Sri Mrityunjaya Aksharamala Stotram – శ్రీ మృత్యుంజయ అక్షరమాలా స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర |
మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ ||

అద్రీశజాధీశ విద్రావితాఘౌఘ భద్రాకృతే పాహి మృత్యుంజయ |

ఆకాశకేశామరాధీశవంద్య త్రిలోకేశ్వర పాహి మృత్యుంజయ |

ఇందూపలేందుప్రభోత్ఫుల్లకుందారవిందాకృతే పాహి మృత్యుంజయ |

ఈక్షాహతానంగ దాక్షాయణీనాథ మోక్షాకృతే పాహి మృత్యుంజయ |

ఉక్షేశసంచార యక్షేశసన్మిత్ర దక్షార్చిత పాహి మృత్యుంజయ |

ఊహాపథాతీతమాహాత్మ్యసంయుక్త మోహాంతకా పాహి మృత్యుంజయ |

ఋద్ధిప్రదాశేషబుద్ధిప్రతారజ్ఞ సిద్ధేశ్వర పాహి మృత్యుంజయ |

ౠపర్వతోత్తుంగశృంగాగ్రసంగాంగహేతో సదా పాహి మృత్యుంజయ |

లుప్తాత్మభక్తౌఘసంఘాతి సంఘాతకారి ప్రహన్ పాహి మృత్యుంజయ |

లూతీకృతానేకపారాదికృత్యంతనీయాధునా పాహి మృత్యుంజయ |

ఏకాదశాకార రాకేందుసంకాశ శోకాంతక పాహి మృత్యుంజయ |

ఐశ్వర్యధామార్క వైశ్వానరాభాస విశ్వాధిక పాహి మృత్యుంజయ |

ఓషధ్యధీశాంశుభూషాధిపాపౌఘ మోక్షప్రద పాహి మృత్యుంజయ |

ఔద్ధత్యహీనప్రబుద్ధప్రభావ ప్రబుద్ధాఖిల పాహి మృత్యుంజయ |

అంబాసమాశ్లిష్ట లంబోదరాపత్య బింబాధర పాహి మృత్యుంజయ |

అస్తోకకారుణ్య దుస్తారసంసారనిస్తారణ పాహి మృత్యుంజయ |

కర్పూరగౌరోగ్ర సర్పాఢ్య కందర్పదర్పాపహ పాహి మృత్యుంజయ |

ఖద్యోతనేత్రాగ్నివిద్యుద్గ్రహాక్షాది విద్యోతిత పాహి మృత్యుంజయ |

గంధేభచర్మాంగసక్తాంగ సంసారసింధుప్లవ పాహి మృత్యుంజయ |

ఘర్మాంశుసంకాశ ధర్మైకసంప్రాప్య శర్మప్రద పాహి మృత్యుంజయ |

ఙోత్పత్తిబీజాఖిలోత్పత్తిబీజామరాధీశ మాం పాహి మృత్యుంజయ |

చంద్రార్ధచూడ మరున్నేత్ర కాంచీనగేంద్రాలయ పాహి మృత్యుంజయ |

ఛందః శిరోరత్న సందోహసంవేద్య మందస్మిత పాహి మృత్యుంజయ |

జన్మక్షయాతీత చిన్మాత్రమూర్తే భవోన్మూలన పాహి మృత్యుంజయ |

ఝణచ్చారుఘంటామణివ్రాతకాంచీగుణశ్రేణిక పాహి మృత్యుంజయ |

ఞిత్యష్టచింతాంతరంగ ప్రమోదాటనానందహృత్ పాహి మృత్యుంజయ |

టంకాతిటంక మరున్నేత్ర భృంగాంగనాసంగత పాహి మృత్యుంజయ |

ఠాళీ మహాపాళి కేళీ తిరస్కారకారానల పాహి మృత్యుంజయ |

డోలాయమానాంతరంగీకృతానేకలాస్యేశ మాం పాహి మృత్యుంజయ |

ఢక్కాధ్వనిధ్వానదాహధ్వనిభ్రాంతశతృత్వ మాం పాహి మృత్యుంజయ |

ణాకారనేత్రాంత సంతోషితాత్మ శ్రితానంద మాం పాహి మృత్యుంజయ |

తాపత్రయాత్యుగ్రదావానలసాక్షిరూపావ్యయ పాహి మృత్యుంజయ |

స్థాణో మురారాతిబాణోల్లసత్పంచబాణాంతక పాహి మృత్యుంజయ |

దీనావనాద్యంతహీనాగమాంతైక మానోదితా పాహి మృత్యుంజయ |

ధాత్రీధరాధీశపుత్రీపరిష్వంగచిత్రాకృతే పాహి మృత్యుంజయ |

నందీశవాహారవిందాసనారాధ్య విందాకృతే పాహి మృత్యుంజయ |

పాపాంధకారప్రదీపాద్వయానందరూప ప్రభో పాహి మృత్యుంజయ |

ఫాలాంబకానంత నీలోజ్జ్వలన్నేత్ర శూలాయుధ పాహి మృత్యుంజయ |

బాలార్కబింబాంశుభాస్వజ్జటాజూటికాలంకృత పాహి మృత్యుంజయ |

భోగీశ్వరాకల్ప యోగిప్రియాభీష్టభోగప్రద పాహి మృత్యుంజయ |

మౌళీద్యునద్యూర్మిమాలాజటాజూటి కాళీప్రియ పాహి మృత్యుంజయ |

యజ్ఞేశ్వరాఖండతజ్ఞానిధే దక్షయజ్ఞాంతక పాహి మృత్యుంజయ |

రాకేందుకోటిప్రతీకాశలోకాదిసృడ్వందిత పాహి మృత్యుంజయ |

లంకేశవంద్యాంఘ్రిపంకేరుహాశేషశంకాపహ పాహి మృత్యుంజయ |

వాగీశతూణీర వందారుమందార శౌరిప్రియ పాహి మృత్యుంజయ |

శర్వాఖిలాధార సర్వేశ గీర్వాణగర్వాపహ పాహి మృత్యుంజయ |

షడ్వక్త్రతాత త్రిషాడ్గుణ్యలోకాదిసృడ్వందిత పాహి మృత్యుంజయ |

సోమావతంసాంతరంగే స్వయంధామ సామప్రియ పాహి మృత్యుంజయ |

హేలానిగీర్ణోగ్ర హాలాహలాసహ్య కాలాంతక పాహి మృత్యుంజయ |

ళాణీధరాధీశ బాణాసనావాప్తశోణాకృతే పాహి మృత్యుంజయ |

క్షిత్యంబుతేజో మరుద్వ్యోమ సోమాత్మ సత్యాకృతే పాహి మృత్యుంజయ |
[ ఈశార్చితాంఘ్రే మహేశాఽఖిలావాస కాశీపతే పాహి మృత్యుంజయ | ]

శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర |
మృత్యుంజయా పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ ||

ఇతి శ్రీ మృత్యుంజయ అక్షరమాలికా స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


గమనిక: రాబోయే హనుమజ్జయంతి సందర్భంగా హనుమాన్ స్తోత్రాలతో కూడిన "శ్రీ రామ స్తోత్రనిధి" పుస్తకము అందుబాటులో ఉంది. Click here to buy.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed