Sri Anjaneya (Hanuman) Shodasopachara Puja – శ్రీ ఆంజనేయ షోడశోపచార పూజ


(గమనిక – ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను. )

పూజా విధానం (పూర్వాంగం) చూ. ||

శ్రీ గణపతి పూజ (పసుపు గణపతి పూజ) చూ. ||

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ సంకల్పిత మనోవాంఛాఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీమదాంజనేయ స్వామి దేవతా ప్రీత్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే ||

ధ్యానం –
అతులితబలధామం స్వర్ణశైలాభదేహం
దనుజవనకృశానుం జ్ఞానినామగ్రగణ్యమ్ |
సకలగుణనిధానం వానరాణామధీశం
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి ||
గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసమ్ |
రామాయణమహామాలారత్నం వందేఽనిలాత్మజమ్ ||
ఓం శ్రీ హనుమతే నమః ధ్యాయామి ||

ఆవాహనం –
రామచంద్రపదాంభోజయుగళ స్థిరమాసనమ్ |
ఆవాహయామి వరదం హనూమంతమభీష్టదమ్ ||
ఓం శ్రీ హనుమతే నమః ఆవాహయామి |

ఆసనం –
నవరత్ననిబద్ధాశ్రం చతురశ్రం సుశోభనమ్ |
సౌవర్ణమాసనం తుభ్యం దాస్యామి కపినాయక ||
ఓం శ్రీ హనుమతే నమః సింహాసనం సమర్పయామి |

పాద్యం –
సువర్ణకలశానీతం గంగాది సలిలైర్యుతమ్ |
పాదయోః పాద్యమనఘం ప్రతిగృహ్య ప్రసీద మే ||
ఓం శ్రీ హనుమతే నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
లక్ష్మణప్రాణసంరక్ష సీతాశోకవినాశన |
గృహాణార్ఘ్యం మయా దత్తం అంజనాప్రియనందన ||
ఓం శ్రీ హనుమతే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
వాలాగ్రసేతుబంధాయ శతాననవధాయ చ |
తుభ్యమాచమనం దత్తం ప్రతిగృహ్ణీష్వ మారుతే ||
ఓం శ్రీ హనుమతే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం –
అర్జునధ్వజసంవాస దశాననమదాపహ |
మధుపర్కం ప్రదాస్యామి హనుమన్ ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ హనుమతే నమః మధుపర్కం సమర్పయామి |

స్నానం –
గంగాదిసర్వతీర్థేభ్యః సమానీతైర్నవోదకైః |
భవంతం స్నపయిష్యామి కపినాయక గృహ్యతామ్ ||
ఓం శ్రీ హనుమతే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం –
పీతాంబరమిదం తుభ్యం తప్తహాటకసన్నిభమ్ |
దాస్యామి వానరశ్రేష్ఠ సంగృహాణ నమోఽస్తు తే ||
ఉత్తరీయం తు దాస్యామి సంసారోత్తారకారణ |
గృహాణ చ మయా ప్రీత్యా దత్తం ధత్స్వ యథావిధి ||
ఓం శ్రీ హనుమతే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం –
నవభిస్తంతుభిర్యుక్తం త్రిగుణం దేవతామయమ్ |
ఉపవీతం చోత్తరీయం గృహాణ రామకింకర ||
ఓం శ్రీ హనుమతే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం –
కస్తూరీకుంకుమామిశ్రం కర్పూరాగరువాసితమ్ |
శ్రీచందనం తు దాస్యామి గృహ్యతాం హనుమత్ప్రభో ||
ఓం శ్రీ హనుమతే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి |

ఆభరణం –
భూషణాని మహార్హాణి కిరీటప్రముఖాన్యహమ్ |
తుభ్యం దాస్యామి సర్వేశ గృహాణ కపినాయక |
ఓం శ్రీ హనుమతే నమః సర్వాభరణాని సమర్పయామి |

అక్షతాన్ –
శాలీయానక్షతాన్ రమ్యాన్ పద్మరాగసమప్రభాన్ |
అఖండాన్ ఖండితధ్వాంత స్వీకురుష్వ దయానిధే ||
ఓం శ్రీ హనుమతే నమః అక్షతాన్ సమర్పయామి ||

పుష్పాణి –
సుగంధీని సురూపాణి వన్యాని వివిధాని చ |
చంపకాదీని పుష్పాణి కమలాన్యుత్పలాని చ ||
తులసీదళ బిల్వాని మనసా కల్పితాని చ |
గృహాణ హనుమద్దేవ ప్రణతోఽస్మి పదాంబుజే ||
ఓం శ్రీ హనుమతే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |

అథ అంగపూజా –
ఓం మారుతయే నమః – పాదౌ పూజయామి |
ఓం సుగ్రీవసఖాయ నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం అంగదమిత్రాయ నమః – జంఘే పూజయామి |
ఓం రామదాసాయ నమః – ఊరూ పూజయామి |
ఓం అక్షఘ్నాయ నమః – కటిం పూజయామి |
ఓం లంకాదహనాయ నమః – వాలం పూజయామి |
ఓం సంజీవననగాహర్త్రే నమః – స్కంధౌ పూజయామి |
ఓం సౌమిత్రిప్రాణదాత్రే నమః – వక్షఃస్థలం పూజయామి |
ఓం కుంఠితదశకంఠాయ నమః – కంఠం పూజయామి |
ఓం రామాభిషేకకారిణే నమః – హస్తౌ పూజయామి |
ఓం మంత్రరచితరామాయణాయ నమః – వక్త్రం పూజయామి |
ఓం ప్రసన్నవదనాయ నమః – వదనం పూజయామి |
ఓం పింగళనేత్రాయ నమః – నేత్రౌ పూజయామి |
ఓం శ్రుతిపరాయణాయ నమః – శ్రోత్రే పూజయామి |
ఓం ఊర్ధ్వపుండ్రధారిణే నమః – లలాటం పూజయామి |
ఓం మణికంఠమాలికాయ నమః – శిరః పూజయామి |
ఓం సర్వాభీష్టప్రదాయ నమః – సర్వాణ్యంగని పూజయామి |

అథ అష్టోత్తరశతనామ పూజా –

శ్రీ ఆంజనేయ అష్టోత్తరశతనామావళీ చూ. |

ధూపం –
దివ్యం సగుగ్గులం రమ్యం దశాంగేన సమన్వితమ్ |
గృహాణ మారుతే ధూపం సుప్రియం ఘ్రాణతత్పరమ్ |
ఓం శ్రీ హనుమతే నమః ధూపం ఆఘ్రాపయామి |

దీపం –
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా |
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్ ||
సుప్రకాశో మహాదీపః సర్వతస్తిమిరాపహః |
సబాహ్యాభ్యంతరం జ్యోతిర్దీపోఽయం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ హనుమతే నమః దీపం దర్శయామి |

నైవేద్యం –
మణిపాత్ర సహస్రాఢ్యం దివ్యాన్నం ఘృతపాయసం
ఆపూపలడ్డూకోపేతం మధురామ్రఫలైర్యుతమ్ |
హింగూ జీరక సంయుక్తం షడ్రసోపేతముత్తమం
నైవేద్యమర్పయామ్యద్య గృహాణేదం కపీశ్వర ||
ఓం శ్రీ హనుమతే నమః …… నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” | ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” | ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి ||

తాంబూలం –
నాగవల్లీదళోపేతం క్రముకైర్మధురైర్యుతమ్ |
తాంబూలమర్పయామ్యద్య కర్పూరాది సువాసితమ్ ||
ఓం శ్రీ హనుమతే నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం –
ఆరార్తికం తమోహారి శతసూర్య సమప్రభమ్ |
అర్పయామి తవ ప్రీత్యై అంధకార నిషూదనమ్ ||
ఓం శ్రీ హనుమతే నమః కర్పూర నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |

మంత్రపుష్పం –
ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ ||
ఓం శ్రీ హనుమతే నమః మంత్రపుష్పం సమర్పయామి |

ఆత్మప్రదక్షిణ-
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష కపీశ్వర |
ఓం శ్రీ హనుమతే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సర్వోపచారాః –
ఓం శ్రీ హనుమతే నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ హనుమతే నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ హనుమతే నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ హనుమతే నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీ హనుమతే నమః ఆందోళికానారోహయామి |
ఓం శ్రీ హనుమతే నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ హనుమతే నమః గజానారోహయామి |
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |

ప్రార్థనా –
మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి || ౧ ||
ఆంజనేయమతిపాటలాననం
కాంచనాద్రికమనీయవిగ్రహమ్ |
పారిజాతతరుమూలవాసినం
భావయామి పవమాననందనమ్ || ౨ ||
మర్కటేశ మహోత్సాహ సర్వసిద్ధిప్రదాయక |
శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో || ౩ ||

క్షమా ప్రార్థనా –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ కపినాయక |
ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్ |
పూజావిధిం న జానామి క్షమస్వ వానరోత్తమ |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కపీశ్వర |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే |

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీమదాంజనేయ స్వామి సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||

తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణమ్ |
సమస్త పాపక్షయకరం శ్రీఆంజనేయ పాదోదకం పావనం శుభమ్ ||
శ్రీ ఆంజనేయాయ నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |

ఓం శాంతిః శాంతిః శాంతిః ||


మరిన్ని పూజా విధానాలు మరియు వ్రతములు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed