Sri Datta Shodashi – శ్రీ దత్త షోడశీ (షోడశ క్షేత్ర స్తవం)


[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

సచ్చిదానంద సద్గురు దత్తం భజ భజ భక్త |
షోడశావతారరూప దత్తం భజరే భక్త ||

మహిషపురవాస శ్రీకాలాగ్నిశమన దత్తమ్ |
ప్రోద్దుటూరు గ్రామవాస యోగిరాజవల్లభమ్ |
బెంగళూరునగరస్థిత దత్త యోగిరాజమ్ |
అనంతపురే స్థితం జ్ఞానసాగరం భజ దత్తమ్ || ౧ ||

విజయవాడ విలసితం శ్యామకమలలోచనమ్ |
మచిలీపట్టణ సంస్థితం అత్రివరదరాజమ్ |
జయలక్ష్మీపురే సంస్కారహీన శివరూపమ్ |
మద్రాసునగర సంవాసం ఆదిగురు నామకమ్ || ౨ ||

హృషీకేశ తీర్థరాజం శ్రీదిగంబర దత్తమ్ |
ఆకివీడుస్థం విశ్వాంభరావధూత దత్తమ్ |
నూజివీడుపట్టణే దేవదేవ అవతారమ్ |
భాగ్యనగర స్థితం దత్తావధూతం భజ || ౩ ||

గండిగుంట జనపదే దత్తదిగంబర దేవమ్ |
కొచ్చిన్నగరే స్థితం సిద్ధరాజ నామకమ్ |
మాయాముక్తావధూతమచ్చరపాకే |
లీలావిశ్వంభరం సూరన్నగరే భజ || ౪ ||

సచ్చిదానందజన్మస్థలే దత్తకాశీశ్వరమ్ |
పూర్వసముద్రతీరే దత్తరామేశ్వరమ్ || ౫ ||

సచ్చిదానంద సద్గురు దత్తం భజ భజ భక్త |
షోడశావతారరూప దత్తం భజరే భక్త ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed