Sri Anantha Padmanabha Swamy Vratham – శ్రీ అనంత పద్మనాభ వ్రతము


(గమనిక: ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం ఆచరించవలెను.)

పూర్వాంగం చూ. ||

శ్రీ మహాగణపతి పూజ (పసుపు గణపతి పూజ) చూ. ||

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభ ఫలావాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ అనంత పద్మనాభ దేవతాముద్దిశ్య శ్రీ అనంత పద్మనాభ దేవతా ప్రీత్యర్థం పద్మపురాణోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం అంగత్వేన శ్రీ అనంత పద్మనాభ స్వామి దివ్య వ్రతాం చ కరిష్యే ||

తదంగ యమునా దేవీ పూజాం చ కరిష్యే ||

యమునా దేవీ పూజ ||

ఉప కలశస్థాపన –
కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య | కలశే ఉదకం పూరయిత్వా |
కలశస్యోపరి హస్తం నిధాయ |

ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితా ||
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోఽథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః ||
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః |

ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే |
ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే |

ఆపో వా ఇదగ్‍ం సర్వం విశ్వా భూతాన్యాపః
ప్రాణా వా ఆపః పశవ ఆపోఽన్నమాపోఽమృతమాపః
సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్ఛందాగ్‍స్యాపో
జ్యోతీగ్‍ష్యాపో యజూగ్‍ష్యాపః సత్యమాపః
సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప ఓం ||

(ఉప కలశంలో పుష్పాలు అక్షతలు వేయండి)

అస్మిన్ ఉపకలశే శ్రీ యమునా దేవీం ఆవాహయామి స్థాపయామి పూజయామి ||

ధ్యానం –
క్షీరోదార్ణవసంభూతే ఇంద్రనీలసమప్రభే |
ధ్యానం కరోమి యమునే విష్ణురూపి నమోఽస్తు తే ||
ఓం యమునాయై నమః ధ్యాయామి |

ఆవాహనం-
యమునే తే నమస్తుభ్యం సర్వకామప్రదాయినీ |
ఆవాహయామి భక్త్యా త్వాం సాన్నిధ్యం కురు సువ్రతే ||
ఓం యమునాయై నమః ఆవాహయామి |

ఆసనం-
నమస్కరోమి యమునే సర్వపాపప్రణాశిని |
రత్నసింహాసనం దేవీ స్వీకురుష్వ మయార్పితం ||
ఓం యమునాయై నమః ఆసనం సమర్పయామి |

పాద్యం-
సింహాసన సమారూఢే దేవశక్తిసమన్వితే |
పాద్యం గృహాణ దేవేశి సర్వలక్షణసంయుతే ||
ఓం యమునాయై నమః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం-
నందిపాదే నమస్తుభ్యం సర్వపాపనివారిణి |
అర్ఘ్యం గృహాణ యమునే మద్దత్తమిదముత్తమం ||
ఓం యమునాయై నమః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం-
హారవైఢూర్యసంయుక్తే సర్వలోకహితే శివే |
గృహాణాచమనం దేవి శంకరార్ధశరీరిణి ||
ఓం యమునాయై నమః ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం-
కృష్ణవేణి నమస్తుభ్యం కృష్ణవేణి సులక్షణే |
మధుపర్కం గృహాణేదం మయాదత్తం శుభప్రదే ||
ఓం యమునాయై నమః మధుపర్కం సమర్పయామి |

పంచామృత స్నానం –
క్షీరం –
ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణియమ్ |
భవా వాజస్య సంగథే ||
ఓం యమునాయై నమః క్షీరేణ స్నపయామి |

దధి –
దధిక్రావ్ణోఅకారిషం జిష్ణోరశ్వస్య వాజినః | సురభి నో ముఖా కరత్ప్రాణ ఆయూగ్ంషి తారిషత్ ||
ఓం యమునాయై నమః దధ్నా స్నపయామి |

ఆజ్యం –
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునాతు
అచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః |
ఓం యమునాయై నమః ఆజ్యేన స్నపయామి |

మధు –
మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః |
మాధ్వీర్నః సన్త్వౌషధీః |
మధు నక్తముతోషసి మధుమత్పార్థివగ్ం రజః |
మధుద్యౌరస్తు నః పితా |
మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్‍ం అస్తు సూర్యః |
మాధ్వీర్గావో భవన్తు నః |
ఓం యమునాయై నమః మధునా స్నపయామి |

శర్కరా –
స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే |
స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే |
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే |
బృహస్పతయే మధుమాం అదాభ్యః |
ఓం యమునాయై నమః శర్కరేణ స్నపయామి |

ఫలోదకం –
యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః |
బృహస్పతి ప్రసూతాస్తానో మున్చన్త్వగ్‍ం హసః ||
ఓం యమునాయై నమః ఫలోదకేన స్నపయామి |

శుద్ధోదక స్నానం-
దేవసలిలే నమస్తుభ్యం సర్వలోక హితేప్రియే |
సర్వపాపప్రశమని తుంగభద్రే నమోఽస్తు తే ||
ఓం యమునాయై నమః స్నానం సమర్పయామి |

వస్త్రయుగ్మం-
గురుపాదే నమస్తుభ్యం సర్వలక్షణసంయుతే |
సువ్రతం కురు మే దేవీ తుంగభద్రే నమోఽస్తు తే ||
ఓం యమునాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

