulugarini pilavandi.

 7. Y H PRASAD అంటున్నారు:

  Very useful especially in this Covid peandamic moment.

 8. jithendra అంటున్నారు:

  Paddathini Chaalaa vivaramgaa chepparu.. dhanyavaadamulu..

 9. CHATURVEDULA HARAGOPAL అంటున్నారు:

  sir

  Nice chaala viveramga chepparu memu brahmins ela download chesukovalo cheppandi guruvu garu

 10. Stotra Nidhi అంటున్నారు:

  Please use stotranidhi mobile app for offline use

 11. srinivas అంటున్నారు:

  Guru Garu, Very good to have this kind of site. It really help full for people ( specially when people cannot find Brhamins locally and covid-19 time). If you can upload pinda pradam also it will be more helpful, specailly for people living in USA.

 12. Satyanarayana అంటున్నారు:

  Thanks for the useful information. ???

 13. Sastry Malladi అంటున్నారు:

  Chaala Upayogakara Samaacharam. Chaala Bagundi.

 14. Sankar అంటున్నారు:

  As no print option given, is the e-book be available for sale?

 15. Stotra Nidhi అంటున్నారు:

  This is available for offline usage in Stotra Nidhi mobile app. Please download it from playstore or appstore.

 16. అనామకం అంటున్నారు:

  how to download pitru tarpanam pdf in telugu?

 17. Stotra Nidhi అంటున్నారు:

  You can download PDF – “Pitru Devata Stotranidhi” Free e-book from https://stotranidhi.com/ebooks/

 18. Maruthi prasad అంటున్నారు:

  చాలా చక్కగా తయారు చేయబడినది, ఎంత చదివినా తరగని సంపదలాగ పొందు పరిచారు.
  ధన్యవాదములు

 19. Gudimetla srinivasa sharma అంటున్నారు:

  యజుర్ వేద ఆబ్దిక మంత్రములు క్రియ విధానం కూడా పెట్ట గలరు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

error: Not allowed
%d bloggers like this: