Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గాయత్రీ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
అస్య శ్రీగాయత్ర్యష్టోత్తరశత దివ్యనామస్తోత్ర మంత్రస్య బ్రహ్మావిష్ణుమహేశ్వరా ఋషయః ఋగ్యజుస్సామాథర్వాణి ఛందాంసి పరబ్రహ్మస్వరూపిణీ గాయత్రీ దేవతా ఓం తద్బీజం భర్గః శక్తిః ధియః కీలకం మమ గాయత్రీప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః |
తరుణాదిత్యసంకాశా సహస్రనయనోజ్జ్వలా |
స్యందనోపరిసంస్థానా ధీరా జీమూతనిస్స్వనా || ౧ ||
మత్తమాతంగగమనా హిరణ్యకమలాసనా |
ధీజనోద్ధారనిరతా యోగినీ యోగధారిణీ || ౨ ||
నటనాట్యైకనిరతా ప్రణవాద్యక్షరాత్మికా |
ఘోరాచారక్రియాసక్తా దారిద్ర్యచ్ఛేదకారిణీ || ౩ ||
యాదవేంద్రకులోద్భూతా తురీయపదగామినీ |
గాయత్రీ గోమతీ గంగా గౌతమీ గరుడాసనా || ౪ ||
గేయా గానప్రియా గౌరీ గోవిందపరిపూజితా |
గంధర్వనగరాకారా గౌరవర్ణా గణేశ్వరీ || ౫ ||
గుణాశ్రయా గుణవతీ గుహ్యకా గణపూజితా |
గుణత్రయసమాయుక్తా గుణత్రయవివర్జితా || ౬ ||
గుహావాసా గుహాచారా గుహ్యా గంధర్వరూపిణీ |
గార్గ్యప్రియా గురుపథా గుహ్యలింగాంకధారిణీ || ౭ ||
సావిత్రీ సూర్యతనయా సుషుమ్ణానాడిభేదినీ |
సుప్రకాశా సుఖాసీనా సువ్రతా సురపూజితా || ౮ ||
సుషుప్త్యవస్థా సుదతీ సుందరీ సాగరాంబరా |
సుధాంశుబింబవదనా సుస్తనీ సువిలోచనా || ౯ ||
శుభ్రాంశునాసా సుశ్రోణీ సంసారార్ణవతారిణీ |
సామగానప్రియా సాధ్వీ సర్వాభరణభూషితా || ౧౦ ||
సీతా సర్వాశ్రయా సంధ్యా సఫలా సుఖదాయినీ |
వైష్ణవీ విమలాకారా మాహేంద్రీ మాతృరూపిణీ || ౧౧ ||
మహాలక్ష్మీర్మహాసిద్ధిర్మహామాయా మహేశ్వరీ |
మోహినీ మదనాకారా మధుసూదనసోదరీ || ౧౨ ||
మీనాక్షీ క్షేమసంయుక్తా నగేంద్రతనయా రమా |
త్రివిక్రమపదాక్రాంతా త్రిసర్వా త్రివిలోచనా || ౧౩ ||
సూర్యమండలమధ్యస్థా చంద్రమండలసంస్థితా |
వహ్నిమండలమధ్యస్థా వాయుమండలసంస్థితా || ౧౪ ||
వ్యోమమండలమధ్యస్థా చక్రస్థా చక్రరూపిణీ |
కాలచక్రవిధానజ్ఞా చంద్రమండలదర్పణా || ౧౫ ||
జ్యోత్స్నాతపేనలిప్తాంగీ మహామారుతవీజితా |
సర్వమంత్రాశ్రితా ధేనుః పాపఘ్నీ పరమేశ్వరీ || ౧౬ ||
చతుర్వింశతివర్ణాఢ్యా చతుర్వర్గఫలప్రదా |
మందేహరాక్షసఘ్నీ చ షట్కుక్షిః త్రిపదా శివా || ౧౭ ||
జపపారాయణప్రీతా బ్రాహ్మణ్యఫలదాయినీ |
నమస్తేఽస్తు మహాలక్ష్మీ మహాసంపత్తిదాయిని || ౧౮ ||
నమస్తే కరుణామూర్తే నమస్తే భక్తవత్సలే |
గాయత్రీం పూజయేద్యస్తు శతైరష్టోత్తరైః పృథక్ || ౧౯ ||
తస్య పుణ్యఫలం వక్తుం బ్రహ్మణాపి న శక్యతే |
ప్రాతఃకాలే చ మధ్యాహ్నే సాయాహ్నే చ రఘూత్తమ || ౨౦ ||
యే పఠంతీహ లోకేఽస్మిన్ సర్వాన్ కామానవాప్నుయాత్ |
పఠనాదేవ గాయత్రీ నామ్నామష్టోత్తరం శతమ్ || ౨౧ ||
బ్రహ్మహత్యాది పాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః |
దినే దినే పఠేద్యస్తు గాయత్రీస్తవముత్తమమ్ || ౨౨ ||
స నరో ముక్తిమాప్నోతి పునరావృత్తివర్జితమ్ |
పుత్రప్రదమపుత్రాణాం దరిద్రాణాం ధనప్రదమ్ || ౨౩ ||
రోగిణాం రోగశమనం సర్వైశ్వర్యప్రదాయకమ్ |
బహునా కిమిహోక్తేన స్తోత్రం సర్వఫలప్రదమ్ || ౨౪ ||
ఇతి శ్రీవిశ్వామిత్ర ప్రోక్తం శ్రీ గాయత్ర్యష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గాయత్రీ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గాయత్రీ స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


