Sri Krishna Bhujanga Prayata Ashtakam – శ్రీ కృష్ణ భుజంగప్రయాతాష్టకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

సదా గోపికామండలే రాజమానం
లసన్నృత్యబంధాదిలీలానిదానమ్ |
గలద్దర్పకందర్పశోభాభిదానం
భజే నందసూనుం సదానందరూపమ్ || ౧ ||

వ్రజస్త్రీజనానందసందోహసక్తం
సుధావర్షివంశీనినాదానురక్తమ్ |
త్రిభంగాకృతి స్వీకృతస్వీయభక్తం
భజే నందసూనుం సదానందరూపమ్ || ౨ ||

స్ఫురద్రాసలీలావిలాసాతిరమ్యం
పరిత్యక్తగేహాదిదాసైకగమ్యమ్ |
విమానస్థితాశేషదేవాదినమ్యం
భజే నందసూనుం సదానందరూపమ్ || ౩ ||

స్వలీలారసానందదుగ్ధోదమగ్నం
ప్రియస్వామినీబాహుకంఠైకలగ్నమ్ |
రసాత్మైకరూపాఽవబోధం త్రిభంగం
భజే నందసూనుం సదానందరూపమ్ || ౪ ||

రసామోదసంపాదకం మందహాసం
కృతాభీరనారీవిహారైకరాసమ్ |
ప్రకాశీకృతస్వీయనానావిలాసం
భజే నందసూనుం సదానందరూపమ్ || ౫ ||

జితాఽనంగసర్వాంగశోభాభిరామం
క్షపాపూరితస్వామినీవృందకామమ్ |
నిజాధీనతావర్తిరామాతివామం
భజే నందసూనుం సదానందరూపమ్ || ౬ ||

స్వసంగీకృతానంతగోపాలబాలం
వృతస్వీయగోపీమనోవృత్తిపాలమ్ |
కృతానంతచౌర్యాదిలీలారసాలం
భజే నందసూనుం సదానందరూపమ్ || ౭ ||

ధృతాద్రీశగోవర్ధనాధారహస్తం
పరిత్రాతగోగోపగోపీసమస్తమ్ |
సురాధీశసర్వాదిదేవప్రశస్తం
భజే నందసూనుం సదానందరూపమ్ || ౮ ||

ఇతి శ్రీహరిరాయాచార్య విరచితం శ్రీ కృష్ణ భుజంగప్రయాతాష్టకమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కృష్ణ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed