Sri Gokulesha Ashtakam – శ్రీ గోకులేశాష్టకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

నందగోపభూపవంశభూషణం విదూషణం
భూమిభూతిభూరిభాగ్యభాజనం భయాపహమ్ |
ధేనుధర్మరక్షణావతీర్ణపూర్ణవిగ్రహం
నీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే || ౧ ||

గోపబాలసుందరీగణావృతం కళానిధిం
రాసమండలీవిహారకారికామసుందరమ్ |
పద్మయోనిశంకరాదిదేవబృందవందితం
నీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే || ౨ ||

గోపరాజరత్నరాజిమందిరానురింగణం
గోపబాలబాలికాకలానురుద్ధగాయనమ్ |
సుందరీమనోజభావభాజనాంబుజాననం
నీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే || ౩ ||

కంసకేశికుంజరాజదుష్టదైత్యదారణం
ఇంద్రసృష్టవృష్టివారివారణోద్ధృతాచలమ్ |
కామధేనుకారితాభిధానగానశోభితం
నీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే || ౪ ||

గోపికాగృహాంతగుప్తగవ్యచౌర్యచంచలం
దుగ్ధభాండభేదభీతలజ్జితాస్యపంకజమ్ |
ధేనుధూళిధూసరాంగశోభిహారనూపురం
నీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే || ౫ ||

వత్సధేనుగోపబాలభీషణాస్యవహ్నిపం
కేకిపింఛకల్పితావతంసశోభితాననమ్ |
వేణువాదమత్తఘోషసుందరీమనోహరం
నీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే || ౬ ||

గర్వితామరేంద్రకల్పకల్పితాన్నభోజనం
శారదారవిందబృందశోభిహంసజారతమ్ |
దివ్యగంధలుబ్ధభృంగపారిజాతమాలినం
నీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే || ౭ ||

వాసరావసానగోష్ఠగామిగోగణానుగం
ధేనుదోహదేహగేహమోహవిస్మయక్రియమ్ |
స్వీయగోకులేశదానదత్తభక్తరక్షణం
నీలవారివాహకాంతి గోకులేశమాశ్రయే || ౮ ||

ఇతి శ్రీరఘునాథాచార్య విరచితం శ్రీ గోకులేశాష్టకమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ కృష్ణ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed