// శ్లోకాలు – తాత్పర్యం //
శ్రీధనదా ఉవాచ |
దేవీ దేవముపాగమ్య నీలకంఠం మమ ప్రియమ్ |
కృపయా పార్వతీ ప్రాహ శంకరం కరుణాకరమ్ || ౧ ||
కుబేరుడు చెబుతున్నాడు: ఒకానొక సమయంలో పార్వతీదేవి తన ప్రియుడు, కరుణాసముద్రుడు, నీలకంఠుడు అయిన శంకరుని వద్దకు వెళ్లి దయతో ఈ విధంగా పలికింది.
శ్రీదేవ్యువాచ |
బ్రూహి వల్లభ సాధూనాం దరిద్రాణాం కుటుంబినామ్ |
దరిద్రదలనోపాయమంజసైవ ధనప్రదమ్ || ౨ ||
పార్వతీదేవి అడిగింది: “ప్రాణనాథా! దరిద్రంతో బాధపడుతున్న సాధువులకు, కుటుంబీకులకు ఆ దరిద్రాన్ని వెంటనే పోగొట్టి ధనాన్ని ఇచ్చే సులువైన ఉపాయాన్ని చెప్పండి.”
శ్రీశివ ఉవాచ |
పూజయన్ పార్వతీవాక్యమిదమాహ మహేశ్వరః |
ఉచితం జగదంబాసి తవ భూతానుకంపయా || ౩ ||
శివుడు పలికాడు: పార్వతి అడిగిన మాటలకు పరమశివుడు ఆమెను గౌరవిస్తూ ఇలా అన్నాడు.. “ఓ జగన్మాతా! సమస్త ప్రాణులపై నీకున్న దయ వల్ల నీవు ఇలా అడగడం చాలా సమంజసంగా ఉంది.”
స సీతం సానుజం రామం సాంజనేయం సహానుగమ్ |
ప్రణమ్య పరమానందం వక్ష్యేఽహం స్తోత్రముత్తమమ్ || ౪ ||
సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు మరియు తన పరివారంతో కూడి ఉన్న పరమానంద స్వరూపుడైన శ్రీరామచంద్రునికి నమస్కరించి అత్యంత శ్రేష్ఠమైన ఈ స్తోత్రాన్ని చెబుతున్నాను.
ధనదం శ్రద్ధధానానాం సద్యః సులభకారకమ్ |
యోగక్షేమకరం సత్యం సత్యమేవ వచో మమ || ౫ ||
శ్రద్ధతో ఈ స్తోత్రాన్ని చదివేవారికి ఇది వెంటనే ధనాన్ని కలిగిస్తుంది, సులభంగా పనులు నెరవేరేలా చేస్తుంది. వారి యోగక్షేమాలను చూసుకుంటుంది. ఇది సత్యం, నా మాట ముమ్మాటికీ సత్యం.
పఠంతః పాఠయంతోఽపి బ్రాహ్మణైరాస్తికోత్తమైః |
ధనలాభో భవేదాశు నాశమేతి దరిద్రతా || ౬ ||
ఆస్తికులైన ఉత్తమ బ్రాహ్మణుల ద్వారా ఈ స్తోత్రాన్ని చదివినా లేదా ఇతరుల చేత చదివించినా (విన్నా) వెంటనే ధనలాభం కలుగుతుంది మరియు దరిద్రం నశిస్తుంది.
భూభవాంశభవాం భూత్యై భక్తికల్పలతాం శుభామ్ |
ప్రార్థయేత్తాం యథాకామం కామధేనుస్వరూపిణీమ్ || ౭ ||
భక్తి అనే కల్పలత వలె, కోరిన కోర్కెలు తీర్చే కామధేనువు వలె శుభప్రదమైన ఆ దేవిని (మహాలక్ష్మిని) ఐశ్వర్యం కోసం భక్తితో ప్రార్థించాలి.
ధనదే ధనదే దేవి దానశీలే దయాకరే | [ధర్మదే]
త్వం ప్రసీద మహేశాని యదర్థం ప్రార్థయామ్యహమ్ || ౮ ||
ఓ ధనప్రదాయిని! దానశీలివి, దయామయివి అయిన ఓ దేవీ! ఓ మహేశాని! నేను ఏ కోరికతో నిన్ను ప్రార్థిస్తున్నానో దానిని నెరవేర్చి నాపై ప్రసన్నం కావలెను.
ధరాఽమరప్రియే పుణ్యే ధన్యే ధనదపూజితే |
సుధనం ధార్మికే దేహి యజమానాయ సత్వరమ్ || ౯ ||
భూదేవతలకు ప్రియమైనదానా! పుణ్యమూర్తివి, ధన్యవు, కుబేరునిచే పూజింపబడే ఓ తల్లీ! యజ్ఞకర్తకు లేదా పూజ చేసేవారికి ధర్మబద్ధమైన ధనాన్ని వెంటనే ప్రసాదించు.
రమ్యే రుద్రప్రియే రూపే రామరూపే రతిప్రియే |
శిఖీసఖమనోమూర్తే ప్రసీద ప్రణతే మయి || ౧౦ ||
మనోహరమైన రూపం కలదానా! రుద్రునికి ప్రియమైనదానా! శ్రీరాముని రూపం వంటి రూపం కలదానా! రతీదేవికి ఇష్టమైనదానా! కుబేరుని మనస్సులో నిలిచే ఓ మూర్తీ! నీకు నమస్కరిస్తున్న నాపై ప్రసన్నం కావలెను.
ఆరక్తచరణాంభోజే సిద్ధిసర్వార్థదాయికే |
దివ్యాంబరధరే దివ్యే దివ్యమాల్యానుశోభితే || ౧౧ ||
ఎర్రటి తామరల వంటి పాదములు గలదానా! సకల సిద్ధులను, కోర్కెలను తీర్చేదానా! దివ్యమైన వస్త్రములు ధరించి, దివ్యమైన పూలమాలలతో శోభిల్లే ఓ దేవీ! నీకు నమస్కారము.
సమస్తగుణసంపన్నే సర్వలక్షణలక్షితే |
శరచ్చంద్రముఖే నీలే నీలనీరజలోచనే || ౧౨ ||
సకల కళ్యాణ గుణములతో నిండినదానా! ఉత్తమ లక్షణములు కలదానా! శరత్కాల చంద్రుని వంటి ముఖం కలదానా! నల్లని శరీర ఛాయ మరియు నల్లని తామర రేకుల వంటి కన్నులు కల తల్లీ!
చంచరీక చమూ చారు శ్రీహార కుటిలాలకే |
మత్తే భగవతీ మాతః కలకంఠరవామృతే || ౧౩ ||
తుమ్మెదల గుంపు వలె నల్లగా, ఒత్తుగా ఉండి నుదుటిపై ముంగురులుగా మెరిసే కురులు కలదానా! ఓ భగవతీ! కోకిల స్వరము వంటి నీ అమృత వాక్కులతో మమ్ములను అనుగ్రహించుము.
హాసాఽవలోకనైర్దివ్యైర్భక్తచింతాపహారికే |
రూప లావణ్య తారూణ్య కారూణ్య గుణభాజనే || ౧౪ ||
నీ దివ్యమైన చిరునవ్వుతో, చూపులతో భక్తుల బాధలను హరించేదానా! రూపము, లావణ్యము, యౌవనము మరియు కారుణ్యము వంటి సకల సద్గుణాలకు నిలయమైన ఓ జననీ!
క్వణత్కంకణమంజీరే లసల్లీలాకరాంబుజే |
రుద్రప్రకాశితే తత్త్వే ధర్మాధారే ధరాలయే || ౧౫ ||
ఘల్లుఘల్లుమని మ్రోగే కంకణములు, అందెలు ధరించినదానా! పద్మమును ధరించిన హస్తములు కలదానా! పరమశివునిచే ప్రకాశింపజేయబడిన తత్త్వమా! ధర్మానికి ఆధారమై భూమియే నివాసంగా కల దేవీ!
ప్రయచ్ఛ యజమానాయ ధనం ధర్మైకసాధనమ్ |
మాతస్త్వం మేఽవిలంబేన దిశస్వ జగదంబికే || ౧౬ ||
ఓ జగన్మాతా! ధర్మ కార్యాలు చేయడానికి సాధనమైన ధనాన్ని ఈ పూజ చేసేవారికి ప్రసాదించుము. అమ్మా! ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకు నీ అనుగ్రహాన్ని ప్రసాదించు.
కృపయా కరుణాగారే ప్రార్థితం కురు మే శుభే |
వసుధే వసుధారూపే వసువాసవవందితే || ౧౭ ||
కరుణకు నిలయమైన ఓ శుభప్రదాయిని! నా ప్రార్థనను మన్నించి నాపై కృప చూపుము. భూమి స్వరూపిణివి, అష్టవసువులచే, ఇంద్రునిచే వందింపబడే ఓ తల్లీ!
ధనదే యజమానాయ వరదే వరదా భవ |
బ్రహ్మణ్యైర్బ్రాహ్మణైః పూజ్యే పార్వతీశివశంకరే || ౧౮ ||
ఓ ధనదాయిని! యజమానిని అనుగ్రహించుము, వరములను ఇచ్చే వరదాయినివి కమ్ము. వేదవిదులైన బ్రాహ్మణులచే పూజింపబడే ఓ పార్వతీ, శివశంకరీ!
స్తోత్రం దరిద్రతావ్యాధిశమనం సుధనప్రదమ్ |
శ్రీకరే శంకరే శ్రీదే ప్రసీద మయి కింకరే || ౧౯ ||
దరిద్రమనే వ్యాధిని నయం చేసేది, చక్కని ధనాన్ని ఇచ్చేది అయిన ఈ స్తోత్రాన్ని పఠిస్తున్నాను. సంపదను ఇచ్చే ఓ శంకరీ! నీ కింకరుడనైన నాపై ప్రసన్నం కావలెను.
పార్వతీశప్రసాదేన సురేశకింకరేరితమ్ |
శ్రద్ధయా యే పఠిష్యంతి పాఠయిష్యంతి భక్తితః || ౨౦ ||
పరమశివుని అనుగ్రహం వల్ల కలిగే ఈ స్తోత్రాన్ని ఎవరైతే శ్రద్ధతో, భక్తితో పఠిస్తారో లేదా ఇతరుల చేత పఠింపజేస్తారో…
సహస్రమయుతం లక్షం ధనలాభో భవేద్ధ్రువమ్ |
ధనదాయ నమస్తుభ్యం నిధిపద్మాధిపాయ చ |
భవంతు త్వత్ప్రసాదాన్మే ధనధాన్యాదిసంపదః || ౨౧ ||
…వారికి వేలల్లో, లక్షల్లో ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది. ఓ ధనదా దేవీ! నిధులకు అధిపతివైన నీకు నమస్కారము. నీ కృప వల్ల నాకు ధనధాన్య ఆది సంపదలు సిద్ధించుగాక.
ఇతి శ్రీ ధనలక్ష్మీ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

