Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
తస్మై నమః పరమకారణకారణాయ
దీప్తోజ్జ్వలజ్జ్వలితపింగళలోచనాయ |
నాగేంద్రహారకృతకుండలభూషణాయ
బ్రహ్మేంద్రవిష్ణువరదాయ నమః శివాయ || ౧ ||
శ్రీమత్ప్రసన్నశశిపన్నగభూషణాయ
శైలేంద్రజావదనచుంబితలోచనాయ |
కైలాసమందరమహేంద్రనికేతనాయ
లోకత్రయార్తిహరణాయ నమః శివాయ || ౨ ||
పద్మావదాతమణికుండలగోవృషాయ
కృష్ణాగరుప్రచురచందనచర్చితాయ |
భస్మానుషక్తవికచోత్పలమల్లికాయ
నీలాబ్జకంఠసదృశాయ నమః శివాయ || ౩ ||
లంబత్సపింగళజటాముకుటోత్కటాయ
దంష్ట్రాకరాళవికటోత్కటభైరవాయ |
వ్యాఘ్రాజినాంబరధరాయ మనోహరాయ
త్రైలోక్యనాథనమితాయ నమః శివాయ || ౪ ||
దక్షప్రజాపతిమహామఖనాశనాయ
క్షిప్రం మహాత్రిపురదానవఘాతనాయ |
బ్రహ్మోర్జితోర్ధ్వగకరోటినికృంతనాయ
యోగాయ యోగనమితాయ నమః శివాయ || ౫ ||
సంసారసృష్టిఘటనాపరివర్తనాయ
రక్షః పిశాచగణసిద్ధసమాకులాయ |
సిద్ధోరగగ్రహగణేంద్రనిషేవితాయ
శార్దూలచర్మవసనాయ నమః శివాయ || ౬ ||
భస్మాంగరాగకృతరూపమనోహరాయ
సౌమ్యావదాతవనమాశ్రితమాశ్రితాయ |
గౌరీకటాక్షనయనార్ధనిరీక్షణాయ
గోక్షీరధారధవళాయ నమః శివాయ || ౭ ||
ఆదిత్యసోమవరుణానిలసేవితాయ
యజ్ఞాగ్నిహోత్రవరధూమనికేతనాయ |
ఋక్సామవేదమునిభిః స్తుతిసంయుతాయ
గోపాయ గోపనమితాయ నమః శివాయ || ౮ ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృత శివాష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.