Sri Vishnu Kavacham – శ్రీ విష్ణు కవచ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

ధ్యానం –
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||

కవచం –
ఓం | పూర్వతో మాం హరిః పాతు పశ్చాచ్చక్రీ చ దక్షిణే |
కృష్ణ ఉత్తరతః పాతు శ్రీశో విష్ణుశ్చ సర్వతః || ౧ ||

ఊర్ధ్వమానందకృత్ పాతు అధస్తాచ్ఛార్ఙ్గభృత్ సదా |
పాదౌ పాతు సరోజాంఘ్రిః జంఘే పాతు జనార్దనః || ౨ ||

జానునీ మే జగన్నాథః ఊరూ పాతు త్రివిక్రమః |
గుహ్యం పాతు హృషీకేశః పృష్ఠం పాతు మమావ్యయః || ౩ ||

పాతు నాభిం మమానంతః కుక్షిం రాక్షసమర్దనః |
దామోదరో మే హృదయం వక్షః పాతు నృకేసరీ || ౪ ||

కరౌ మే కాళియారాతిః భుజౌ భక్తార్తిభంజనః |
కంఠం కాలాంబుదశ్యామః స్కంధౌ మే కంసమర్దనః || ౫ ||

నారాయణోఽవ్యాన్నాసాం మే కర్ణౌ కేశిప్రభంజనః |
కపోలే పాతు వైకుంఠో జిహ్వాం పాతు దయానిధిః || ౬ ||

ఆస్యం దశాస్యహంతాఽవ్యాన్నేత్రే మే హరిలోచనః |
భ్రువౌ మే పాతు భూమీశో లలాటం మే సదాఽచ్యుతః || ౭ ||

ముఖం మే పాతు గోవిందః శిరో గరుడవాహనః |
మాం శేషశాయీ సర్వేభ్యో వ్యాధిభ్యో భక్తవత్సలః || ౮ ||

పిశాచాగ్ని జలేభ్యో మామాపద్భ్యో పాతు వామనః |
సర్వేభ్యో దురితేభ్యశ్చ పాతు మాం పురుషోత్తమః || ౯ ||

ఇదం శ్రీవిష్ణుకవచం సర్వమంగళదాయకమ్ |
సర్వరోగప్రశమనం సర్వశత్రువినాశనమ్ || ౧౦ ||

ఇతి శ్రీ విష్ణు కవచమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ విష్ణు స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed