Cheri Yashodhaku – చేరి యశోదకు


చేరి యశోదకు శిశువితడు |
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు ||

సొలసి జూచినను సూర్య చంద్రులను
లలివెదజల్లెడు లక్షణుడు |
నిలిచిన నిలువున నిఖిల దేవతల
కలిగించు సురల గనివో యితడు ||

మాటలాడిననను మరియజాండములు
కోటులు వొడమెటి గుణరాశి |
నీటుగ నూర్పుల నిఖిల వేదములు
చాటువ నూరెటి సముద్రుడితడు ||

ముంగిట పొలసిన మోహన మాత్మల
పొంగించే ఘన పురుషుడు |
సంగతి మావంటి శరణాగతులకు
అంగము శ్రీ వేంకటాధిపుడితడు ||


గమనిక: :"శ్రీ నరసింహ స్తోత్రనిధి" పుస్తకము అందుబాటులో ఉంది. Click here to buy

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

error: Not allowed