Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
స్వసంకల్పకలాకల్పైరాయుధైరాయుధేశ్వరః |
జుష్టః షోడశభిర్దివ్యైర్జుషతాం వః పరః పుమాన్ || ౧ ||
యదాయత్తం జగచ్చక్రం కాలచక్రం చ శాశ్వతమ్ |
పాతు వస్తత్పరం చక్రం చక్రరూపస్య చక్రిణః || ౨ ||
యత్ప్రసూతిశతైరాసన్ ద్రుమాః పరశులాంఛితాః | [రుద్రాః]
స దివ్యో హేతిరాజస్య పరశుః పరిపాతు వః || ౩ ||
హేలయా హేతిరాజేన యస్మిన్ దైత్యాః సముద్ధృతే |
శకుంతా ఇవ ధావంతి స కుంతః పాలయేత వః || ౪ ||
దైత్యదానవముఖ్యానాం దండ్యానాం యేన దండనమ్ |
హేతిదండేశదండోఽసౌ భవతాం దండయేద్ద్విషః || ౫ ||
అనన్యాన్వయభక్తానాం రుంధన్నాశామతంగజాన్ |
అనంకుశవిహారో వః పాతు హేతీశ్వరాంకుశః || ౬ ||
సంభూయ శలభాయంతే యత్ర పాపాని దేహినామ్ |
స పాతు శతవక్త్రాగ్నిహేతిర్హేతీశ్వరస్య వః || ౭ ||
అవిద్యాం స్వప్రకాశేన విద్యారూపశ్ఛినత్తి యః |
స సుదర్శననిస్త్రింశః సౌతు వస్తత్త్వదర్శనమ్ || ౮ ||
క్రియాశక్తిగుణోవిష్ణోర్యో భవత్యతిశక్తిమాన్ |
అకుంఠశక్తిః సా శక్తిరశక్తిం వారయేత వః || ౯ ||
తారత్వం యస్య సంస్థానే శబ్దే చ పరిదృశ్యతే |
ప్రభోః ప్రహరణేంద్రస్య పాంచజన్యః స పాతు వః || ౧౦ ||
యం సాత్త్వికమహంకారం ఆమనంత్యక్షసాయకమ్ |
అవ్యాద్వశ్చక్రరూపస్య తద్ధనుః శార్‍ఙ్గధన్వనః || ౧౧ ||
ఆయుధేంద్రేణ యేనైవ విశ్వసర్గో విరచ్యతే |
స వః సౌదర్శనః కుర్యాత్ పాశః పాశవిమోచనమ్ || ౧౨ ||
విహారో యేన దేవస్య విశ్వక్షేత్రకృషీవలః |
వ్యజ్యతే తేన సీరేణ నాసీరవిజయోఽస్తు వః || ౧౩ ||
ఆయుధానామహం వజ్రం ఇత్యగీయత యః స వః |
అవ్యాద్ధేతీశవజ్రోఽసావదధీచ్యస్థిసంభవః || ౧౪ ||
విశ్వసంహృతిశక్తిర్యా విశ్రుతా బుద్ధిరూపిణీ |
సా వః సౌదర్శనీ భూయాద్గదప్రశమనీ గదా || ౧౫ ||
యాత్యతిక్షోదశాలిత్వం ముసలో యేన తేన వః |
హేతీశముసలేనాశు భిద్యతాం మోహమౌసలమ్ || ౧౬ ||
శూలిదృష్టమనోర్వాచ్యో యేన శూలయతి ద్విషః |
భవతాం తేన భవతాత్ త్రిశూలేన విశూలతా || ౧౭ ||
అస్త్రగ్రామస్య కృత్స్నస్య ప్రసూతిం యం ప్రచక్షతే |
సోఽవ్యాత్ సుదర్శనో విశ్వం ఆయుధైః షోడశాయుధః || ౧౮ ||
శ్రీమద్వేంకటనాథేన శ్రేయసే భూయసే సతామ్ |
కృతేయమాయుధేంద్రస్య షోడశాయుధసంస్తుతిః || ౧౯ ||
ఇతి శ్రీవేదాంతదేశిక విరచితం షోడశాయుధ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ నరసింహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.