ఆభరణాని-
నందిపాదే నమస్తుభ్యం శంకరార్ధశరీరిణి |
సర్వలోకహితే తుభ్యం భీమరథ్యై నమోఽస్తు తే ||
ఓం యమునాయై నమః ఆభరణాని సమర్పయామి |

ఉత్తరీయం-
సహ్యపాదసముద్భూతే సర్వకామఫలప్రదే |
సర్వలక్షణసంయుక్తే భవనాశిని తే నమః ||
ఓం యమునాయై నమః ఉత్తరీయం సమర్పయామి |

గంధం-
కృష్ణపాద సముద్భూతే గంగే త్రిపథగామిని |
జాటజూటసముద్భూతే సర్వకామఫలప్రదే ||
ఓం యమునాయై నమః గంధం సమర్పయామి |

అక్షతలు-
గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్టప్రదాయిని |
స్వీకురుష్వ జగద్వంద్యే అక్షతానమలాన్ శుభాన్ ||
ఓం యమునాయై నమః అక్షతాన్ సమర్పయామి |

పుష్పపూజ-
మందారైః పారిజాతైశ్చ పాటలాశోక చంపకైః |
పూజయామి తవ ప్రీత్యై వందే భక్తవత్సలే ||
ఓం యమునాయై నమః పుష్పాణి పూజయామి |

అథాంగ పూజ-
ఓం చంచలాయై నమః – పాదౌ పూజయామి |
ఓం సుజంఘాయై నమః – జంఘే పూజయామి |
ఓం చపలాయై నమః – జానూనీ పూజయామి |
ఓం పుణ్యాయై నమః – ఊరూ పూజయామి |
ఓం కమలాయై నమః – కటిం పూజయామి |
ఓం గోదావర్యై నమః – స్తనౌ పూజయామి |
ఓం భవనాశిన్యై నమః – కంఠం పూజయామి |
ఓం తుంగభద్రాయై నమః – ముఖం పూజయామి |
ఓం సుందర్యై నమః – లలాటం పూజయామి |
ఓం దేవ్యై నమః – నేత్రే పూజయామి |
ఓం పుణ్యశ్రవణకీర్తనాయై నమః – కర్ణౌ పూజయామి |
ఓం సునాసికాయై నమః – నాసికాం పూజయామి |
ఓం భాగీరధ్యై నమః – శిరః పూజయామి |
ఓం యమునాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి |

ధూపం –
దశాంగం గుగ్గులోపేతం చందనాగరుసంయుతం |
యమునాయై నమస్తుభ్యం ధూపోయం ప్రతిగృహ్యతాం ||
ఓం యమునాయై నమః ధూపం ఆఘ్రాపయామి |

దీపం-
ఘృతవర్తి సమాయుక్తం త్రైలోక్యతిమిరాపహమ్ |
గృహాణ మంగళం దీపం సర్వేశ్వరి నమోఽస్తు తే ||
ఓం యమునాయై నమః దీపం దర్శయామి |

నైవేద్యం-
భక్ష్యైశ్చ భోజ్యైశ్చ రసై షడ్భిః సమన్వితం |
నైవేద్యం గృహ్యతాం దేవీ యమునాయై నమో నమః ||
ఓం యమునాయై నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ |
భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి
(సాయంత్రాం – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా |
ఓం వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా |
ఓం సమానాయ స్వాహా |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అమృతాపిధానమసి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |
ఓం యమునాయై నమః నైవేద్యం సమర్పయామి |

హస్తప్రక్షాళనం-
పానీయం పాపనం శ్రేష్ఠం గంగాసరసోద్భవం |
హస్తప్రక్షాళనార్థం వై గృహాణ సురపూజితే ||
ఓం యమునాయై నమః హస్తప్రక్షాళనం సమర్పయామి |

తాంబూలం-
కర్పూర వాసితం చూర్ణం క్రముకాద్యైః సమన్వితం |
తాంబూలం గృహ్యతాం దేవీ యమునాయై నమోఽస్తు తే ||
ఓం యమునాయై నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం-
ఓం యమునాయై నమః కర్పూర నీరాజనం సమర్పయామి |

మంత్రపుష్పం-
ఓం యమున దేవ్యై చ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమున ప్రచోదయాత్ ||
ఓం యమునాయై నమః మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షిణ నమస్కారం-
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవీ శరణాగతవత్సలే |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ |
ఓం యమునాయై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

క్షమా ప్రార్థన –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరీ ||
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం |
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరీ ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యమునాదేవి |
యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుతే |

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన భగవతీ సర్వాత్మికా శ్రీ యమునా దేవీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||

యేతత్ఫలం శ్రీ యమునాదేవీ చరణారవిందార్పణమస్తు ||

శ్రీ అనంతపద్మనాభ స్వామి షోడశోపచార పూజ 

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభ ఫలావాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ అనంతపద్మనాభ దేవతాముద్దిశ్య శ్రీ అనంతపద్మనాభ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

దర్భ మంత్రము –
కృత్వాదర్భమయం దేవం శ్వేతద్వీపే స్థితం హరిం |
సమన్వితం సప్తఫణైః పింగళాక్షం చ చతుర్భుజం ||

అస్మిన్ దర్భే శ్రీ అనంతపద్మనాభ స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి ||

ప్రాణప్రతిష్ఠ –
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః
పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్ |
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరన్త
మనుమతే మృడయా నః స్వస్తి ||
అమృతం వై ప్రాణా అమృతమాపః
ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే ||
ఆవాహితో భవ స్థాపితో భవ |
సుప్రసన్నో భవ వరదో భవ |

స్వామిన్సర్వ జగన్నాథ యావత్పూజావసానకం |
తావత్వం ప్రీతిభావేన దర్భేఽస్మిన్ సన్నిధిం కురు ||

ధ్యానం –
కృత్వాదర్భమయం దేవం పరిధాన సమన్వితం
ఫణైస్సప్తభిరావిష్టం పింగళాక్షం చ చతుర్భుజం |
దక్షిణాగ్రకరే పద్మం శంఖం తస్యాప్యథః కరే
చక్రమూర్ధ్వకరే వామే గదాంతస్యాపథః కరే ||
అవ్యయం సర్వలోకేశం పీతాంబరధరం హరిం
దుగ్ధాబ్ధిశాయనం ధ్యాత్వా దైవమావాహయేత్సుధీ ||

ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః ధ్యానం సమర్పయామి |

ఆవాహనం-
ఆగచ్ఛానంత దేవేశ తేజోరాశే జగత్పతే |
ఇమం మయా కృతం పూజాం గృహాణ సురసత్తమ ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః ఆవహనం సమర్పయామి |

ఆసనం-
అనంతాయ నమస్తుభ్యం సహస్ర శిరసే నమః |
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః ఆసనం సమర్పయామి |

తోరస్థాపనం-
తస్యాగ్రతోదృఢం సూత్రం కుంకుమాక్తం సుదోరకం |
చతుర్దశ గ్రంథిం సంయుక్తం ఉపకల్ప్య ప్రపూజయేత్ ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః తోరస్థాపనం కరిష్యామి |

అర్ఘ్యం-
అనంతగుణరత్నాయ విశ్వరూపధరాయ చ |
అర్ఘ్యం దదామి తే దేవ నాగాధిపతయే నమః ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి |

పాద్యం-
సర్వాత్మన్ సర్వలోకేశ సర్వవ్యాపిన్ సనాతనా |
పాద్యం గృహాణ భగవన్ దివ్యరూప నమోఽస్తు తే ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః పాద్యం సమర్పయామి |

ఆచమనీయం-
దామోదర నమస్తేఽస్తు నరకార్ణవతారక |
గృహాణాచమనం దేవ మయా దత్తం హి కేశవ ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం-
అనంతానంత దేవేశ అనంతఫలదాయక |
దధిమధ్వాజ్య సమ్మిశ్రం మధుపర్కం దదామి తే ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః మధుపర్కం సమర్పయామి |

పంచామృతస్నానం-
అనంతగుణగంభీర విశ్వరూపధరా నమః |
పంచామృతైశ్చ వివిధైః స్నపయామి దయానిధే ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి |

క్షీరం –
ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణియమ్ |
భవా వాజస్య సంగథే ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః క్షీరేణ స్నపయామి |

దధి –
దధిక్రావ్ణోఅకారిషం జిష్ణోరశ్వస్య వాజినః | సురభి నో ముఖా కరత్ప్రాణ ఆయూగ్ంషి తారిషత్ ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః దధ్నా స్నపయామి |

ఆజ్యం –
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునాతు
అచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః |
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః ఆజ్యేన స్నపయామి |

మధు –
మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః |
మాధ్వీర్నః సన్త్వౌషధీః |
మధు నక్తముతోషసి మధుమత్పార్థివగ్ం రజః |
మధుద్యౌరస్తు నః పితా |
మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్‍ం అస్తు సూర్యః |
మాధ్వీర్గావో భవన్తు నః |
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః మధునా స్నపయామి |

శర్కరా –
స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే |
స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే |
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే |
బృహస్పతయే మధుమాం అదాభ్యః |
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః శర్కరేణ స్నపయామి |

ఫలోదకం –
యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః |
బృహస్పతి ప్రసూతాస్తానో మున్చన్త్వగ్‍ం హసః ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః ఫలోదకేన స్నపయామి |

శుద్ధోదక స్నానం –
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ |
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు |
స్నానం ప్రకల్పయేత్తీర్థం సర్వపాప ప్రముక్తయే ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి |

వస్త్రయుగ్మం –
శ్రీధరాయ నమస్తుభ్యం విష్ణవే పరమాత్మనే |
పీతాంబరం ప్రదాస్యామి అనంతాయ నమోఽస్తు తే ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం –
నారాయణ నమస్తేఽస్తు త్రాహి మాం భవసాగరాత్ |
బ్రహ్మసూత్రం చోత్తరీయం గృహాణ పురుషోత్తమ ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం –
శ్రీగంధం చందనోన్మిశ్రం కుంకుమాదిభిరన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః గంధాన్ సమర్పయామి.

అక్షతాన్-
శాలీయాన్ తండులాన్ రమ్యాన్ మయా దత్తాన్ శుభావహాన్ |
అచ్యుతానంత గోవింద అక్షతాన్ స్వీకురు ప్రభో ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి |

పుష్పపూజ-
కరవీరైః జాతికుసుమైః చంపకైర్వకులైశ్శుభైః |
శతపత్రైశ్చకల్హారైః అర్చయే పురుషోత్తమ ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః పుష్పాణి సమర్పయామి ||

అథ అంగపూజ-
ఓం అనంతాయ నమః – పాదౌ పూజయామి |
ఓం శేషాయ నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం కాలాత్మనే నమః – జంఘే పూజయామి |
ఓం విశ్వరూపాయ నమః – జానూనీ పూజయామి |
ఓం జగన్నాథాయ నమః – గుహ్యం పూజయామి |
ఓం పద్మనాభాయ నమః – నాభిం పూజయామి |
ఓం సర్వాత్మనే నమః – కుక్షిం పూజయామి |
ఓం శ్రీవత్సవక్షసే నమః – వక్షస్థలం పూజయామి |
ఓం చక్రహస్తాయ నమః – హస్తాన్ పూజయామి |
ఓం ఆజానుభాహవే నమః – బాహూన్ పూజయామి |
ఓం శ్రీకంఠాయ నమః – కంఠం పూజయామి |
ఓం చంద్రముఖాయ నమః – ముఖం పూజయామి |
ఓం వాచస్పతయే నమః – వక్త్రం పూజయామి |
ఓం కేశవాయ నమః – నాసికాం పూజయామి |
ఓం నారాయణాయ నమః – నేత్రం పూజయామి |
ఓం గోవిందాయ నమః – శ్రోత్రే పూజయామి |
ఓం అనంతపద్మనాభాయ నమః – శిరః పూజయామి |
ఓం విష్ణవే నమః – సర్వాణ్యంగాని పూజయామి ||

అష్టోత్తరశతనామావళిః –

శ్రీ అనంతపద్మనాభ అష్టోత్తరశతనామావళిః చూ. ||

శ్రీ కృష్ణ అష్టోత్తరశతనామావళిః చూ. ||

ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |

తోరగ్రంథి పూజా-
ఓం కృష్ణాయ నమః – ప్రథమ గ్రంథిం పూజయామి |
ఓం విష్ణవే నమః – ద్వితీయ గ్రంథిం పూజయామి |
ఓం జిష్ణవే నమః – తృతీయ గ్రంథిం పూజయామి |
ఓం కాలాయ నమః – చతుర్థ గ్రంథిం పూజయామి |
ఓం బ్రహ్మణే నమః – పంచమ గ్రంథిం పూజయామి |
ఓం భాస్కరాయ నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి |
ఓం శేషాయ నమః – సప్తమ గ్రంథిం పూజయామి |
ఓం సోమాయ నమః – అష్టమ గ్రంథిం పూజయామి |
ఓం ఈశ్వరాయ నమః – నవమ గ్రంథిం పూజయామి |
ఓం విశ్వాత్మనే నమః – దశమ గ్రంథిం పూజయామి |
ఓం మహాకాలాయ నమః – ఏకాదశ గ్రంథిం పూజయామి |
ఓం సృష్టిస్థిత్యన్తకారిణే నమః – ద్వాదశ గ్రంథిం పూజయామి |
ఓం అచ్యుతాయ నమః – త్రయోదశ గ్రంథిం పూజయామి |
ఓం అనంతపద్మనాభాయ నమః – చతుర్దశ గ్రంథిం పూజయామి |

ధూపం-
వనస్పతి రసైర్దివ్యైః నానాగంధైశ్చ సంయుతం |
ఆఘ్రేయః సర్వ దేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః ధూపం ఆఘ్రాపయామి |

దీపం –
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః దీపం దర్శయామి |

ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ||

నైవేద్యం-
నైవేద్యం గృహ్య దేవేశ భక్తిం మే హ్యచలాంకురు |
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాం గతిం ||
అన్నం చతుర్విధం భక్ష్యైః రసైః షడ్భిః సమన్వితం |
మయా నివేదితం తుభ్యం స్వీకురుష్వ జనార్దన ||

ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ |
భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి
(సాయంత్రం – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా |
ఓం వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా |
ఓం సమానాయ స్వాహా |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అమృతాపిధానమసి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |

ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి |

తాంబూలం-
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం |
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం-
సమః సర్వహితార్థాయ జగదాధారమూర్తయే |
సృష్టిస్థిత్యంతరూపాయ హ్యనంతాయ నమో నమః ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః నీరాజనం సమర్పయామి.

మంత్రపుష్పం –
నమో నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభలాంఛన |
త్వన్నామస్మరణాత్ పాపమశేషం నః ప్రణశ్యతి ||
నమో నమస్తే గోవిందా నారాయణ జనార్దనా |

మంత్రపుష్పం చూ. ||

ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి |
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ||

ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః మంత్రపుష్పణి సమర్పయామి |

ప్రదక్షిణ నమస్కారం –
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్ధన |

నమస్తే దేవదేవేశ నమస్తే ధరణీధర |
నమస్తే సర్వనాగేంద్ర నమస్తే పురుషోత్తమ ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

తోరగ్రహణం- (స్వీకరణ)
దారిద్ర్యనాశనార్థాయ పుత్రపౌత్రప్రవృద్ధయే |
అనంతాఖ్యామిదం సూత్రం ధారయామ్యహముత్తమమ్ ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః తోరగ్రహణం కరిష్యామి |

తోరనమస్కారం-
అనంత సంసార మహాసముద్ర-
మగ్నం మమాఽభ్యుద్ధర వాసుదేవ |
అనంతరూపిన్ వినియోజయస్వ
హ్యనంతసూత్రాయ నమో నమస్తే ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః తోరనమస్కారాన్ సమర్పయామి |

తోరబంధనం- (ధారణం)
సంసార గహ్వరగుహాసు సుఖం విహర్తుం |
వాంఛంతి యే కురు కులోద్వహ శుద్ధసత్త్వాః |
సంపూజ్య చ త్రిభువనేశమనంతరూపం |
బధ్నంతి దక్షిణకరే వరదోరకం తే ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః తోరబంధనం కరిష్యామి |

జీర్ణతోర విసర్జనం-
అనన్తానంత దేవేశ హ్యనంత ఫలదాయక |
సూత్రగ్రంథిషు సంస్థాయ విశ్వరూపాయతే నమః ||

వాయనదానం –
అనంతః ప్రతిగృహ్ణాతి అనంతో వై దదాతి చ |
అనంతస్తారకోభాభ్యాం అనంతాయ నమో నమః ||

వ్రత కథ –

సూతపౌరాణికుండు శౌనకాది మహర్షులం గాంచి ఇట్లనియే; “ఓ మునిశ్రేష్ఠులారా! లోకంబున మనుజుండు దారిద్ర్యముచే పీడింపబడుచుండెనేని అట్టి దారిద్ర్యమును తొలగజేయునట్టి యొక వ్రత శ్రేష్ఠంబు గలదు. దానిని జెప్పెద వినుండు.

పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ములతోడ అరణ్యమున వాసము చేయుచు మిగుల కష్టంబులను అనుభవించి యొకనాడు కృష్ణుని గాంచి “మహాత్మా! నేను తమ్ములతోడ అనేక దినములుగా అరణ్యవాసము చేయుచు మిగుల కష్టము జెందియున్నవాడను, ఇట్టి కష్టసాగరము నందుండి కడతేరునట్టి ఉపాయమును జెప్పవలయు” నని ప్రార్థించిన శ్రీకృష్ణుడు ఇట్లనియె.

“ఓ ధర్మరాజా! పురుషునకును, స్త్రీలకును సకల పాపంబుల పోగొట్టి సకల కార్యముల సమకూర్చునట్టి యనంత వ్రతంబను నొక వ్రతము కలదు. మరియు నా యనంత వ్రతమును భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడొనర్పవలయును. అట్లు గావించిన కీర్తియును, సుఖమును, శుభమును, పుత్రలాభమును గలుగు” నని వచించిన ధర్మరాజు ఇట్లనియె.

“ఓ రుక్మిణీ ప్రాణవల్లభా! ఆ అనంతుడను దైవంబెవరు? అతండాదిశేషుడా! లేక తక్షకుడా! లేక సృష్టికర్తయైన బ్రహ్మయా? లేక పరమాత్మ స్వరూపుడా” యని అడిగిన శ్రీకృష్ణుం డిట్లనియె.

“ఓ పాండుపుత్రా! అనంతుడనువాడను నేనే తప్ప మరి యెవరును కాదు. సూర్యగమనముచే కళాకాష్ఠ ముహూర్తములనియు, పగలు రాత్రియనియు, యుగ సంవత్సర ఋతు మాసకల్పములనియు నీ సంజ్ఞ కలుగ నొప్పుచున్న కాలంబేది కలదో అదియే నా స్వరూపము. నేనే కాలస్వరూపుడను, అనంతుడను పేరున భూభారము తగ్గించుట కొరకును, రాక్షస సంహారము కొరకును వసుదేవుని గృహమున జన్మించితిని. నన్ను కృష్ణుని గాను, విష్ణుని గాను, హరిహరబ్రహ్మలుగను, సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపునిగను, సృష్టిస్థితిలయ కారణభూతునిగను, అనంతపద్మనాభునిగను, మత్స్య కూర్మాద్యవతార స్వరూపునిగను నెరుంగుము. ఏ నాహృదయమందే పదునాలుగు రింద్రులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులును, ద్వాదశాదిత్యులను, సప్తర్షులను, సరిదద్రిద్రుమములును, భూర్భువస్స్వర్లోకాదులు నున్నవో అట్టి నా స్వరూపమును నీ కెరింగించితి”ననిన ధర్మరాజు కృష్ణమూర్తిం గాంచి “ఓ జగన్నాథా! నీవు వచించిన అనంత వ్రతంబెటు లాచరింపవలయును? ఆ వ్రతం బాచరించిన నేమి ఫలము గలుగును? ఏయే దానములం చేయవలయును? ఏ దైవమును పూజింపవలయును? పూర్వం బెవరీ వ్రతం బాచరించి సుఖము జెందిరి?” అని యడిగిన కృష్ణమూర్తి యిట్లనియె.

“ఓ ధర్మరాజా! చెప్పెద వినుము. పూర్వయుగములందు వసిష్ఠగోత్రోద్భవుండును, వేదశాస్త్రార్థ సంపన్నుడును నగు సుమంతుడను నొక బ్రాహ్మణుండు కలడు. అతనికి భృగుమహాఋషి పుత్రికయగు దీక్షాదేవియను భార్య కలదు. ఆ దీక్షాదేవితోడ సుమంతుడు చిరకాలము కాపురము సేయ దీక్షాదేవి గర్భము దాల్చి సుగుణవతియగు నొక కన్యను గనెను. ఆ బాలికకు శీల యను నామకరణం బొనర్చిరి.

ఇట్లుండ కొన్ని దినంబులకు దీక్షాదేవి తాపజ్వరంబుచే మృతినొందెను. పిదప సుమంతుడు వైదిక కర్మలోప భయంబుచే కర్కశ యను నొక కన్యను వివాహము జేసికొనెను. ఆ కర్కశ మిగుల కఠినచిత్తురాలుగను, గయ్యాళిగను, కలహకారిణిగను నుండెను. ఇట్లుండ ప్రధమభార్య యగు దీక్షాదేవి పుత్రికయైన శీల తండ్రి గృహముననే పెరుగుచు, గోడలయందును, గడపలయందును చిత్రవర్ణంబులతో ప్రతిమలను వ్రాయుచు, కూటము మొదలగు స్థలములయందు శంఖ పద్మాదులవలె మ్రుగ్గులు పెట్టుచు దైవభక్తిగలదై యుండెను. ఇట్లుండగా ఆ శీలకు వివాహకాలము సంప్రాప్తమైన తోడనే సుమంతుడు వివాహము చేయవలయునని ప్రయత్నంబు చేయుచుండ కౌండిన్య మహాముని కొన్నిదినంబులు తపస్సుజేసి, పిదప పెండ్లి చేసుకొనవలయునను ఇచ్ఛగలిగి దేశదేశములం దిరుగుచు ఈ సుమంతుని గృహంబునకు వచ్చెను. అంత సుమంతుడు కౌండిన్య మహాముని నర్ఘ్యపాద్యాదులచే పూజించి శుభదినంబున తన కూతురగు శీలనిచ్చి వివాహము చేసెను. ఇట్లు వివాహము జరిగిన పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైన బహుమానం బియ్యవలయునని తలంచి తన భార్యయగు కర్కశ యొద్దకుపోయి “ఓ ప్రియురాలా! మన అల్లునికి ఏదైన బహుమానం బియ్యవలయును గదా! ఏమి ఇయ్యవచ్చు” నని యడుగగనే యా కర్కశ చివుక్కునలేచి లోపలికింబోయి తలుపులు గడియవేసికొని ఇక్కడ ఏమియు లేదు పొమ్మనెను. అంత సుమంతుడు మిగుల చింతించి దారిబత్తెంబునకైన నియ్యక బంపుట యుక్తము కాదని తలంచి పెండ్లికి చేయబడి మిగిలియుండెడు పేలపుపిండి నిచ్చి యల్లునితోడ కూతురును బంపెను. అంత కౌండిన్యుండు సదాచార సంపన్నురాలగు భార్యతోడ బండినెక్కి తిన్నగా తన యాశ్రమంబునకు బోవుచు మధ్యాహ్న వేళయైనందున సంధ్యావందనాది క్రియలు సల్పుటకై బండిదిగి తటాకంబునకేగెను. నాటి దినమున అనంతపద్మనాభ చతుర్దశి గావున నచ్చోట నొక ప్రదేశమునందు అనేకమంది స్త్రీలు ఎర్రని వస్త్రంబులం ధరించుకొని మిగుల భక్తియుక్తులై వేర్వేరుగా అనంతపద్మనాభ స్వామిని పూజ సేయుచుండగ కౌండిన్యుని భార్యయగు శీల యది చూచి మెల్లగా ఆ స్త్రీలయొద్దకు బోయి, “ఓ వనితామణులారా! మీరే దేవుని పూజించుచున్నారు? ఈ వ్రతము పేరేమి? నాకు సవిస్తరంబుగా నానతీయవలయు” నని ప్రార్థించగా, యప్పతివ్రత లిట్లనిరి.

“ఓ పుణ్యవతీ చెప్పెదము వినుము. ఇది అనంతపద్మనాభస్వామి వ్రతము. ఈ వ్రతంబు గాంచిన అనంత ఫలంబు లభించును. మరియు భాద్రపద శుక్ల చతుర్దశినాడు నదీ తీరంబునకుపోయి స్నానం బొనర్చి శుభ్ర వస్త్రములం గట్టుకొని పరిశుద్ధమైన స్థలమును గోమయముచే నలికించి సర్వతోభద్రంబను ఎనిమిది దళములుగల తామర పుష్పము వంటి మండలమును నిర్మించి, యా మండలమునకు చుట్టును పంచవర్ణపు ముగ్గులతోను, తెల్లని బియ్యపు పిండిచేతను అలంకరించి నానావిధ ముగ్గులంబెట్టి ఆ వేదికకు దక్షిణపార్శ్వంబున ఉదకపూరిత కలశంబు నుంచి యా వేదికనడుమ సర్వవ్యాపకుండయిన అనంత పద్మనాభస్వామిని దర్భతో నొనర్చి యం దావాహనము చేసి, శ్వేత ద్వీపవాసిగను, పింగళాక్షుండుగను, సప్తఫణసహితుండుగను, శంఖ చక్ర గదా ధరుండుగను ధ్యానముచేసి, కల్పోక్తప్రకారముగ షోడశోపచార పూజ లొనర్చి, ప్రదక్షిణ నమస్కారములం గావించి, పదునాలుగు ముళ్ళు గలిగి కుంకుమతో దడిసిన క్రొత్తదోరంబును ఆ పద్మనాభస్వామి సమీపమున నుంచి పూజించి అయిదుపళ్ళ గోధుమపిండితో నిరువదియెనిమిది యతిరసములం జేసి నైవేద్యము పెట్టి తోరంబు గట్టుకొని పదునాలుగు అతిరసములను బ్రాహ్మణులకు పాయసదానములిచ్చి తక్కిన వానిని తాను భుజింపవలయును. మరియు పూజాద్రవ్యములన్నియు పదునాలుగేసిగా నుండవలయును. పిదప బ్రాహ్మణ సమారాధన మొనర్చి అనంతపద్మనాభస్వామిని ధ్యానించుచు నుండవలయును. ఓ శీలా! ఇట్లు వ్రతము పరిసమాప్తము సేయవలయు” నని చెప్పిన కౌండిన్యముని భార్యయగు శీల తక్షణంబున స్నానం బొనర్చి యా స్త్రీల సహాయము వలన వ్రతము నాచరించి తోరము గట్టుకొని దారి బత్తెమునకుగాను తెచ్చిన సత్తుపిండిని వాయనదానమిచ్చి, తానును భుజించి, సంతుష్టయై, భోజనాదులచే సంతృప్తుడైన తన పెనిమిటితో బండెనెక్కి యాశ్రమమునకుం బోయెను.

అంత శీల అనంతవ్రతం బాచరించిన మహాత్మ్యము వలన నాశ్రమంబెల్ల స్వర్ణ మయముగాను, గృహం బష్టైశ్వర్య యుక్తముగను నుండుటం గాంచి దంపతులిరువురును సంతోషభరితులై సుఖముగ నుండిరి. శీల, గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది మణిగణఖచిత భూషణ భూషితురాలై అతిథి సత్కారములం గావించుచుండెను.

అట్లుండ నొకనాడు దంపతు లిరువురుం గూర్చుండియుండగ దురాత్ముండగు కౌండిన్యుండు శీల సందిటనుండు తోరముం జూచి ‘ఓ కాంతా! నీవు సందియం దొక తోరము గట్టుకొనియున్నావు గదా! అదెందుల కొరకు కట్టికొని యున్నావు? నన్ను వశ్యంబు చేసికొనుటకా లేక మరియొకరిని వశ్యంబు చేసికొనుటకు గట్టుకొన్నావా’ యని యడిగిన నా శీల యిట్లనియె.

“ఓ ప్రాణనాయకా! అనంతపద్మనాభస్వామిని ధరించియున్నాను. ఆ దేవుని యనుగ్రహంబు వలననే మనకీ ధనధాన్యాది సంపత్తులు గలిగి యున్న” వని యథార్ధము వచించిన కౌండిన్యుండు మిగుల కోపోద్రిక్తుడై కండ్లెర్రజేసి యనంతుడనగా నే దేవుండని దూషించుచు నా తోరమును త్రెంచి భగభగ మండుచుండెడు అగ్నిలో బడవైచెను. అంత నా శీల హాహాకారం బొనర్చుచు పరుగెత్తిపోయి యా తోరమును తీసుకొనివచ్చి పాలలో దడిపి పెట్టెను.

పిదప గొన్ని దినంబులకు కౌండిన్యుం డిట్టి యపకృతి యొనర్చి నందువలన నతని ఐశ్వర్యంబంతయు నశించి గోధనములు దొంగలు పాలుగను, గృహమగ్ని పాలుగను ఆయెను. మరియు గృహమునం దెచటెచట పెట్టిన వస్తువులు అచటచటనే నశించెను. మాటలాడంబోయిన చోట నెల్ల కలహము సంభవించెను. ఎచ్చోటికిం బోయిన నెవరును మాటలాడరైరి.

అంత కౌండిన్యుండు ఏమియుం దోచక దారిద్ర్యముచే పీడింపబడుచు వనగహ్వరంబు ప్రవేశించి క్షుద్బాధాపీడితుండయి అనంతపద్మనాభ స్వామిపై జ్ఞాపకంబు గలిగి అమ్మహాదేవు నెట్లు చూడంగలనని మనంబున ధ్యానించుచు పోయిపోయి ఒకచోట పుష్పఫల భరితంబగు గొప్ప మామిడి చెట్టును చూచి ఆ చెట్టుపై నొక పక్షియై నను వ్రాలకుండుటం గాంచి ఆశ్చర్యము నొంది ఆ చెట్టుతో నిట్లనియె: ఓ వృక్షరాజమా! అనంతుడను నామంబుగల దైవమును చూచితివా? యని యడిగిన నా వృక్షము నే నెరుంగనని చెప్పెను.

అంత కౌండిన్యుండు మరికొంత దూరముపోయి పచ్చిగడ్డిలో నీవలనావల తిరుగుచున్న దూడతోడం గూడిన ఒక గోవును గాంచి, ఓ కామధేనువా! అనంత పద్మనాభస్వామిని చూచితివా యని అడిగిన నదియు తానెరుగనని చెప్పెను.

పిదప కౌండిన్యుండు మరికొంత దూరమువెళ్ళి మోకాళు మట్టు పచ్చికలో నిలుచుండియుండు నొక వృషభమును వీక్షించి – యో వృషభరాజా! అనంత పద్మనాభస్వామిని చూచుతివా యని అడిగిన, అనంత పద్మనాభస్వామి యెవరో నే నెరుంగనని చెప్పెను.

పిమ్మట మరికొంత దూరము పోగా నొకచోట రమ్యంబై మనోహరంబైన రెండు కొలంకులు తరంగంబులతోడం గూడియును కమల కల్హార కుముదోత్పలంబులతోడం గూడియును, హంసకారండవ చక్రవాకాదులతోడం గూడియును, ఒక కొలను నుండి జలంబులు మరియొక కొలనికి పొరలు చుండుటయును గాంచి, ఓ కమలాకరంబులారా! మీరు అనంతపద్మనాభస్వామిని చూచితిరా యని అడిగెను, అందులకు ఆ పుష్కరిణులు మే మెరుగమని చెప్పగా, కౌండిన్యుండు మరికొంత దూరము పోగా నొకచోట నొక గాడిదయును ఒక యేనుగును నిలుచుకొని యుండెను. వానిం జూచి మీరు అనంతపద్మనాభస్వామిని జూచితిరా యని అడిగెను. అవి అనంతపద్మనాభస్వామి యెవరో మే మెరుంగమని చెప్పెను.

