Runa Vimochana Ganesha Stotram – ఋణ విమోచన గణేశ స్తోత్రం

:: Chant this in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST) ::

 

అస్య శ్రీ ఋణహర్తృ గణపతి స్తోత్ర మంత్రస్య | సదాశివ ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీ ఋణహర్తృ గణపతి దేవతా | గౌం బీజం | గం శక్తిః | గోం కీలకం | సకల ఋణనాశనే వినియోగః |

శ్రీ గణేశ | ఋణం ఛింది | వరేణ్యం | హుం | నమః | ఫట్ |
ఇతి కర హృదయాది న్యాసః |

ధ్యానం
సిందూరవర్ణం ద్విభుజం గణేశం
లంబోదరం పద్మదళే నివిష్టం
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం
సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం ||

అర్థం – ఎరుపు వర్ణముతో, రెండు భుజములతో, పెద్ద పొట్టతో, కమలపూరేకులలో కూర్చుని, బ్రహ్మాది దేవతలచే పరిపరివిధముల సేవింపబడుచూ, సిద్ధులచేత నమస్కరింపబడుచున్న గణేశ దేవుని నేను ధ్యానము చేయుచున్నాను.

స్తోత్రం –

సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౧ ||

అర్థం – సృష్టి చేయడానికి ముందుగా బ్రహ్మచే సరిగ్గా పూజచేయబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.

త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౨ ||

అర్థం – త్రిపురాసురుని వధించేముందు శంభుదేవునిచే సరిగ్గా పూజచేయబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.

హిరణ్యకశ్యపాదీనాం వధార్థే విష్ణునార్చితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౩ ||

అర్థం – హిరణ్యకశ్యపులను వధించుట కొరకు విష్ణువుచే పూజింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.

మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౪ ||

అర్థం – మహిషాసురుని వధించునపుడు దేవీ చేత గణనాథ రూపమున గౌరవింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.

తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౫ ||

అర్థం – తారకాసురుని వధించే ముందు కుమారునిచే గౌరవింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.

భాస్కరేణ గణేశోహి పూజితశ్చ విశుద్ధయే |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౬ ||

అర్థం – గణేశుడిగా సూర్యునిచే పూజింపబడి, సూర్యుడిని శుద్ధిచేసిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.

శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౭ ||

అర్థం – కాంతివృద్ధి కోసం చంద్రునిచే గణనాయకరూపములో పూజింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.

పాలనాయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః |
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతు మే || ౮ ||

అర్థం – తపస్సు రక్షింపబడుట కొరకు విశ్వామిత్రునిచే పూజింపబడిన పార్వతీపుత్రా, నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయుము.

ఇదం ఋణహరం స్తోత్రం తీవ్రదారిద్ర్యనాశనం |
ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || ౯ ||

అర్థం – ఈ ఋణహర స్తోత్రము ఒక సంవత్సరము పాటు రోజూ ఒకసారి చదివితే తీవ్ర దరిద్రమును నశింపజేయగలదు.

దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్ |
పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || ౧౦ ||

అర్థం – ఎంతటి దారుణమైన దరిద్రములైన తొలగింపబడి కుబేరునితో సమానముగా చేయగలదు. దీని తరువాత పదిహేను అక్షరములుగల మహామంత్రమును పఠించవలెను.

శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్ |
ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || ౧౧ ||

అర్థం – “శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్” అనే మంత్రమును శుచి భావనతో పఠనము చేయవలెను.

ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణమీరితం |
సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || ౧౨ ||

అర్థం – ఇరవైయొక్క సార్లు ఈ మంత్రమును పఠించవలెను. వేయి సార్లు ఆరు నెలలు పఠించినచో ఇష్టమైనవి లభించును.

బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్ |
అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || ౧౩ ||

అర్థం – పదివేల సార్లు పఠించినచో జ్ఞానములో బృహస్పతి వలె, ధనములో ధనపతి వలె అగును.

లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్ |
భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || ౧౪ ||

అర్థం – లక్ష సార్లు పఠించినచో సరైన కోరికలకు ఫలితములు వచ్చును. భూతములు, ప్రేతములు, పిశాచములు మంత్ర స్మరణము చేసిన మాత్రాన నశించును.

ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం ||

(ఈ అర్థము మండా కృష్ణశ్రీకాంత శర్మచే స్ఫురింపబడి వ్రాయబడినది)


మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.

Facebook Comments

You may also like...

5 వ్యాఖ్యలు

 1. vijayakumar అంటున్నారు:

  This site is very useful. Mee zunma dhanyamayindhi.

 2. marapelli Dargaiah అంటున్నారు:

  naku appulu chalaa vunnavi dayachesi thwaraga there upaya chepandi

 3. S patel అంటున్నారు:

  Thanks a lot for nice and easy translation. Jai Sri ganesh..

 4. Kaulini అంటున్నారు:

  Chala chala santosham gaa undi, ilaa arthaala tho paatu stotraalu istunnanduku…idi bhaktulaku entho upayoga padutundi…artham telisthe ne kaani ye stotram chadivinaa phalitham undadu ani peddalu samavedam shanmukha sarma gaaru cheppaaru…

 5. Suresh అంటున్నారు:

  చాలా బాగుంది అలాగే గణపతి అథర్వణ శీర్షం అర్థంతో పంపగలరా దయచేసి సమాధానం పంపగలరు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Not allowed
%d bloggers like this: