ఆశ్వీయుజ మాసంలో వచ్చే దశమి నాడు విజయదశమి పర్వదినంగా జరుపుకోవడం మన సాంప్రదాయం. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు శుద్ధ నవమి వరకు నవరాత్రులుగా వ్యవహరిస్తారు. ఈ నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాలలో పూజిస్తాము. విజయవాడ కనకదుర్గ దేవాలయంలో వెలసిన శ్రీ దుర్గా అమ్మవారికి, శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబికా అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు వివిధ రూపాలలో అలంకారం చేసి భక్తిపారవశ్యంలో మానవులంతాం పరవశిస్తారు. ఈ సందర్భంగా స్తోత్రనిధి పాఠకులకు ఈ తొమ్మిది రోజులు ఆయా దేవతాస్వరూపాలను స్తుతించే మహిమాన్వితమైన స్తోత్రాలను అందజేయడం కోసం ఈ పేజీ లో రోజువారిగా స్తోత్రాలను ఇవ్వడం జరిగింది. భక్త మహాశయులు ఇవి పఠించి భగవంతునికి దగ్గర కాగలరని ఆశిస్తున్నాము.
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి – మొదటి రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ శైలపుత్రీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గా దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
ఆశ్వీయుజ శుద్ధ విదియ – రెండవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ బ్రహ్మచారిణీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
ఆశ్వీయుజ శుద్ధ తదియ – మూడవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ చంద్రఘంటా దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ గాయత్రీ దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
ఆశ్వీయుజ శుద్ధ చవితి – నాల్గవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ కూష్మాండా దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ అన్నపూర్ణా దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
ఆశ్వీయుజ శుద్ధ పంచమి – ఐదవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ స్కందమాతా దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి – ఆరవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ కాత్యాయనీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ మహాలక్ష్మీ దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం
ఆశ్వీయుజ శుద్ధ సప్తమి – ఏడవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ కాలరాత్రి దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ సరస్వతీ దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
ఆశ్వీయుజ శుద్ధ అష్టమి – ఎనిమిదవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ మహాగౌరీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ దుర్గా దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం)
ఆశ్వీయుజ శుద్ధ నవమి – తొమ్మిదవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ సిద్ధిదాత్రీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ మహిషాసురమర్దినీ దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
ఆశ్వీయుజ శుద్ధ దశమి – పదవ రోజు
శ్రీశైల శ్రీ భ్రమరాంబికా అలంకారం – శ్రీ రాజరాజేశ్వరీ దేవి
విజయవాడ శ్రీ కనకదుర్గ అలంకారం – శ్రీ భ్రమరాంబికా దేవి
ఈ రోజు పఠించ తగిన స్తోత్రాలు :
గమనిక: ఇటివలి ప్రచురణలు "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" మరియు "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి"
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.