Navagraha Stotram (Telugu Meaning) – నవగ్రహ స్తోత్రం



[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” మరియు “ప్రభాత స్తోత్రనిధి” పుస్తకాలలో ప్రింటు చేశాము.]

(ఇవి వ్యాస మహర్షి విరచితమైన అత్యంత ప్రసిద్ధ నవగ్రహ స్తోత్రాలు. జాతకంలో గ్రహ దోషాల నివారణకు, మానసిక ప్రశాంతతకు వీటిని పఠిస్తారు. నవగ్రహాల శాంతి కోసం ఈ స్తోత్రాన్ని సాధారణంగా స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించి చదువుకుంటారు.)

జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోఽరిం సర్వపాపఘ్నం ప్రణతోఽస్మి దివాకరమ్ || ౧ ||

1. సూర్యుడు: మందార పువ్వు వంటి ఎర్రని ఛాయ కలిగి, కశ్యప ప్రజాపతి కుమారుడై, గొప్ప కాంతితో ప్రకాశిస్తూ, చీకటికి శత్రువైనవాడు మరియు సకల పాపాలను నశింపజేసేవాడైన ఆ సూర్యభగవానునికి నమస్కరిస్తున్నాను.

దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవమ్ |
నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణమ్ || ౨ ||

2. చంద్రుడు: పెరుగు, శంఖం మరియు మంచు వలె తెల్లని కాంతి కలిగి, పాలసముద్రం నుండి ఉద్భవించి, శివుని శిరస్సుపై ఆభరణంగా వెలుగుతున్న చంద్రునికి (సోమునికి) నమస్కరిస్తున్నాను.

ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభమ్ |
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ || ౩ ||

3. కుజుడు: భూదేవి గర్భం నుండి పుట్టినవాడు, మెరుపు తీగ వంటి కాంతి కలిగినవాడు, చేతిలో ‘శక్తి’ అనే ఆయుధాన్ని ధరించిన కుమార స్వరూపుడైన మంగళునికి (అంగారకుడికి) నమస్కరిస్తున్నాను.

ప్రియంగుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్ |
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ || ౪ ||

4. బుధుడు: నల్లవాలుగ (ప్రియంగు) పువ్వు మొగ్గ వలె శ్యామ వర్ణం కలిగి, సాటిలేని రూపం ఉన్నవాడు, సౌమ్యుడు, సద్గుణ సంపన్నుడైన బుధ గ్రహానికి నమస్కరిస్తున్నాను.

దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ |
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ || ౫ ||

5. గురుడు: దేవతలకు, ఋషులకు గురువైనవాడు, బంగారు ఛాయతో మెరిసిపోయేవాడు, బుద్ధికి అధిపతియై ముల్లోకాలకు ప్రభువైన బృహస్పతికి నమస్కరిస్తున్నాను.

హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ |
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ || ౬ ||

6. శుక్రుడు: మంచు, మొల్లపువ్వు మరియు తామర తూడు వంటి తెల్లని వర్ణం కలిగినవాడు, రాక్షసులకు గొప్ప గురువు, సకల శాస్త్రాలను ప్రవచించే భార్గవునికి (శుక్రునికి) నమస్కరిస్తున్నాను.

నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరమ్ || ౭ ||

7. శని: నల్లని కాటుక వంటి వర్ణం కలిగి, సూర్యుని పుత్రుడై, యమధర్మరాజుకు అన్న అయినవాడు, ఛాయాదేవి మరియు సూర్యులకు జన్మించిన శనైశ్చరునికి నమస్కరిస్తున్నాను.

అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్యవిమర్దనమ్ |
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ || ౮ ||

8. రాహువు: సగం శరీరం కలిగి ఉండి, గొప్ప పరాక్రమవంతుడై, సూర్య చంద్రులను సైతం మింగగలిగే శక్తి ఉన్నవాడు, సింహిక గర్భమున పుట్టిన రాహువుకు నమస్కరిస్తున్నాను.

పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ || ౯ ||

9. కేతువు: మోదుగ పువ్వు వలె ఎర్రని రంగు కలిగి, నక్షత్ర గ్రహాలకు శిరోభాగం వంటివాడు, భీకరమైన స్వరూపం కలిగిన కేతువుకు నమస్కరిస్తున్నాను.

ఫలశ్రుతి –
ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్ సుసమాహితః |
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతిర్భవిష్యతి || ౧౦ ||

నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనమ్ |
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనమ్ || ౧౧ ||

గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్భవాః |
తాః సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః || ౧౨ ||

వ్యాస మహర్షి చెప్పిన ఈ స్తోత్రాన్ని ఏకాగ్రతతో పగలు కానీ, రాత్రి కానీ పఠించే వారికి: సకల విఘ్నాలు తొలగిపోతాయి. స్త్రీలకు, పురుషులకు, రాజులకు (అధికారులకు) చెడు కలల భయం ఉండదు. సాటిలేని ఐశ్వర్యం, ఆరోగ్యం, పుష్టి చేకూరుతాయి. గ్రహాల వల్ల, నక్షత్రాల వల్ల కలిగే పీడలు, దొంగల వల్ల, అగ్ని వల్ల కలిగే భయాలు అన్నీ నశిస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదని వ్యాస మహర్షి చెప్పారు.

ఇతి శ్రీవ్యాస కృత నవగ్రహ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము (శ్లోకాలు మాత్రమే), ఈ క్రింది రెండు పుస్తకాలలో ప్రింటు చేశాము.

నవగ్రహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy

ప్రభాత స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

– See Details & Buy –


మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

23 thoughts on “Navagraha Stotram (Telugu Meaning) – నవగ్రహ స్తోత్రం



  1. for improving concentration and memory during studies, recite
    the mantra ‘purushottama’ 108 times before beginning studies.

    for health problems, recite ‘achyutha anantha govinda’

    for eye problems, recite ‘kesava pundarikaksha’

    for leg problems, recite ‘upendraya namaha’

    for migraine headaches, recite ‘garuda dhwajaya namaha’ or kalabhairava ashtakam

    For very serious diseases chant Vishnu Sahasranamam 632 times

    For getting rid of suffering at time of death and to remove fear of death,
    Chant ‘Gauri Sankara Seetha Rama’ to the maximum extent possible

    For marriage function to happen properly,Chant ‘Jayathi Krishna’

    For getting victory in interview, recite
    Raghavo vijayam dathyaath mama seethapathi prabhu
    Raghavasya badathvantham dathyaath amitha vaibhavam

    For business to prosper,
    Keep on chanting ‘Achyutha, Anantha’

    For missing people to return, Chant 13th sarga of Sundarkandam daily in the morning

    To get rid of monetary difficulties and problems due to loan chant, Narasimha Runa Mochana Stotram daily

    For avoiding bad dreams
    Duswapna , dusshakuna , durgathi, dhourmanasya,
    Durbiksha , duevyasana dussasha duryasamsi,
    Uthpatha thapa , visha bheethim asathkara karthim,
    Vyadheemscha nasayathu may jagathaam adheesa.

    For increasing devotion to god daily chant 15 times, ‘Sri Radhayai Swaha’

స్పందించండి

error: Not allowed