Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
నారాయణాయ శుద్ధాయ శాశ్వతాయ ధ్రువాయ చ |
భూతభవ్యభవేశాయ శివాయ శివమూర్తయే || ౧ ||
శివయోనేః శివాద్యాయి శివపూజ్యతమాయ చ |
ఘోరరూపాయ మహతే యుగాంతకరణాయ చ || ౨ ||
విశ్వాయ విశ్వదేవాయ విశ్వేశాయ మహాత్మనే |
సహస్రోదరపాదాయ సహస్రనయనాయ చ || ౩ ||
సహస్రబాహవే చైవ సహస్రవదనాయ చ |
శుచిశ్రవాయ మహతే ఋతుసంవత్సరాయ చ || ౪ ||
ఋగ్యజుఃసామవక్త్రాయ అథర్వశిరసే నమః |
హృషీకేశాయ కృష్ణాయ ద్రుహిణోరుక్రమాయ చ || ౫ ||
బృహద్వేగాయ తార్క్ష్యాయ వరాహాయైకశృంగిణే |
శిపివిష్టాయ సత్యాయ హరయేఽథ శిఖండినే || ౬ ||
హుతాశాయోర్ధ్వవక్త్రాయ రౌద్రానీకాయ సాధవే |
సింధవే సింధువర్షఘ్నే దేవానాం సింధవే నమః || ౭ ||
గరుత్మతే త్రినేత్రాయ సుధర్మాయ వృషాకృతే |
సమ్రాడుగ్రే సంకృతయే విరజే సంభవే భవే || ౮ ||
వృషాయ వృషరూపాయ విభవే భూర్భువాయ చ |
దీప్తసృష్టాయ యజ్ఞాయ స్థిరాయ స్థవిరాయ చ || ౯ ||
అచ్యుతాయ తుషారాయ వీరాయ చ సమాయ చ |
జిష్ణవే పురుహూతాయ వసిష్ఠాయ వరాయ చ || ౧౦ ||
సత్యేశాయ సురేశాయ హరయేఽథ శిఖండినే |
బర్హిషాయ వరేణ్యాయ వసవే విశ్వవేధసే || ౧౧ ||
కిరీటినే సుకేశాయ వాసుదేవాయ శుష్మిణే |
బృహదుక్థ్యసుషేణాయ యుగ్మే దుందుభయే తథా || ౧౨ ||
భయేసఖాయ విభవే భరద్వాజేఽభయాయ చ |
భాస్కరాయ చ చంద్రాయ పద్మనాభాయ భూరిణే || ౧౩ ||
పునర్వసుభృతత్వాయ జీవప్రభవిషాయ చ |
వషట్కారాయ స్వాహాయ స్వధాయ నిధనాయ చ || ౧౪ ||
ఋచే చ యజుషే సామ్నే త్రైలోక్యపతయే నమః |
శ్రీపద్మాయాత్మసదృశే ధరణీధారణే పరే || ౧౫ ||
సౌమ్యాసౌమ్యస్వరూపాయ సౌమ్యే సుమనసే నమః |
విశ్వాయ చ సువిశ్వాయ విశ్వరూపధరాయ చ || ౧౬ ||
కేశవాయ సుకేశాయ రశ్మికేశాయ భూరిణే |
హిరణ్యగర్భాయ నమః సౌమ్యాయ వృషరూపిణే || ౧౭ ||
నారాయణాగ్ర్యవపుషే పురుహూతాయ వజ్రిణే |
వర్మిణే వృషసేనాయ ధర్మసేనాయ రోధసే || ౧౮ ||
మునయే జ్వరముక్తాయి జ్వరాధిపతయే నమః |
అనేత్రాయ త్రినేత్రాయ పింగళాయ విడూర్మిణే || ౧౯ ||
తపోబ్రహ్మనిధానాయ యుగపర్యాయిణే నమః |
శరణాయ శరణ్యాయ భక్తేష్టశరణాయ చ || ౨౦ ||
నమః సర్వభవేశాయ భూతభవ్యభవాయ చ |
పాహి మాం దేవదేవేశ కోఽప్యజోఽసి సనాతనః || ౨౧ ||
ఏవం గతోఽస్మి శరణం శరణ్యం బ్రహ్మయోనినామ్ |
స్తవ్యం స్తవం స్తుతవతస్తత్తమో మే ప్రణశ్యత || ౨౩ ||
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి ద్విచత్వారింశోఽధ్యాయే శ్రీ నారాయణ నామావళి స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ విష్ణు స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.