Sravana Mangala Gowri Vratham (Puja, Katha) – శ్రావణ మంగళగౌరీ వ్రతకల్పం


(గమనిక: ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజా చేసి, తరువాత ఈ క్రింది పూజా విధానము ఆచరించవలెను)

పూర్వాంగం పశ్యతు |

హరిద్రా గణపతి పుజా అథవా శ్రీమహాగణపతి షోడశోపచార పూజా పశ్యతు |

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ యావజ్జీవ సౌమాంగళ్య సిద్ధ్యర్థం పుత్రపౌత్రసంపత్సౌభాగ్య సిద్ధ్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచమవర్ష పర్యంతం శ్రీ మంగళగౌరీ దేవతాముద్దిశ్య శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవతా నియమేన ధ్యానావాహనాది షోడశోపచార పూజనేన శ్రీ మంగళగౌరీ వ్రతం కరిష్యే |

ప్రాణప్రతిష్టా –
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః
పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్ |
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరన్త
మనుమతే మృడయా నః స్వస్తి ||
అమృతం వై ప్రాణా అమృతమాపః
ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే ||
అస్మిన్ బింబే శ్రీ మంగళగౌరీ దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ |
శ్రీ మంగళగౌరీదేవతా ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తః సుముహూర్తో అస్తు |

ధ్యానం –
సకుంకుమ విలేపనామళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్ |
అశేషజనమోహినీమరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్ ||

దేవీం షోడశవర్షీయాం శశ్వత్సుస్థిరయౌవనాం
బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మనిభాననామ్ |
శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం
జగద్ధాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదాం
సంసారసాగరే ఘోరే జ్యోతిరూపాం సదా భజే ||

ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః ధ్యాయామి |

ఆసనం –
కల్లోలోల్లసితామృతాబ్ధిలహరీమధ్యే విరాజన్మణి-
-ద్వీపే కల్పకవాటికాపరివృతే కాదంబవాట్యుజ్జ్వలే |
రత్నస్తంభసహస్రనిర్మితసభామధ్యే విమానోత్తమే
చింతారత్నవినిర్మితం జనని తే సింహాసనం భావయే ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి |

ఆవాహనం –
ఏణాంకానలభానుమండలలసచ్ఛ్రీచక్రమధ్యేస్థితాం
బాలార్కద్యుతిభాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీమ్ |
చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం
తాం త్వాం చంద్రకళావతంసమకుటాం చారుస్మితాం భావయే ||
ఆగచ్ఛ సర్వదేవేశీ సర్వకార్యార్థసిద్ధయే |
సర్వసిద్ధిప్రదే దేవీ సర్వపాపప్రణాశినీ ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః ఆవాహనం సమర్పయామి |

ఈశానాదిపదం శివైకఫలదం రత్నాసనం తే శుభం
పాద్యం కుంకుమచందనాదిభరితైరర్ఘ్యం సరత్నాక్షతైః |
శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం
కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే కల్పతామ్ ||

పాద్యం –
గంగాది సలిలైర్యుక్తం సుగంధేన సువాసితం |
పాద్యం గృహాణ సుశ్రోణి రుద్రపత్ని నమోఽస్తు తే ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః పాదయోః పాద్యం సమర్పయామి ||

అర్ఘ్యం –
భాగీరథ్యాది సలిలం నానాతీర్థసమన్వితం |
కర్పూరగంధసంయుక్తం అర్ఘ్యం తుభ్యం దదామ్యహమ్ ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ||

ఆచమనీయం –
రత్నపాత్రే స్థితం తోయం సర్వతీర్థసమన్వితం |
ఆచమ్య తాం మహాదేవి రుద్రకాంతే నమోఽస్తు తే ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ||

మధుపర్కం –
స్వర్ణపాత్రే సమానీతం దధిఖండ మధుప్లుతం |
మధుపర్కం గృహాణేదం మయా దత్తం సురేశ్వరీ ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః మధుపర్కం సమర్పయామి ||

పంచామృత స్నానం –
క్షీరం దధ్యాజ్య మధురా శర్కరా ఫలసంయుతం |
స్నానం స్వీకురు దేవేశి సర్గస్థిత్యంతరూపిణీ |
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః పంచామృతస్నానం సమర్పయామి ||

