Sri Shankaracharya Shodasopachara Puja – శ్రీ శంకరభగవత్పాద షోడశోపచార పూజా


(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం ఆచరించవలెను.)

పూర్వాంగం చూ. ||

పసుపు గణపతి పూజ చూ. ||

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ వైదికమార్గ ప్రతిష్ఠాపకానాం జగద్గురూణాం శ్రీశంకరభగవత్పాదపూజాం కరిష్యే |

ధ్యానమ్ –
శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయమ్ |
నమామి భగవత్పాదశంకరం లోకశంకరమ్ ||
అస్మిన్ బింబే శ్రీశంకరభగవత్పాదం ధ్యాయామి |

ఆవాహనమ్ –
యమాశ్రితా గిరాం దేవీ నందయత్యాత్మసంశ్రితాన్ |
తమాశ్రయే శ్రియా జుష్టం శంకరం కరుణానిధిమ్ ||
శ్రీశంకరభగవత్పాదమావాహయామి |

ఆసనమ్ –
శ్రీగురుం భగవత్పాదం శరణ్యం భక్తవత్సలమ్ |
శివం శివకరం శుద్ధమప్రమేయం నమామ్యహమ్ ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః ఆసనం సమర్పయామి |

పూర్ణకుంభప్రదానమ్ –
నిత్యం శుద్ధం నిరాకారం నిరాభాసం నిరంజనమ్ |
నిత్యబోధం చిదానందం గురుం బ్రహ్మ నమామ్యహమ్ ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః పూర్ణకుంభం సమర్పయామి |

పాద్యమ్ –
సర్వతంత్రస్వతంత్రాయ సదాత్మాద్వైతరూపిణే |
శ్రీమతే శంకరార్యాయ వేదాంతగురవే నమః ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యమ్ –
వేదాంతార్థాభిధానేన సర్వానుగ్రహకారిణమ్ |
యతిరూపధరం వందే శంకరం లోకశంకరమ్ ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయమ్ –
సంసారాబ్ధినిషణ్ణాజ్ఞనికరప్రోద్దిధీర్షయా |
కృతసంహననం వందే భగవత్పాదశంకరమ్ ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః ఆచమనీయం సమర్పయామి |

స్నానమ్ –
యత్పాదపంకజధ్యానాత్ తోటకాద్యా యతీశ్వరాః |
బభూవుస్తాదృశం వందే శంకరం షణ్మతేశ్వరమ్ ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః స్నాపయామి |
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |

వస్త్రమ్ –
నమః శ్రీశంకరాచార్యగురవే శంకరాత్మనే |
శరీరిణాం శంకరాయ శంకరజ్ఞానహేతవే ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః వస్త్రం సమర్పయామి |

ఉపవీతమ్ –
హరలీలావతారాయ శంకరాయ వరౌజసే |
కైవల్యకలనాకల్పతరవే గురవే నమః ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః ఉపవీతం సమర్పయామి |

రుద్రాక్షమాలా (ఆభరణమ్) –
విచార్యం సర్వవేదాంతైః సంచార్యం హృదయాంబుజే |
ప్రచార్యం సర్వలోకేషు ఆచార్యం శంకరం భజే ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః రుద్రాక్షమాలాం సమర్పయామి |

గంధమ్ –
యాఽనుభూతిః స్వయంజ్యోతిరాదిత్యేశానవిగ్రహా |
శంకరాఖ్యా చ తన్నౌమి సురేశ్వరగురుం పరమ్ ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః గంధ భస్మాదికం సమర్పయామి |

దండమ్ –
ఆనందఘనమద్వందం నిర్వికారం నిరంజనమ్ |
భజేఽహం భగవత్పాదం భజతామభయప్రదమ్ ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః దండం సమర్పయామి |

అక్షతాన్ –
తం వందే శంకరాచార్యం లోకత్రితయశంకరమ్ |
సత్తర్కనఖరోద్గీర్ణ వావదూకమతంగజమ్ |
శ్రీశంకరభగవత్పాదాయ నమః అక్షతాన్ సమర్పయామి |

పుష్పమాలా –
నమామి శంకరాచార్యగురుపాదసరోరుహమ్ |
యస్య ప్రసాదాన్మూఢోఽపి సర్వజ్ఞో భవతి స్వయమ్ ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః పుష్పమాలాం సమర్పయామి |

అష్టోత్తరశతనామ పూజా –

శ్రీ శంకరభగవత్పాద అష్టోత్తరశతనామావళీ పశ్యతు ||

ధూపమ్ –
సంసారసాగరం ఘోరం అనంతక్లేశభాజనమ్ |
త్వామేవ శరణం ప్రాప్య నిస్తరంతి మనీషిణః ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః ధూపమాఘ్రాపయామి |

దీపమ్ –
నమస్తస్మై భగవతే శంకరాచార్యరూపిణే |
యేన వేదాంతవిద్యేయం ఉద్ధృతా వేదసాగరాత్ ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః దీపం దర్శయామి |

నైవేద్యమ్ –
భగవత్పాదపాదాబ్జపాంసవః సంతు సంతతమ్ |
అపారాసార సంసారసాగరోత్తార సేతవః ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః మహానైవేద్యం నివేదయామి |
నివేదనానంతరం ఆచమనీయం సమర్పయామి |
హస్తప్రక్షాళన పాదప్రక్షాళనాదికం సమర్పయామి |
తాంబూలం సమర్పయామి |

నీరాజనమ్ –
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః కర్పూరనీరాజనం దర్శయామి |
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి |

ప్రదక్షిణ –
ఆచార్యాన్ భగవత్పాదాన్ షణ్మతస్థాపకాన్ హితాన్ |
పరహంసాన్నుమోఽద్వైతస్థాపకాన్ జగతో గురూన్ ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

ప్రార్థనా –
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ||

అనేకజన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే |
ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీగురవే నమః ||

విశుద్ధ విజ్ఞానఘనం శుచిహార్దం తమోనుదమ్ |
దయాసింధుం లోకబంధుం శంకరం నౌమి సద్గురుమ్ ||

దేహబుద్ధ్యా తు దాసోఽస్మి జీవబుద్ధ్యా త్వదంశకః |
ఆత్మబుద్ధ్యా త్వమేవాహమితి మే నిశ్చితా మతిః ||

ఏకః శాఖీ శంకరాఖ్యశ్చతుర్ధా
స్థానం భేజే తాపశాంత్యై జనానామ్ |
శిష్యస్కంధైః శిష్య శాఖైర్మహద్భిః
జ్ఞానం పుష్పం యత్ర మోక్షః ప్రసూతిః ||

గామాక్రమ్య పదేఽధికాంచి నిబిడం స్కంధైశ్చతుర్భిస్తథా
వ్యావృణ్వన్ భువనాంతరం పరిహరంస్తాపం సమోహజ్వరమ్ |
యః శాఖీ ద్విజసంస్తుతః ఫలతి తత్ స్వాద్యం రసాఖ్యం ఫలం
తస్మై శంకరపాదాయ మహతే తన్మః త్రిసంధ్యం నమః ||

తోటకాష్టకం >>

గురుపాదోదకప్రాశనమ్ –
అవిద్యామూలనాశాయ జన్మకర్మనివృత్తయే |
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం గురుపాదోదకం శుభమ్ ||
గురుపాదోదకం ప్రాశయామి |

సమర్పణమ్ –
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||

అనయా పూజయా సర్వదేవాత్మకః భగవాన్ శ్రీజగద్గురుః ప్రీయతామ్ ||

ఓం తత్ సత్ ||


గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed