Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
హరివరాసనం విశ్వమోహనం
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకమ్ |
అరివిమర్దనం నిత్యనర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౧ ||
శరణకీర్తనం శక్తమానసం
భరణలోలుపం నర్తనాలసమ్ |
అరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౨ ||
ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణతకల్పకం సుప్రభాంచితమ్ |
ప్రణవమందిరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౩ ||
తురగవాహనం సుందరాననం
వరగదాయుధం వేదవర్ణితమ్ |
గురుకృపాకరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౪ ||
త్రిభువనార్చితం దేవతాత్మకం
త్రినయనప్రభుం దివ్యదేశికమ్ |
త్రిదశపూజితం చింతితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౫ ||
భవభయాపహం భావుకావహం
భువనమోహనం భూతిభూషణమ్ |
ధవళవాహనం దివ్యవారణం
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౬ ||
కలమృదుస్మితం సుందరాననం
కలభకోమలం గాత్రమోహనమ్ |
కలభకేసరీ-వాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౭ ||
శ్రితజనప్రియం చింతితప్రదం
శ్రుతివిభూషణం సాధుజీవనమ్ |
శ్రుతిమనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయే || ౮ ||
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా |
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా |
|| ఇతి శ్రీ హరిహరాత్మజాష్టకం సంపూర్ణమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.
పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.