Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” మరియు “ప్రభాత స్తోత్రనిధి” పుస్తకాలలో ప్రింటు చేశాము.]
(ఘోరమైన కష్టాల నుండి గట్టెక్కించే ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల దత్తప్రభువు అపారమైన అనుగ్రహం లభిస్తుంది.)
శ్రీపాద శ్రీవల్లభ త్వం సదైవ
శ్రీదత్తాస్మాన్పాహి దేవాధిదేవ |
భావగ్రాహ్య క్లేశహారిన్ సుకీర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౧ ||
ఓ శ్రీపాద శ్రీవల్లభ ప్రభూ! నీవు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటావు. దేవాధిదేవుడవైన శ్రీదత్తా! మమ్మల్ని రక్షించు. మా హృదయ భావాన్ని గ్రహించేవాడా, మా క్లేశాలను (బాధలను) హరించేవాడా, గొప్ప కీర్తి గలవాడా! ఘోరమైన కష్టాల నుండి మమ్మల్ని ఉద్ధరించు. నీకు నమస్కారము.
త్వం నో మాతా త్వం పితాఽఽప్తోఽధిపస్త్వం
త్రాతా యోగక్షేమకృత్సద్గురుస్త్వమ్ |
త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౨ ||
నీవు మాకు తల్లివి, తండ్రివి, ఆప్తుడవు, యజమానివి. మమ్మల్ని రక్షించే రక్షకుడవు, మా యోగక్షేమాలను చూసుకునే సద్గురువువు నీవే. విశ్వరూపుడవైన ఓ ప్రభూ! నీవే మా సర్వస్వము. ఘోరమైన కష్టాల నుండి మమ్మల్ని ఉద్ధరించు. నీకు నమస్కారము.
పాపం తాపం వ్యాధిమాధిం చ దైన్యం
భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యమ్ |
త్రాతారం నో వీక్ష్య ఈశాస్తజూర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౩ ||
మా పాపాలను, తాపాలను (కష్టాలు), వ్యాధులను, మానసిక చింతలను (ఆధి), దీనత్వాన్ని, భయాన్ని, క్లేశాలను వెంటనే హరించు. ఓ ఈశ్వరా! నిన్ను తప్ప మాకు రక్షించేవారు ఎవరూ లేరు. ఘోరమైన కష్టాల నుండి మమ్మల్ని ఉద్ధరించు. నీకు నమస్కారము.
నాన్యస్త్రాతా నాఽపి దాతా న భర్తా
త్వత్తో దేవ త్వం శరణ్యోఽకహర్తా |
కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౪ ||
ఓ దత్తదేవా! నిన్ను మించిన రక్షకుడు గానీ, దాత గానీ, పోషకుడు గానీ మాకు లేరు. దుఃఖాలను హరించే నీవే మాకు శరణ్యము. అత్రేయ పుత్రుడవైన ఓ దత్తా! నీ అనుగ్రహాన్ని మాపై కురిపించు. ఘోరమైన కష్టాల నుండి మమ్మల్ని ఉద్ధరించు. నీకు నమస్కారము.
ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం
సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిమ్ |
భావాసక్తిం చాఖిలానందమూర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౫ ||
సకల ఆనంద స్వరూపుడవైన ఓ ప్రభూ! మాకు ధర్మంపై ప్రీతిని, సద్బుద్ధిని, దైవభక్తిని, సజ్జనుల సాంగత్యాన్ని (సత్సంగము), ఇహలోక సుఖాలను (భుక్తి), పరలోక మోక్షాన్ని (ముక్తి) మరియు నీపై అచంచలమైన భక్తిని ప్రసాదించు. ఘోరమైన కష్టాల నుండి మమ్మల్ని ఉద్ధరించు. నీకు నమస్కారము.
శ్లోకపంచకమేతద్యో లోకమంగళవర్ధనమ్ |
ప్రపఠేన్నియతో భక్త్యా స శ్రీదత్తప్రియో భవేత్ || ౬ ||
లోకమంగళాన్ని పెంచే ఈ ఐదు శ్లోకాలను (శ్లోక పంచకము) ఎవరైతే నియమంతో, భక్తితో పఠిస్తారో, వారు శ్రీ దత్తాత్రేయ స్వామికి అత్యంత ప్రియమైన వారవుతారు.
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్వాసుదేవానందసరస్వతి యతి విరచితం ఘోరకష్టోద్ధారణ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము (శ్లోకాలు మాత్రమే), ఈ క్రింది రెండు పుస్తకాలలో ప్రింటు చేశాము.
మరిన్ని శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
2 thoughts on “Ghora Kashtodharana Datta Stotram (Telugu Meaning) – శ్రీ దత్త స్తోత్రం (ఘోర కష్టోద్ధారణ స్తోత్రం)”
స్పందించండి
వ్యాఖ్యానించడానికి మీరు తప్పనిసరిగా ప్రవేశించి ఉండాలి.




mee postlu maku anubandam cheyagalaru
jai guru deva daththa