Sri Nandakumara Ashtakam – శ్రీ నందకుమారాష్టకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

సుందరగోపాలం ఉరవనమాలం నయనవిశాలం దుఃఖహరం
వృందావనచంద్రం ఆనందకందం పరమానందం ధరణిధరమ్ |
వల్లభఘనశ్యామం పూర్ణకామం ఆత్యభిరామం ప్రీతికరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరమ్ || ౧ ||

సుందరవారిజవదనం నిర్జితమదనం ఆనందసదనం ముకుటధరం
గుంజాకృతిహారం విపినవిహారం పరమోదారం చీరహరమ్ |
వల్లభపటపీతం కృతముపవీతం కరనవనీతం విబుధవరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరమ్ || ౨ ||

శోభితముఖధూలం యమునాకూలం నిపట అతూలం సుఖదతరం
ముఖమండితరేణుం చారితధేనుం వాదితవేణుం మధురసురమ్ |
వల్లభమతివిమలం శుభపదకమలం నఖరుచి అమలం తిమిరహరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరమ్ || ౩ ||

శిరముకుటసుదేశం కుంచితకేశం నటవరవేషం కామవరం
మాయాకృతమనుజం హలధర అనుజం ప్రతిహతదనుజం భారహరమ్ |
వల్లభవ్రజపాలం సుభగసుచాలం హితమనుకాలం భావవరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరమ్ || ౪ ||

ఇందీవరభాసం ప్రకటసరాసం కుసుమవికాసం వంశధరం
జితమన్మథమానం రూపనిధానం కృతకలగానం చిత్తహరమ్ |
వల్లభమృదుహాసం కుంజనివాసం వివిధవిలాసం కేళికరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరమ్ || ౫ ||

అతిపరమప్రవీణం పాలితదీనం భక్తాధీనం కర్మకరం
మోహనమతిధీరం ఫణిబలవీరం హతపరవీరం తరళతరమ్ |
వల్లభవ్రజరమణం వారిజవదనం హలధరశమనం శైలధరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరమ్ || ౬ ||

జలధరద్యుతి అంగం లలితత్రిభంగం బహుకృతిరంగం రసికవరం
గోకులపరివారం మదనాకారం కుంజవిహారం గూఢతరమ్ |
వల్లభవ్రజచంద్రం సుభగసుఛందం కృత ఆనందం భ్రాంతిహరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరమ్ || ౭ ||

వందితయుగచరణం పావనకరణం జగదుద్ధరణం విమలధరం
కాళియశిరగమనం కృతఫణినమనం ఘాతితయమనం మృదులతరమ్ |
వల్లభదుఃఖహరణం నిర్మలచరణం అశరణశరణం ముక్తికరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరమ్ || ౮ ||

ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం శ్రీ నందకుమారాష్టకమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కృష్ణ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed