Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి” మరియు “ప్రభాత స్తోత్రనిధి” పుస్తకాలలో ప్రింటు చేశాము.]
(ఈ స్తోత్రంలో ఉన్న 12 నామాలు హనుమంతుని స్వరూపాన్ని, శక్తిని మరియు ఆయన చేసిన కార్యాలను సూచిస్తాయి. పఠించడం వల్ల కలిగే ఫలితాలు: మృత్యు భయ నివారణ, విజయం, పీడకలలు రావు)
హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః |
రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోఽమితవిక్రమః || ౧ ||
ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః |
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా || ౨ ||
1. హనుమాన్: గొప్ప దవడలు కలవాడు (జ్ఞాన సంపన్నుడు).
2. అంజనాసూనుః: అంజనాదేవి పుత్రుడు.
3. వాయుపుత్రః: వాయుదేవుని కుమారుడు.
4. మహాబలః: అపారమైన బలవంతుడు.
5. రామేష్టః: శ్రీరామునికి అత్యంత ప్రియమైనవాడు.
6. ఫల్గుణసఖః: అర్జునుని (ఫల్గుణ) మిత్రుడు (మహాభారత యుద్ధంలో ధ్వజంపై ఉండి అర్జునుడిని రక్షించినవాడు).
7. పింగాక్షః: బంగారు వర్ణపు కన్నులు కలవాడు.
8. అమితవిక్రమః: కొలవలేనంత పరాక్రమం కలవాడు.
9. ఉదధిక్రమణః: సముద్రాన్ని లంఘించినవాడు.
10. సీతాశోకవినాశకః: సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టినవాడు.
11. లక్ష్మణప్రాణదాతా: సంజీవనిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు.
12. దశగ్రీవస్య దర్పహా: దశకంఠుడైన రావణుని గర్వాన్ని అణచినవాడు.
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః |
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః |
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ || ౩ ||
మహాత్ముడైన వానర రాజు హనుమంతుని ఈ 12 నామాలను ప్రతిరోజూ నిద్రపోయే ముందు, ముఖ్యంగా ప్రయాణాల సమయంలో ఎవరైతే పఠిస్తారో, వారికి మృత్యు భయం ఉండదు మరియు వారు అన్ని చోట్లా విజయాన్ని పొందుతారు.
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము (శ్లోకాలు మాత్రమే), ఈ క్రింది రెండు పుస్తకాలలో ప్రింటు చేశాము.
మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
2 thoughts on “Sri Anjaneya Dwadasa Nama Stotram (Telugu Meaning) – శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం”
స్పందించండి
వ్యాఖ్యానించడానికి మీరు తప్పనిసరిగా ప్రవేశించి ఉండాలి.




ధన్యవాదాలు…జై హనుమాన్
Jai hanuman