Sri Jagannatha Ashtakam – శ్రీ జగన్నాథాష్టకం



[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” మరియు “ప్రభాత స్తోత్రనిధి” పుస్తకాలలో ప్రింటు చేశాము.]

(కాపీరైటు ప్రకటన :- ఈ శ్లోకాలకు అర్థము బ్రహ్మశ్రీ మండా కృష్ణశ్రీకాంత్ శర్మగారు “స్తోత్రనిధి” కోసము మాత్రమే వ్రాసి తయారుచేశారు. వారు వ్రాసిన అర్థము కూడా కాపీ చేయాలనుకునేవారు, ఆయన పేరును కూడా ప్రస్తావించగలరు.)

కదాచిత్కాళిందీతటవిపినసంగీతకవరో
ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః |
రమాశంభుబ్రహ్మాఽమరపతిగణేశాఽర్చితపదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || ౧ ||

అర్థం – అప్పుడప్పుడు కాళిందీ నది తీరంలో ఉన్న అడవులలో తన (వేణుగాన) సంగీతమును నింపువాడు, ఆనందంతో వికసించిన గోపికా స్త్రీల ముఖ పద్మములను ఆస్వాదిస్తూ తుమ్మెదవలె విహరించువాడు, రమా, శంభు, బ్రహ్మ, అమరపతి (ఇంద్రుడు) మరియు గణేశునిచే అర్చింపబడు పాదములు కలవాడు అయిన జగములన్నిటికి నాథుడైన జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.

భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాంతే సహచరకటాక్షం (చ) విదధత్ |
సదా శ్రీమద్బృందావనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || ౨ ||

అర్థం – ఎడమచేతిలో వేణువును, శిరస్సున నెమలిపింఛమును, నడుముకు శ్రేష్టమైన వస్త్రములు ధరించి, తన క్రీగంటి చూపులతో తన సహచరులకు కటాక్షమును ఇచ్చువాడు, ఎల్లప్పుడూ శ్రీమంతమైన బృందావనంలో ఉంటూ తన లీలలను చూపువాడు అయిన జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.

మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ ప్రాసాదాంతః సహజబలభద్రేణ బలినా |
సుభద్రామధ్యస్థః సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || ౩ ||

అర్థం – మహాసాగరము యొక్క తీరమందు ఉన్న బంగారు వర్ణం కలిగిన ఇసుక రేణువుల వద్ద ఉన్న నీలాచల శిఖరమందు ఉన్న రాజభవనంలో, అనుజుడైన, బలశాలి అయిన బలభద్రునితో కలిసి, తమ మధ్య సుభద్రతో కూడి, సకల దేవతలు సేవించే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్న జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.

కృపాపారావారః సజలజలదశ్రేణిరుచిరో
రమావాణీసోమస్ఫురదమలపద్మోద్భవముఖైః |
సురేంద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || ౪ ||

అర్థం – కృప సముద్రమంత కలిగి, జలము నిండుగా ఉన్న నల్లమబ్బుల వంటి శోభ కలిగినవాడు, రమ (లక్ష్మీదేవి), వాణీ (సరస్వతీదేవి) లకు ఆనందము కలిగించువాడు, సురేంద్రునిచే ఆరాధింపబడువాడు, శృతులయందు (వేదములు) ఉన్న ఉన్నత గీతలచే (వాక్యబోధలు) కీర్తింపదగ్గ చరితము కలవాడు అయిన జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.

రథారూఢో గచ్ఛన్ పథి మిళితభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః |
దయాసింధుర్బంధుః సకలజగతాం సింధుసుతయా
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || ౫ ||

అర్థం – రథమును ఎక్కి తిరుగుతూ, రహదారులలో కలిసిపోయి వ్యక్తమవుతున్న స్తుతులను అడుగడుగునా అప్పటికప్పుడు వింటూ, సాగరమంత దయ కలిగి, సకల జగత్తులయందు బంధువువలె, సముద్రముయొక్క పుత్రునివలె ఉన్న జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.

పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోఽనంతశిరసి |
రసానందో రాధాసరసవపురాలింగనసుఖో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || ౬ ||

అర్థం – కుంచించిన పరబ్రహ్మ స్వరూపముతో, నీలికమల దళములవంటి వికసించిన నయనములు కలిగి, నీలాద్రి (నీలాచల) నివాసి, అనంతుడి శిరస్సుపై ఉంచిన పాదములతో, రసానందభరితురాలైన రాధ యొక్క అందమైన శరీరముచే ఆనందముగా కౌగిలించుకొనబడి ఉన్న జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.

న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతా భోగవిభవే
న యాచేఽహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూమ్ |
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || ౭ ||

అర్థం – రాజ్యములను, బంగారము మరియు రత్నముల వంటి సంపదను యాచించను. అందరిచే వాంఛింపబడు అందమైన స్త్రీని అడగను. అన్నికాలముల యందు ప్రమథపతి (శివుడు) చే కీర్తింపబడు చరితము కలిగిన జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.

హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే
హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే |
అహో దీనానాథం నిహితమచలం పాతుమనిశం
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || ౮ ||

అర్థం – ఉపయోగం లేని ఈ భౌతికమైన సంసారమును నీవు త్వరగా హరింపుము ఓ సురపతీ. అపరిమితముగా వ్యాపించిన నా పాపములను తొలగింపుము ఓ యాదవపతీ. ఆహా, దీనులకు, అనాథులకు నీ ఈ చరణములు స్పష్టమైన నివాసము. (కనుక ఓ) జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీ జగన్నాథాష్టకం సంపూర్ణమ్ |

(ఈ అర్థము శ్రీ మండా కృష్ణశ్రీకాంత శర్మకు స్ఫురించి వ్రాయబడినది.)

(కాపీరైటు ప్రకటన :- ఈ శ్లోకాలకు అర్థము బ్రహ్మశ్రీ మండా కృష్ణశ్రీకాంత్ శర్మగారు “స్తోత్రనిధి” కోసము మాత్రమే వ్రాసి తయారుచేశారు. వారు వ్రాసిన అర్థము కూడా కాపీ చేయాలనుకునేవారు, ఆయన పేరును కూడా ప్రస్తావించగలరు.)


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము (శ్లోకాలు మాత్రమే), ఈ క్రింది రెండు పుస్తకాలలో ప్రింటు చేశాము.

ప్రభాత స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

– See Details & Buy –


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

2 thoughts on “Sri Jagannatha Ashtakam – శ్రీ జగన్నాథాష్టకం



  1. చాలా బాగుంది
    ఈ స్తోత్రనిధిని ఈ విధంగా ఆస్తికులకు అందించిన కర్తలకు నా శుభాభినందనలు మరియు కృతజ్ఞతలు
    శుభమస్తు

స్పందించండి

error: Not allowed