Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ప్రతిభటశ్రేణిభీషణ వరగుణస్తోమభూషణ
జనిభయస్థానతారణ జగదవస్థానకారణ |
నిఖిలదుష్కర్మకర్శన నిగమసద్ధర్మదర్శన
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || ౧ ||
శుభజగద్రూపమండన సురజనత్రాసఖండన
శతమఖబ్రహ్మవందిత శతపథబ్రహ్మనందిత |
ప్రథితవిద్వత్సపక్షిత భజదహిర్బుధ్న్యలక్షిత
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || ౨ ||
స్ఫుటతటిజ్జాలపింజర పృథుతరజ్వాలపంజర
పరిగతప్రత్నవిగ్రహ పటుతరప్రజ్ఞదుర్గ్రహ | [పరిమిత]
ప్రహరణగ్రామమండిత పరిజనత్రాణపండిత
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || ౩ ||
నిజపదప్రీతసద్గణ నిరుపధిస్ఫీతషడ్గుణ
నిగమనిర్వ్యూఢవైభవ నిజపరవ్యూహవైభవ |
హరిహయద్వేషిదారణ హరపురప్లోషకారణ
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || ౪ ||
దనుజవిస్తారకర్తన జనితమిస్రావికర్తన
దనుజవిద్యానికర్తన భజదవిద్యానివర్తన |
అమరదృష్టస్వవిక్రమ సమరజుష్టభ్రమిక్రమ
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || ౫ ||
ప్రతిముఖాలీఢబంధుర పృథుమహాహేతిదంతుర
వికటమాయాబహిష్కృత వివిధమాలాపరిష్కృత |
స్థిరమహాయంత్రతంత్రిత దృఢదయాతంత్రయంత్రిత
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || ౬ ||
మహితసంపత్సదక్షర విహితసంపత్షడక్షర
షడరచక్రప్రతిష్ఠిత సకలతత్త్వప్రతిష్ఠిత |
వివిధసంకల్పకల్పక విబుధసంకల్పకల్పక
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || ౭ ||
భువననేతస్త్రయీమయ సవనతేజస్త్రయీమయ
నిరవధిస్వాదుచిన్మయ నిఖిలశక్తే జగన్మయ |
అమితవిశ్వక్రియామయ శమితవిష్వగ్భయామయ
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన || ౮ ||
ద్విచతుష్కమిదం ప్రభూతసారం
పఠతాం వేంకటనాయకప్రణీతమ్ |
విషమేఽపి మనోరథః ప్రధావన్
న విహన్యేత రథాంగధుర్యగుప్తః || ౯ ||
ఇతి శ్రీ వేదాంతాచార్యస్య కృతిషు శ్రీ సుదర్శనాష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ నరసింహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ సుదర్శన స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Iget good app for me
Good devine app