శుద్ధోదక స్నానం –
లక్ష్యే యోగిజనస్య రక్షితజగజ్జాలే విశాలేక్షణే
ప్రాలేయాంబుపటీరకుంకుమలసత్కర్పూరమిశ్రోదకైః |
గోక్షీరైరపి నారికేలసలిలైః శుద్ధోదకైర్మంత్రితైః
స్నానం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతామ్ ||
గంగాదిసలిలైః పుణ్యైః ఆనీతైః స్వర్ణపాత్రకైః |
స్నానార్థం తే మయా దత్తం సర్వాభరణభూషితే ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః శుద్ధోదకేన స్నపయామి ||

వస్త్రం –
హ్రీంకారాంకితమంత్రలక్షితతనో హేమాచలాత్సంచితైః
రత్నైరుజ్జ్వలముత్తరీయసహితం కౌసుంభవర్ణాంశుకమ్ |
ముక్తాసంతతియజ్ఞసూత్రమమలం సౌవర్ణతంతూద్భవం
దత్తం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతామ్ ||
సర్వదే సర్వదా గౌరి సర్వాభరణభూషితే
పీతాంబరద్వయమిదం గృహాణ పరమేశ్వరీ |
గ్రైవేయహారకేయూర కటకాద్యైః విభూషితం
ధార్యం స్వర్ణమయం శుభ్రం ఉత్తరీయం చ పార్వతీ ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః కంచుక సహిత కౌసుంభ వస్త్రయుగ్మం సమర్పయామి ||

యజ్ఞోపవీతం –
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః స్వర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి |

ఆభరణం –
హంసైరప్యతిలోభనీయగమనే హారావలీముజ్జ్వలాం
హిందోలద్యుతిహీరపూరితతరే హేమాంగదే కంకణే |
మంజీరౌ మణికుండలే మకుటమప్యర్ధేందుచూడామణిం
నాసామౌక్తికమంగులీయకటకౌ కాంచీమపి స్వీకురు ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః నవరత్నమయ ఆభరణాని సమర్పయామి ||

గంధం –
సర్వాంగే ఘనసారకుంకుమఘనశ్రీగంధపంకాంకితం
కస్తూరీతిలకం చ ఫాలఫలకే గోరోచనాపత్రకమ్ |
గండాదర్శనమండలే నయనయోర్దివ్యాంజనం తేఽర్పితం
కంఠాబ్జే మృగనాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతామ్ ||
గంధం మనోహరం దివ్యం ఘనసారసమన్వితం |
తుభ్యం భవాని దాస్యామి చోత్తమం చానులేపనం ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి ||

అక్షతాన్ –
అక్షతాన్ శుభవర్ణాభాన్ హరిద్రాద్యైస్సుసంయుతాన్ |
కాత్యాయని గృహాణ త్వం సర్వదేవనమస్కృతే ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి |

పుష్పమాలికా –
కల్హారోత్పలమల్లికామరువకైః సౌవర్ణపంకేరుహైః
జాతీచంపకమాలతీవకులకైః మందారకుందాదిభిః |
కేతక్యా కరవీరకైర్బహువిధైః క్లుప్తాః స్రజో మాలికాః
సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే గృహ్యతామ్ ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః పుష్పామాలికా సమర్పయామి |

చంపకాశోక కల్హార కుముదోత్పల జాతిభిః |
కరవీరాది కుసుమైః పూజయామి సురేశ్వరీ ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః నానావిధ పరిమళ పత్రైః పుష్పైశ్చ పూజయామి ||

అథ అంగపూజా –
ఉమాయై నమః – పాదౌ పూజయామి |
గౌర్యై నమః – జంఘే పూజయామి |
పార్వత్యై నమః – జానునీ పూజయామి |
జగన్మాత్రే నమః – ఊరూ పూజయామి |
జగత్ప్రతిష్ఠాయై నమః – కటిం పూజయామి |
మూలప్రకృత్యై నమః – నాభిం పూజయామి |
అంబికాయై నమః – ఉదరం పూజయామి |
అన్నపూర్ణాయై నమః – స్తనౌ పూజయామి |
శివసుందర్యై నమః – వక్షస్థలం పూజయామి |
మహాబలాయై నమః – బాహూన్ పూజయామి |
వరప్రదాయై నమః – హస్తాన్ పూజయామి |
కంబుకంఠ్యై నమః – కంఠం పూజయామి |
బ్రహ్మవిద్యాయై నమః – జిహ్వాం పూజయామి |
శాంకర్యై నమః – ముఖం పూజయామి |
శివాయై నమః – నేత్రే పూజయామి |
రుద్రాణ్యై నమః – కర్ణౌ పూజయామి |
సర్వమంగళాయై నమః – లలాటం పూజయామి |
సర్వేశ్వర్యై నమః – శిరః పూజయామి |
మంగళగౌర్యై నమః – సర్వాణ్యంగాని పూజయామి |

అష్టోత్తరశతనామావళీ –

శ్రీ మంగళగౌరీ అష్టోత్తరశతనామావళిః పశ్యతు |

శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిపశ్యతు |

ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి ||

ధూపం –
హంతారం మదనస్య నందయసి యైరంగైరనంగోజ్జ్వలై-
-ర్యైర్భృంగావలినీలకుంతలభరైర్బధ్నాసి తస్యాశయమ్ |
తానీమాని తవాంబ కోమలతరాణ్యామోదలీలాగృహా-
-ణ్యామోదాయ దశాంగగుగ్గులుఘృతైర్ధూపైరహం ధూపయే ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి |

దీపం –
లక్ష్మీముజ్జ్వలయామి రత్ననివహోద్భాస్వత్తరే మందిరే
మాలారూపవిలంబితైర్మణిమయస్తంభేషు సంభావితైః | [రత్న]
చిత్రైర్హాటకపుత్రికాకరధృతైర్గవ్యైర్ఘృతైర్వర్ధితై-
-ర్దివ్యైర్దీపగణైర్ధియా గిరిసుతే సంతుష్టయే కల్పతామ్ ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః దీపం దర్శయామి ||

ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

నైవేద్యం –
హ్రీంకారేశ్వరి తప్తహాటకకృతైః స్థాలీసహస్రైర్భృతం
దివ్యాన్నం ఘృతసూపశాకభరితం చిత్రాన్నభేదం తథా |
దుగ్ధాన్నం మధుశర్కరాదధియుతం మాణిక్యపాత్రే స్థితం
మాషాపూపసహస్రమంబ సఫలం నైవేద్యమావేదయే ||

ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ |
భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా |
ఓం వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా |
ఓం సమానాయ స్వాహా |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అమృతాపి ధానమసి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |

ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః మహానైవేద్యం సమర్పయామి ||

తాంబూలం –
సచ్ఛాయైర్వరకేతకీదలరుచా తాంబూలవల్లీదలైః
పూగైర్భూరిగుణైః సుగంధిమధురైః కర్పూరఖండోజ్జ్వలైః |
ముక్తాచూర్ణవిరాజితైర్బహువిధైర్వక్త్రాంబుజామోదనైః
పూర్ణా రత్నకలాచికా తవ ముదే న్యస్తా పురస్తాదుమే ||
పూగీఫలైస్స కర్పూరైః నాగవల్లీదళైర్యుతమ్ |
ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి ||

నీరాజనం –
కన్యాభిః కమనీయకాంతిభిరలంకారామలారార్తికా
పాత్రే మౌక్తికచిత్రపంక్తివిలసత్కర్పూరదీపాలిభిః |
తత్తత్తాలమృదంగగీతసహితం నృత్యత్పదాంభోరుహం
మంత్రారాధనపూర్వకం సువిహితం నీరాజనం గృహ్యతామ్ ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి |

నీరజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

మంత్రపుష్పం –
వరాంకుశౌ పాశమభీతిముద్రాం
కరైర్వహన్తీం కమలాసనస్థామ్ |
బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం
భజేఽహమంబాం జగదీశ్వరీం తామ్ ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోఽస్తు తే ||
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |

సర్వోపచారాః –
లక్ష్మీర్మౌక్తికలక్షకల్పితసితచ్ఛత్త్రం తు ధత్తే రసా-
-దింద్రాణీ చ రతిశ్చ చామరవరే ధత్తే స్వయం భారతీ |
వీణామేణవిలోచనాః సుమనసాం నృత్యంతి తద్రాగవ-
-ద్భావైరాంగికసాత్త్వికైః స్ఫుటరసం మాతస్తదాకర్ణ్యతామ్ ||

ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః చామరైర్వీజయామి |
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః నృత్యం దర్శయామి |
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః గీతం శ్రావయామి |
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః అశ్వానారోహయామి |
ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః గజానారోహయామి |

ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః నానావిధ రాజ్ఞోపచార భక్త్యోపచారాన్ శక్త్యోపచారాన్ సమర్పయామి ||

నమస్కారాన్ –
హ్రీంకారత్రయసంపుటేన మనునోపాస్యే త్రయీమౌలిభి-
-ర్వాక్యైర్లక్ష్యతనో తవ స్తుతివిధౌ కో వా క్షమేతాంబికే |
సల్లాపాః స్తుతయః ప్రదక్షిణశతం సంచార ఏవాస్తు తే
సంవేశో నమసః సహస్రమఖిలం త్వత్ప్రీతయే కల్పతామ్ ||

ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి ||

తోరబంధన మంత్రం –
బధ్నామి దక్షిణేహస్తే పంచసూత్రం శుభప్రదం |
పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే ||

***
వ్రతకథా ప్రారంభం |

పూర్వము ధర్మపాలుడను ఒక వైశ్యుడు కలడు. మిక్కిలి ధనవంతుడు, భక్తివంతుడైన ఆతనికి పెళ్ళి అయినా సంతానము కలుగలేదు. తన భార్యతో కలసి దాన ధర్మములు చేయసాగెను. ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి యింటికి భిక్షకు వచ్చెను. ధర్మపాలుని భార్య వేగమే బంగారు పళ్ళెములో భిక్ష తీసుకురాగా, సాధువు యా భిక్ష స్వీకరింపక వెడలిపోసాగెను. కారణమేమియో చెప్పుమనగా, పుత్రపౌత్రులులేని ఇంట భిక్షస్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గూర్చి తపమాచరింపుమని ఉపాయము చెప్పి వెళ్ళెను.

పిదప ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు, అల్పాయుష్కుడగు పుత్రుడు కలుగగలడని వరమిచ్చి, ఊరువెలుపలయున్న ఆలయము వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక ఫలము నీ భార్యకొసగుమని ఆనతిచ్చెను. అటులనేయని ఆ ధర్మపాలుడు వృక్షము వద్దకు వెళ్ళి అత్యాశ వలన ఒక్కఫలముగాక మిక్కిలిఫలములను ద్రుంచి మూటగట్టుకొని వచ్చెను. మూటవిప్పి చూడ ఒక్క ఫలమే కనిపించగా, అదియే ప్రాప్తమనుకుని ఆతని భార్య భుజించి అనతికాలమందు ఒక పుత్రునకు జన్మనిచ్చెను. ఆతనికి వారదత్తుడను నామకరణము జేసి పెంచిపెద్దజేసిరి.

ఒక రోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేమిటని వారదత్తుడడిగెను. దానికి యా తల్లి ఆతని అల్పాయుర్దాయము గల విషయమును జెప్పి యమభటులు వచ్చి తీసుకువెళ్ళెదరని శోకింపసాగెను. ఇది విని, “తల్లీ ! నేను బ్రతికి ఉండగనే కాశీయాత్ర చేసివచ్చెద”నని తెలిపి తన మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరెను. మార్గమధ్యమున వారు ప్రతిష్ఠా నగరమును చేరుకొని ఒక పూదోటలో బసజేసిరి.

ఆ పూదోటయందు సుశీల యను రాజకుమార్తె తన చెలికత్తెలతో ఆడుకొనుచుండెను. ఆటమధ్యలో తగవువచ్చి ఒకరినొకరు “విధవా” అని దుర్భాషలాడిరి. అందుకు ఆ సుశీల, తన ఇంట మానవతి యైన తన తల్లి మంగళకరమైన గౌరీ దేవీ వ్రతము చేసి తనకు వాయనము ఇచ్చెనుగాన యా వ్రత మహిమవలన తమ యింట వైధవ్యము ఉండదని పలికెను. ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనల్లుడిని ఇచ్చి వివాహము చేసిన బ్రతుకగలడని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారదత్తుని ఇచ్చి వివాహము చేసెను.

వివాహము జరిగిన రోజు సుశీల మంగళగౌరీ దేవిని పూజించెను. ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై “నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండమున్నది గాన, యా పామును పట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టికుండలో మూటగట్టు”మని ఆనతిచ్చెను. సుశీల ఉలికిపడి మేల్కొనగా తన భర్త యెదుట ఒక సర్పము కనిపించినది. సుశీల ధైర్యమువీడక, నిదురించుచున్న తన భర్త తొడమీద యెక్కి అటకమీదనున్న కుండను దింపి, సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రముతో మూటగట్టి నిదురించెను. తెల్లవారక మునుపే వారదత్తుని మేనమామ ఆతనిని మేల్కొలిపి కాశీకి తీసుకుపోయెను.

సుశీల లేచి తన భర్త కనబడుటలేదను విషయమును తన తలిదండ్రులకు చెప్పెను. సర్పమును ఉంచిన కుండను తన తల్లి తెరచి చూడగా అందులో ఒక ముత్యాలహారము కనిపించెను. అటుపిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహము జరుప యత్నమును తిరస్కరించి, తన భర్తకోసము వేచిచూసెదనని పలికి మంగళగౌరీ పూజచేయుచూ బాటసారులకు అన్నదానము చేయుచూ తాంబూలాది బహుమతులు ఇవ్వసాగెను.

మరుసటి సంవత్సమున కాశీ దర్శనం ముగించుకుని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగివచ్చుచూ, సుశీల యుండు నగరమున బసచేసెను. ఆ రాత్రి ఆతడి స్వప్నమందు మంగళగౌరీ దేవి యమభటులతో యుద్ధము జేసి ఓడించినట్టు గాంచెను. ఈ స్వప్నమును తన మేనమామకు తెలుపగా మంగళగౌరీ మహిమచే అపమృత్యుదోషము పోయినదని గ్రహించితిరి.

మరుసటి దినము అక్కడి సత్రమునందు జరుగు అన్నదానములో వారదత్తుని చూచి సుశీల గుర్తుపట్టి, తన భర్త ఈతనేయని తన తల్లిదండ్రులకు తెలిపి తనవద్ద ఉన్న వారదత్తుడు విడిచిన అంగుళీయకమును జూపెను. వారు వారదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారెతో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తునితో పంపెను.

పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతమాచరించి, అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అంధులవుటగాంచి, తనతో తెచ్చిన కాటుకను వారి కనులకు పెట్టగా, వారికి దృష్టి వచ్చెను. మంగళగౌరీదేవి మహిమవలన ఇది యంతా జరిగినదని గ్రహించి సుశీల వారదత్తులిరువురు యావజ్జీవ పర్యంతం శ్రావణమంగళగౌరీ వ్రతమాచరించుచూ సుఖముగ నుండిరి. సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచెనని గ్రహించిన వారి బంధుమిత్రాదులు మంగళగౌరీ వ్రతము చేయుచూ ఆనందముగయుండిరి.

వ్రతకథా సంపూర్ణం |
***
ప్రార్థనా –
శ్రీమంత్రాక్షరమాలయా గిరిసుతాం యః పూజయే చేతసా
సంధ్యాసు ప్రతివాసరం సునియతస్తస్యామలం స్యాన్మనః |
చిత్తాంభోరుహమంటపే గిరిసుతా నృత్తం విధత్తే రసా-
-ద్వాణీ వక్త్రసరోరుహే జలధిజా గేహే జగన్మంగళా ||

మంగళచండికా స్తవం పశ్యతు |

పుత్రాన్దేహి ధనం దేహి సౌభాగ్యం సర్వమంగళే |
సౌమాంగళ్యం సుఖం జ్ఞానం దేహి మే శివసుందరీ ||

క్షమాప్రార్థనా –
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ |
తత్సర్వం క్షమ్యతాం దేవి కాత్యాయని నమోఽస్తు తే |

సర్వం శ్రీ మంగళగౌరీ దేవతార్పణమస్తు |

అనయా మయా కృత పూజయా శ్రీమంగళగౌరీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు |
మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు |

వాయనదాన శ్లోకం –
కాత్యాయనీ శివా గౌరీ సావిత్రీ సర్వమంగళా |
సువాసినిభ్యో దాస్యామి వాయనాని ప్రసీదతు ||

|| స్వస్తి ||


మరిన్ని వ్రతములు చూడండి.


గమనిక: రాబోయే ఆషాఢ నవరాత్రుల సందర్భంగా "శ్రీ వారాహీ స్తోత్రనిధి" పుస్తకము అందుబాటులో ఉంది. Click here to buy.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

5 thoughts on “Sravana Mangala Gowri Vratham (Puja, Katha) – శ్రావణ మంగళగౌరీ వ్రతకల్పం

  1. in My strotranidhi app sravana mangala gowri pooja not visible i can search so many times but there is no pooja vratakalpam..recently updated my app also but no results pls find my query

  2. స్తోత్ర నిధి టీం కి పాదాభివందనములు, శతకోటి ధన్యవాదములు.

స్పందించండి

error: Not allowed