Sri Parameshwara Seeghra pooja vidhanam – శ్రీ పరమేశ్వర శీఘ్ర పూజ విధానం

గమనిక: ఈ పూజవిధానం కేవలం తొందరలో ఉన్నవారికి మాత్రమే. తొందర లేని వారు సక్రమంగా షోడశోపచార పూజ చేయగలరు. ఈ పూజకి కావలసిన సమాన్లు ఇవి.
– పసుపు, కుంకుమ, తడిపిన గంధం, భస్మం
– పరమేశ్వరుని ప్రతిమ, వినాయకుడి ప్రతిమ
– పువ్వులు, పసుపు అక్షతలు
– బెల్లం లేక రెండు అరటిపళ్ళు లేక ఒక కొబ్బరికాయ (నైవేద్యానికి)
– ఆచమన పాత్ర, కలశానికి చిన్న చెంబు (రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి)
– అగరవత్తులు, దీపానికి నూనె, వత్తివేసిన కుందులు, అగ్గిపెట్టె
– కూర్చోవడానికి ఆసనం

శివాయ గురవే నమః ||

శుచిః –
(ఆచమన పాత్రలోని నీళ్ళు తలమీద జల్లుకోండి)
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష ||

ప్రార్థన –
(మీ ముఖానికి కుంకుమ పెట్టుకుని, నమస్కారం చేయండి)
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||
యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం ||

ఆచమ్య –
(ఆచమనం చేయండి)
ఓం కేశవాయ స్వాహా |
ఓం నారాయణాయ స్వాహా |
ఓం మాధవాయ స్వాహా |
ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః |
ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః |
ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః |
ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః |
ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః |
ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః |
ఓం శ్రీ కృష్ణాయ నమః |

దీపారాధనం –
(దీపం వెలిగించి గంధం కుంకుమ బొట్టు పెట్టి, ఇది చదివి, నమస్కారం చేయండి)
ఓం దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః |
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ||

ప్రాణాయామం –
(ప్రాణాయామం చేయండి)
ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ |
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |

లఘుసంకల్పం –
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఏతత్ మంగళ ప్రదేశే, నారాయణ ముహూర్తే, ____ (మీ పేరు చెప్పండి) నామధేయాఽహం శ్రీ పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం లఘుపూజాం కరిష్యే ||

కలశప్రార్థన –
(కలశానికి బొట్టు పెట్టి, ఒక పువ్వు వేసి, అక్షతలు వేసి నమస్కారం చేయండి)
గంగే చ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు ||
ఓం కలశదేవతాభ్యో నమః సకల పూజార్థే అక్షతాన్ సమర్పయామి ||

గణపతి ప్రార్థన –
(వినాయకుడికి ప్రతిమకి బొట్టు పెట్టి, నమస్కారం చేసి, పువ్వులు అక్షతలు వేయండి)
ఓం గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ ||
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ||
ఓం శ్రీ మహాగణపతయే నమః సకల పూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |

భస్మధారణ మంత్రం –
(భస్మాన్ని కలశంలోని నీళ్ళతో తడిపి నుదుటికి రాసుకోండి)
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||

ధ్యానం –
(పరమేశ్వరుని ప్రతిమకి బొట్టు పెట్టి, నమస్కారం చేయండి)
వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం |
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం |
వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం |
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ ||
అస్మిన్ ప్రతిమే శ్రీ పరమేశ్వర స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి ||

ఔపచారికస్నానం –
(కలశంలోని నీళ్ళను స్వామివారి మీద పువ్వుతో చిలకరించండి)
ఓం నమః శివాయ ఔపచారిక స్నానం సమర్పయామి ||

గంధం –
(ఒక పువ్వును గంధంలో ముంచి స్వామి వద్ద పెట్టండి)
ఓం నమః శివాయ గంధం సమర్పయామి ||

పుష్పం –
(పువ్వులు పెట్టండి)
ఓం నమః శివాయ పుష్పం సమర్పయామి ||

ధూపం –
(అగరవత్తి వెలిగించి స్వామికి చూపండి)
ఓం నమః శివాయ ధూపం సమర్పయామి ||

దీపం –
(దీపాలకు అక్షతలు చూపి, స్వామివద్ద వేయండి)
ఓం నమః శివాయ దీపం సమర్పయామి ||

నైవేద్యం –
(నైవేద్యం మీద కలశంలోని నీళ్ళను జల్లి, నైవేద్యాన్ని స్వామి వారికి చూపండి)
ఓం నమః శివాయ నైవేద్యం సమర్పయామి ||

నమస్కారం –
(పువ్వులు ఆక్షతలు పట్టుకుని, ఇది చదివి, స్వామి వద్ద వేసి, నమస్కారం చేయండి)
ఓం అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః |
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ||
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి |
తన్నో రుద్రః ప్రచోదయాత్ ||
ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం
బ్రహ్మాఽధిపతిర్-బ్రహ్మణోఽధిపతిర్-బ్రహ్మా
శివో మే అస్తు సదాశివోమ్ ||
ఓం నమః శివాయ మంత్రపుష్ప సహిత నమస్కారం సమర్పయామి |

సమర్పణం –
(నమస్కారం చేసి, అక్షతలు స్వామి వద్ద వేయండి)
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు | స్వస్తి ||

(స్వామి వద్ద ఉన్న అక్షతలు మీ తలమీద వేసుకుని ఇది చెప్పండి)
ఓం శాంతిః శాంతిః శాంతిః |

Facebook Comments

You may also like...

3 వ్యాఖ్యలు

 1. Dr k v reddy అంటున్నారు:

  Dear Krishnakanth Garu namaskaramu
  Thank you for short version of Parameshwara pooja

 2. Ashok అంటున్నారు:

  can you please upload Shri Durga stuthi in telugu

 3. venkatesh అంటున్నారు:

  please provide print option

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Download Stotra Nidhi mobile app