అంత కౌండిన్యుండు మిగుల విషాదంబునొంది దుఃఖాక్రాంతుడై మూర్ఛవోయి క్రిందపడెను. అప్పుడు భగవంతుని కృప కలిగి వృద్ధ బ్రాహ్మణ రూపధారుండయి కౌండిన్యుని చెంతకు వచ్చి “ఓ విప్రోత్తమా! ఇటు ర”మ్మని పిలిచికొని తన గృహంబు నకు కొంపోయెను. అంత నా గృహము నవరత్న మణిగణ ఖచితంబుగను, దేవాంగనల తోడం గూడియు నుండుటుంగాంచి యాశ్చర్యంబు నొందియుండ, సదా గరుడ సేవితుండుగను, శంఖచక్రధరుండుగను నుండు తన స్వస్వరూపమును పద్మనాభస్వామి చూపించిన, కౌండిన్యుండు సంతోష సాగరమగ్నుండై భగవంతుని అనేక విధంబుల స్తోత్రము చేసిన, అనంత పద్మనాభస్వామి మిగుల సంతుష్టుండై ‘ఓ విప్రోత్తమా! నీవు చేసిన స్తోత్రంబుచే నేను మిగుల సంతసించితిని. నీకు ఎల్లప్పటికిని దారిద్ర్యము సంభవించకుండునటులను, అంత్యకాలమున శాశ్వత విష్ణులోకము గలుగునట్లును వరము నిచ్చితి’ననిన కౌండిన్యుండు ఆనందాంబుధిం దేలుచు ఇటులనియె-

“ఓ జగన్నాథా! నే తోవలో చూచిన ఆ మామిడిచెట్టు వృత్తాంతమేమి? యా ఆవు ఎక్కడిది? ఆ వృషభంబు ఎక్కడినుండి వచ్చె? ఆ కొలను విశేషంబేమి? ఆ గాడిద, ఏనుగు, బ్రాహ్మణులు ఎవ్వ”రని అడిగిన భగవంతు డిట్లనియె-

“ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా! పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలను జదువుకొని గర్వంబుచే ఎవ్వరికిని విద్యచెప్పక పోవుటచే అడవిలో ఎవరికిని నుపయోగించని మామిడిచెట్టుగా జన్మించెను. తొల్లి యొకండు మహాభాగ్యవంతుడై యుండి తన జీవితకాలమునందు ఎన్నడును బ్రాహ్మణులకు అన్నప్రదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చిగడ్డిలో తిరుగుచున్నాడు. ముందొక రాజు వృషభంబై అడవిలో తిరుగుచున్నాడు. ఆ కొలంకులు రెండును ధర్మం బొకటి యధర్మం బొకటి యని ఎరుంగుము. ఒక మానవుడు సర్వదా పరులను దూషించుచు నుండినందున గాడిదయై పుట్టి తిరుగుచున్నాడు. పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దానధర్మములను తానే విక్రయించి వెనకేసుకొనుట వలన నాతడే ఏనుగుగా జన్మించెను. అనంత పద్మనాభుండైన నేనే బ్రాహ్మణ రూపముతో నీకు ప్రత్యక్షమైతిని. కాన నీవు ఈ యనంతవ్రతంబును పదునాలుగు సంవత్సరములు ఆచరించితివేని నీకు నక్షత్ర స్థానము నిచ్చెద”నని వచియించి భగవంతుడు అంతర్ధానము నొందె.

పిదప కౌండిన్యముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతంబంతయు జెప్పి పదునాలుగు సంవత్సరములు అనంత వ్రతంబు నాచరించి ఇహలోకమున పుత్రపౌత్రాది సంపద లనుభవించి యంత్యకాలంబున నక్షత్రమండలంబు చేరెను.

“ఓ ధర్మరాజా! ఆ మహాత్ముండగు కౌండిన్యుండు నక్షత్ర మండలంబు నందు కానంబడుచున్నాడు. మరియు అగస్త్య మహాముని ఈ వ్రతంబు నాచరించి లోకంబునం బ్రసిద్ధి పొందెను. సగర, దిలీప, భరత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతం బొనర్చి ఇహలోకంబున రాజ్యముల ననుభవించి యత్యంబున స్వర్గముం బొందిరి. కావున నీవ్రత కథను సాంగము వినువారలు ఇహలోకంబున అష్టైశ్వర్యంబుల ననుభవించి పిదప ఉత్తమ పదంబును బొందుదురు.” అని శ్రీకృష్ణుండు చెప్పెనని సూతమహాముని పలికి ముదమందె.

ఇతి శ్రీ అనంతపద్మనాభస్వామి వ్రత కథా సంపూర్ణం ||

సమర్పణం –
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ అనంతపద్మనాభ స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||

తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం శ్రీ అనంతపద్మనాభ స్వామి పాదోదకం పావనం శుభం ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః ప్రసాదం శీరసా గృహ్ణామి |

ఉద్వాసనం –
ఓం యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాః |
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమానః సచన్తే |
యత్ర పూర్వే సాధ్యాః సన్తి దేవాః ||
ఓం శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః యథాస్థానం ఉద్వాసయామి ||

ఓం శాంతిః శాంతిః శాంతిః |


మరిన్ని వ్రతములు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed