Sri Sudarshana Chakra Stava (Bali Krutam) – శ్రీ సుదర్శన చక్ర స్తవః (బలి కృతం)


బలిరువాచ |
అనంతస్యాప్రమేయస్య విశ్వమూర్తేర్మహాత్మనః |
నమామి చక్రిణశ్చక్రం కరసంగి సుదర్శనమ్ || ౧ ||

సహస్రమివ సూర్యాణాం సంఘాతం విద్యుతామివ |
కాలాగ్నిమివ యచ్చక్రం తద్విష్ణోః ప్రణమామ్యహమ్ || ౨ ||

దుష్టరాహుగలచ్ఛేదశోణితారుణతారకమ్ |
తన్నమామి హరేశ్చక్రం శతనేమి సుదర్శనమ్ || ౩ ||

యస్యారకేషు శక్రాద్యా లోకపాలా వ్యవస్థితాః |
తదంతర్వసవో రుద్రాస్తథైవ మరుతాం గణాః || ౪ ||

ధారాయాం ద్వాదశాదిత్యాః సమస్తాశ్చ హుతాశనాః |
ధారాజాలేఽబ్ధయః సర్వే నాభిమధ్యే ప్రజాపతిః || ౫ ||

సమస్తనేమిష్వఖిలా యస్య విద్యాః ప్రతిష్ఠితాః |
యస్య రూపమనిర్దేశ్యమపి యోగిభిరుత్తమైః || ౬ ||

యద్భ్రమత్సురసంఘానాం తేజసః పరిబృంహణమ్ |
దైత్యౌజసాం చ నాశాయ తన్నమామి సుదర్శనమ్ || ౭ ||

భ్రమన్మతమహావేగవిభ్రాంతాఖిలఖేచరమ్ |
తన్నమామి హరేశ్చక్రమనంతారం సుదర్శనమ్ || ౮ ||

నక్షత్రవద్వహ్నికణవ్యాప్తం కృత్స్నం నభస్తలమ్ |
తన్నమామి హరేశ్చక్రం కరసంగి సుదర్శనమ్ || ౯ ||

స్వభావతేజసా యుక్తం యదర్కాగ్నిమయం మహత్ |
విశేషతో హరేర్గత్వా సర్వదేవమయం కరమ్ || ౧౦ ||

దుర్వృత్తదైత్యమథనం జగతః పరిపాలకమ్ |
తన్నమామి హరేశ్చక్రం దైత్యచక్రహరం పరమ్ || ౧౧ ||

కరోతు మే సదా శర్మ ధర్మతాం చ ప్రయాతు మే |
ప్రసాదసుముఖే కృష్ణే తస్య చక్రం సుదర్శనమ్ || ౧౨ ||

స్వభావతేజసా యుక్తం మధ్యాహ్నార్కసమప్రభమ్ |
ప్రసీద సంయుగేఽరిణాం సుదర్శనసుదర్శనమ్ || ౧౩ ||

విద్యుజ్జ్వాలామహాకక్షం దహాంతర్మమ యత్తమః |
జహి నో విషయగ్రాహి మనో గ్రహవిచేష్టితమ్ |
విస్ఫోటయాఖిలాం మాయాం కురుష్వ విమలాం మతిమ్ || ౧౪ ||

ఇతి విష్ణుధర్మేషు అష్టసప్తతితమోఽధ్యాయే బలి కృత చక్ర స్తవః |


మరిన్ని శ్రీ సుదర్శన స్తోత్రాలు చూడండి.


గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed