Sri Vikhanasa Churnika – శ్రీ విఖనస చూర్ణికా


నిఖిల మునిజన శరణ్యే నైమిశారణ్యే, సకల జగత్కారణ శ్రీమన్నారాయణాఽజ్ఞాకృత నిత్య నివాసం, సకల కళ్యాణ గుణావాసం, శారదాంబుదపారద సుధాకర ముక్తాహార స్ఫటికకాంతి కమనీయ గాత్రం, కమల దళ నేత్రం, జాంబూనదాంబర పరివృతం, దృఢవ్రతం, భృగ్వత్రి కశ్యప మరీచి ప్రముఖ యోగిపుంగవ సేవితం, నిగమాగమ మూలదైవతం, నిజచరణ సరసిజ వినత జగదుదయకర కుశేశయం, శ్రుతి స్మృతి పురాణోదిత వైభవాతిశయం, స్వసంతతి సంభవ వసుంధరా బృందారక బృంద విమథ విమర్దన విచక్షణ దండ ధరం, శంఖ చక్ర ధరం, నారద పరాశర వ్యాస వసిష్ఠ శుక శౌనక బోధాయనాది మహర్షి సంస్తుత సచ్చరిత్రం, దివ్యా కళత్రం, నవరత్నమయ హేమాభరణ ధారణానేక సహస్రకిరణ ప్రకాశం, తపస్వి కులాధీశం, నిరంతర జోఘుష్యమాణ ఋగ్యజుః సామాథర్వగణ విరాజమానం, కుశధ్వజ శోభమానం, రమారమణ చరణసమారాధన స్వరూప సమూర్తామూర్త సప్తతంతువిధాన వక్తారం, సమస్త శాస్త్ర కర్తారం, పరమ పురుష పద పంకజ పూజక ద్విజకుల పరిపాలకం, పద్మాలయా బాలకం, బోధాయనాదిభిర్వందిత మహిమాధికార కల్పసూత్ర ప్రవక్తారం, మన్వాదిభిః సేవిత మహిమాధికార వైదికాగమ కర్తారం, నిజకృత దివ్యసూత్ర సముదితాశేష పురుషార్థప్రద వైదికమార్గం, నిరాకృత వేదేతరమార్గం, శరదిందుబింబ రమణీయ వదనం, యోగజ్ఞానాబ్జ వదనం, శ్రీపతి ధ్యానావాహన సమారాధన స్థాపన ప్రతిష్ఠా సంప్రోక్షణ మహోత్సవ కర్మనిష్ఠ శిష్ట భూసుర ప్రవర సరోరుహ దివాకరం, దయాకరం, హరితత్త్వ సుధారసపాన జనిత హర్ష పరవశ దివ్యవపుషం, పురాణపురుషం, వక్షఃస్థల విరాజమాన కనక యజ్ఞోపవీతం, దక్ష ప్రముఖ నవబ్రహ్మ సమేతం, విష్ణు కళావతరణం, కృష్ణమృగ వాహనం, సత్త్వగుణ ప్రధానం, సకల జగన్నిధానం, కుంద మందహాసం, కోమలాభ్యాసభాసం, తిలకుసుమ సనాసం, కలికలుష నిరాసం, శ్రీశాస్త్ర తామరస పుష్పరస షట్పదాయమాన మానసం, శ్రీవైఖానసం, సాష్టాంగమేవ మమ సంపత్పదే సాంప్రతమహమభివాదయామి అభివాద యామి ||

ఇతి శ్రీ విఖసన చూర్ణికా |


గమనిక: రాబోయే ధనుర్మాసం సందర్భంగా "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల మేము "శ్రీ సాయి స్తోత్రనిధి" పుస్తకము విడుదల చేశాము.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed