Ashtalakshmi Dhyana Shlokah – అష్టలక్ష్మీ ధ్యాన శ్లోకాః


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]

శ్రీ ఆది లక్ష్మీః –
ద్విభుజాం చ ద్వినేత్రాం చ సాఽభయాం వరదాన్వితామ్ |
పుష్పమాలాధరాం దేవీం అంబుజాసన సంస్థితామ్ ||
పుష్పతోరణసంయుక్తాం ప్రభామండలమండితామ్ |
సర్వలక్షణసంయుక్తాం సర్వాభరణభూషితామ్ ||
పీతాంబరధరాం దేవీం మకుటీచారుబంధనామ్ |
సౌందర్యనిలయాం శక్తిం ఆదిలక్ష్మీమహం భజే ||

శ్రీ సంతాన లక్ష్మీః –
జటామకుటసంయుక్తాం స్థిరాసన సమన్వితామ్ |
అభయం కటకం చైవ పూర్ణకుంభం కరద్వయే ||
కంచుకం సన్నవీతం చ మౌక్తికం చాఽపి ధారిణీమ్ |
దీప చామర హస్తాభిః సేవితాం పార్శ్వయోర్ద్వయోః ||
బాలసేనాని సంకాశాం కరుణాపూరితాననామ్ |
మహారాజ్ఞీం చ సంతానలక్ష్మీమిష్టార్థసిద్ధయే ||

శ్రీ గజ లక్ష్మీః –
చతుర్భుజాం మహాలక్ష్మీం గజయుగ్మసుపూజితామ్ |
పద్మపత్రాభనయనాం వరాభయకరోజ్జ్వలామ్ ||
ఊర్ధ్వం కరద్వయే చాబ్జం దధతీం శుక్లవస్త్రకమ్ |
పద్మాసనే సుఖాసీనాం గజలక్ష్మీమహం భజే ||

శ్రీ ధన లక్ష్మీః –
కిరీటముకుటోపేతాం స్వర్ణవర్ణ సమన్వితామ్ |
సర్వాభరణసంయుక్తాం సుఖాసన సమన్వితామ్ ||
పరిపూర్ణం చ కుంభం చ దక్షిణేన కరేణ తు |
చక్రం బాణం చ తాంబూలం తదా వామకరేణ తు ||
శంఖం పద్మం చ చాపం చ కుండికామపి ధారిణీమ్ |
సకంచుకస్తనీం ధ్యాయేద్ధనలక్ష్మీం మనోహరామ్ ||

శ్రీ ధాన్య లక్ష్మీః –
వరదాఽభయసంయుక్తాం కిరీటమకుటోజ్జ్వలామ్ |
అంబుజం చేక్షుశాలిం చ కదంబఫలద్రోణికామ్ ||
పంకజం చాష్టహస్తేషు దధానాం శుక్లరూపిణీమ్ |
కృపామూర్తిం జటాజూటాం సుఖాసన సమన్వితామ్ ||
సర్వాలంకారసంయుక్తాం సర్వాభరణభూషితామ్ |
మదమత్తాం మనోహారిరూపాం ధాన్యశ్రియం భజే ||

శ్రీ విజయ లక్ష్మీః –
అష్టబాహుయుతాం దేవీం సింహాసనవరస్థితామ్ |
సుఖాసనాం సుకేశీం చ కిరీటమకుటోజ్జ్వలామ్ ||
శ్యామాంగీం కోమలాకారాం సర్వాభరణభూషితామ్ |
ఖడ్గం పాశం తదా చక్రమభయం సవ్యహస్తకే ||
ఖేటకం చాంకుశం శంఖం వరదం వామహస్తకే |
రాజరూపధరాం శక్తిం ప్రభాసౌందర్యశోభితామ్ ||
హంసారూఢాం స్మరేద్దేవీం విజయాం విజయప్రదే ||

శ్రీ ధైర్య లక్ష్మీః –
అష్టబాహుయుతాం లక్ష్మీం సింహాసనవరస్థితామ్ |
తప్తకాంచనసంకాశాం కిరీటమకుటోజ్జ్వలామ్ ||
స్వర్ణకంచుకసంయుక్తాం సన్నవీతతరాం శుభామ్ |
అభయం వరదం చైవ భుజయోః సవ్యవామయోః ||
చక్రం శూలం చ బాణం చ శంఖం చాపం కపాలకమ్ |
దధతీం ధైర్యలక్ష్మీం చ నవతాలాత్మికాం భజే ||

శ్రీ ఐశ్వర్య లక్ష్మీః –
చతుర్భుజాం ద్వినేత్రాం చ వరాభయకరాన్వితామ్ |
అబ్జద్వయకరాంభోజాం అంబుజాసనసంస్థితామ్ ||
ససువర్ణఘటోరాభ్యాం ప్లావ్యమానాం మహాశ్రియమ్ |
సర్వాభరణశోభాఢ్యాం శుభ్రవస్త్రోత్తరీయకామ్ ||
చామరగ్రహనారీభిః సేవితాం పార్శ్వయోర్ద్వయోః |
ఆపాదలంబివసనాం కరండమకుటాం భజే ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.


గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed