Sri Anagha Devi Ashtottara Shatanama Stotram – శ్రీ అనఘాదేవి అష్టోత్తరశతనామ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

అనఘాయై మహాదేవ్యై మహాలక్ష్మ్యై నమో నమః |
అనఘస్వామిపత్న్యై చ యోగేశాయై నమో నమః || ౧ ||

త్రివిధాఘవిదారిణ్యై త్రిగుణాయై నమో నమః |
అష్టపుత్రకుటుంబిన్యై సిద్ధసేవ్యపదే నమః || ౨ ||

ఆత్రేయగృహదీపాయై వినీతాయై నమో నమః |
అనసూయాప్రీతిదాయై మనోజ్ఞాయై నమో నమః || ౩ ||

యోగశక్తిస్వరూపిణ్యై యోగాతీతహృదే నమః |
భర్తృశుశ్రూషణోత్కాయై మతిమత్యై నమో నమః || ౪ ||

తాపసీవేషధారిణ్యై తాపత్రయనుదే నమః |
చిత్రాసనోపవిష్టాయై పద్మాసనయుజే నమః || ౫ ||

రత్నాంగుళీయకలసత్పదాంగుళ్యై నమో నమః |
పద్మగర్భోపమానాంఘ్రితలాయై చ నమో నమః || ౬ ||

హరిద్రాంచత్ప్రపాదాయై మంజీరకలజత్రవే |
శుచివల్కలధారిణ్యై కాంచీదామయుజే నమః || ౭ ||

గలేమాంగళ్యసూత్రాయై గ్రైవేయాళీధృతే నమః |
క్వణత్కంకణయుక్తాయై పుష్పాలంకృతయే నమః || ౮ ||

అభీతిముద్రాహస్తాయై లీలాంభోజధృతే నమః |
తాటంకయుగదీప్రాయై నానారత్నసుదీప్తయే || ౯ ||

ధ్యానస్థిరాక్ష్యై ఫాలాంచత్తిలకాయై నమో నమః |
మూర్ధాబద్ధజటారాజత్సుమదామాళయే నమః || ౧౦ ||

భర్త్రాజ్ఞాపాలనాయై చ నానావేషధృతే నమః |
పంచపర్వాన్వితాఽవిద్యారూపికాయై నమో నమః || ౧౧ ||

సర్వావరణశీలాయై స్వబలాఽఽవృతవేధసే |
విష్ణుపత్న్యై వేదమాత్రే స్వచ్ఛశంఖధృతే నమః || ౧౨ ||

మందహాసమనోజ్ఞాయై మంత్రతత్త్వవిదే నమః |
దత్తపార్శ్వనివాసాయై రేణుకేష్టకృతే నమః || ౧౩ ||

ముఖనిఃసృతశంపాఽఽభత్రయీదీప్త్యై నమో నమః |
విధాతృవేదసంధాత్ర్యై సృష్టిశక్త్యై నమో నమః || ౧౪ ||

శాంతిలక్ష్మై గాయికాయై బ్రాహ్మణ్యై చ నమో నమః |
యోగచర్యారతాయై చ నర్తికాయై నమో నమః || ౧౫ ||

దత్తవామాంకసంస్థాయై జగదిష్టకృతే నమః |
శూభాయై చారుసర్వాంగ్యై చంద్రాస్యాయై నమో నమః || ౧౬ ||

దుర్మానసక్షోభకర్యై సాధుహృచ్ఛాంతయే నమః |
సర్వాంతఃసంస్థితాయై చ సర్వాంతర్గతయే నమః || ౧౭ ||

పాదస్థితాయై పద్మాయై గృహదాయై నమో నమః |
సక్థిస్థితాయై సద్రత్నవస్త్రదాయై నమో నమః || ౧౮ ||

గుహ్యస్థానస్థితాయై చ పత్నీదాయై నమో నమః |
క్రోడస్థాయై పుత్రదాయై వంశవృద్ధికృతే నమః || ౧౯ ||

హృద్గతాయై సర్వకామపూరణాయై నమో నమః |
కంఠస్థితాయై హారాదిభూషాదాత్ర్యై నమో నమః || ౨౦ ||

ప్రవాసిబంధుసంయోగదాయికాయై నమో నమః |
మిష్టాన్నదాయై వాక్ఛక్తిదాయై బ్రాహ్మ్యై నమో నమః || ౨౧ ||

ఆజ్ఞాబలప్రదాత్ర్యై చ సర్వైశ్వర్యకృతే నమః |
ముఖస్థితాయై కవితాశక్తిదాయై నమో నమః || ౨౨ ||

శిరోగతాయై నిర్దాహకర్యై రౌద్ర్యై నమో నమః |
జంభాసురవిదాహిన్యై జంభవంశహృతే నమః || ౨౩ ||

దత్తాంకసంస్థితాయై చ వైష్ణవ్యై చ నమో నమః |
ఇంద్రరాజ్యప్రదాయిన్యై దేవప్రీతికృతే నమః || ౨౪ ||

నహుషాఽఽత్మజదాత్ర్యై చ లోకమాత్రే నమో నమః |
ధర్మకీర్తిసుబోధిన్యై శాస్త్రమాత్రే నమో నమః || ౨౫ ||

భార్గవక్షిప్రతుష్టాయై కాలత్రయవిదే నమః |
కార్తవీర్యవ్రతప్రీతమతయే శుచయే నమః || ౨౬ ||

కార్తవీర్యప్రసన్నాయై సర్వసిద్ధికృతే నమః |
ఇత్యేవమనఘాదేవ్యా దత్తపత్న్యా మనోహరమ్ |
వేదంతప్రతిపాద్యాయా నామ్నామష్టోత్తరం శతమ్ || ౨౭ ||

ఇతి శ్రీ అనఘాదేవి అష్టోత్తరశతనామ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed
%d bloggers like this: