Sri Manasa Devi Stotram (Dhanvantari Krutam) – శ్రీ మనసా దేవి స్తోత్రం (ధన్వంతరి కృతం)


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

ధ్యానమ్ |
చారుచంపకవర్ణాభాం సర్వాంగసుమనోహరామ్ |
ఈషద్ధాస్యప్రసన్నాస్యాం శోభితాం సూక్ష్మవాససా || ౧ ||

సుచారుకబరీశోభాం రత్నాభరణభూషితామ్ |
సర్వాభయప్రదాం దేవీం భక్తానుగ్రహకారకామ్ || ౨ ||

సర్వవిద్యాప్రదాం శాంతాం సర్వవిద్యావిశారదామ్ |
నాగేంద్రవాహినీం దేవీం భజే నాగేశ్వరీం పరామ్ || ౩ ||

ధన్వంతరిరువాచ |
నమః సిద్ధిస్వరూపాయై సిద్ధిదాయై నమో నమః |
నమః కశ్యపకన్యాయై వరదాయై నమో నమః || ౪ ||

నమః శంకరకన్యాయై శంకరాయై నమో నమః |
నమస్తే నాగవాహిన్యై నాగేశ్వర్యై నమో నమః || ౫ ||

నమ ఆస్తీకజనన్యై జనన్యై జగతాం మమ |
నమో జగత్కారణాయై జరత్కారుస్త్రియై నమః || ౬ ||

నమో నాగభగిన్యై చ యోగిన్యై చ నమో నమః |
నమశ్చిరం తపస్విన్యై సుఖదాయై నమో నమః || ౭ ||

నమస్తపస్యారూపాయై ఫలదాయై నమో నమః |
సుశీలాయై చ సాధ్వ్యై చ శాంతాయై చ నమో నమః || ౮ ||

ఇదం స్తోత్రం మహాపుణ్యం భక్తియుక్తశ్చ యః పఠేత్ |
వంశజానాం నాగభయం నాస్తి తస్య న సంశయః || ౯ ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే ఏకపంచాశత్తమోఽధ్యాయః ధన్వంతరికృత శ్రీ మనసాదేవి స్తోత్రమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See DetailsClick here to buy


మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి.


పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed