Achamanam Mantra in Telugu


మూడురకాల ఆచమన పద్ధతులు ఉన్నయి – శ్రౌతాచమనము, స్మృత్యాచమనము, పురాణాచమనము. వాటి మంత్రాలు ఈ క్రింద ఇవ్వడం జరిగింది. కుడి చేతిని గోకర్ణాకృతిలో పెట్టి, మొదటి మూడు నామాలకు ఎడమ చేతితో పంచపాత్రలో నీళ్ళను ఉద్ధరిణతో తీసుకుని కుడి అరచేతిలో పోసుకుని శబ్దం రాకుండా త్రాగాలి. నాలుగవ నామానికి నీళ్ళు విడిచిపెట్టి, తర్వాతి నామాలకు నమస్కారం చేయాలి. సాంప్రదాయాన్ని బట్టి మిగిలిన నామాలకు శరీర అంగములను స్పృశించవచ్చు.

శ్రౌతాచమనము –
౧. ఓం తత్సవితుర్వరేణ్యమ్ స్వాహా
౨. భర్గో దేవస్య ధీమహి స్వాహా
౩. ధియో యోనః ప్రచోదయాత్ స్వాహ
౪. ఆపో హిష్ఠా మయోభువః (అరచేయి)
౫. తా న ఊర్జే దధాతన (అరచేయి)
౬. మహేరణాయ చక్షసే (పై పెదవి)
౭. యో వః శివతమో రసః (క్రింద పెదవి)
౮. తస్య భాజయతే హ నః (శిరస్సు)
౯. ఉశతీరివ మాతరః (శిరస్సు)
౧౦. తస్మా అరఙ్గమామవః (ఎడమ చేయి)
౧౧. యస్య క్షయాయ జిన్వథ (పాదములు)
౧౨. ఆపో జనయథా చ నః (శిరస్సు)
౧౩. ఓం భూః (గడ్డము)
౧౪. ఓం భువః (ఎడమ ముక్కు)
౧౫. ఓం సువః (కుడి ముక్కు)
౧౬. ఓం మహః (ఎడమ కన్ను)
౧౭. ఓం జనః (కుడి కన్ను)
౧౮. ఓం తపః (ఎడమ చెవి)
౧౯. ఓగ్‍ం సత్యమ్ (కుడి చెవి)
౨౦. ఓం తత్స వితుర్వరేణ్యమ్ (నాభి)
౨౧. భర్గో దేవస్య ధీమహి (హృదయము)
౨౨. ధియో యోనః ప్రచోదయాత్ (శిరస్సు)
౨౩. ఓమాపో జ్యోతీ రసోఽమృతం (ఎడమ భుజము)
౨౪. బ్రహ్మ భూర్భువస్సువరోమ్ (కుడి భుజము)

స్మృత్యాచమనము –
౧. త్రిరాచామేత్ (స్వాహా | స్వాహా | స్వాహా )
౨. ద్విఃపరిమృజ్య (పెదవులు)
౩. సకృదుపస్పృశ్య (పెదవులు)
౪. దక్షిణేన పాణినా సవ్యంప్రోక్ష్య (ఎడమ అరచేయి)
పాదౌ (రెండు పాదములు)
శిరశ్చ (శిరస్సు)
౫. ఇంద్రియాణ్యుపస్పృశ్య చక్షుషీ (కళ్ళు)
నాసికే (ముక్కు పుటములు)
శ్రోత్రే చ (చెవులు)
౬. హృదయమాలభ్య (హృదయం)
అపవుపస్పృశ్య

పురాణాచమనము –
౧. ఓం కేశవాయ స్వాహా
౨. ఓం నారాయణాయ స్వాహా
౩. ఓం మాధవాయ స్వాహా
౪. ఓం గోవిందాయ నమః (ఎడమ అరచేయి)
౫. ఓం విష్ణవే నమః (కుడి అరచేయి)
౬. ఓం మధుసూదనాయ నమః (పై పెదవి)
౭. ఓం త్రివిక్రమాయ నమః (క్రింద పెదవి)
౮. ఓం వామనాయ నమః (శిరస్సు)
౯. ఓం శ్రీధరాయ నమః (శిరస్సు)
౧౦. ఓం హృషీకేశాయ నమః (ఎడమ చేయి)
౧౧. ఓం పద్మనాభాయ నమః (రెండు పాదములు)
౧౨. ఓం దామోదరాయ నమః (శిరస్సు)
౧౩. ఓం సంకర్షణాయ నమః (గడ్డము)
౧౪. ఓం వాసుదేవాయ నమః (ఎడమ ముక్కు)
౧౫. ఓం ప్రద్యుమ్నాయ నమః (కుడి ముక్కు)
౧౬. ఓం అనిరుద్ధాయ నమః (ఎడమ కన్ను)
౧౭. ఓం పురుషోత్తమాయ నమః (కుడి కన్ను)
౧౮. ఓం అథోక్షజాయ నమః (ఎడమ చెవి)
౧౯. ఓం నారసింహాయ నమః (కుడి చెవి)
౨౦. ఓం అచ్యుతాయ నమః (నాభి)
౨౧. ఓం జనార్దనాయ నమః (హృదయము)
౨౨. ఓం ఉపేంద్రాయ నమః (శిరస్సు)
౨౩. ఓం హరయే నమః (ఎడమ భుజము)
౨౪. ఓం శ్రీ కృష్ణాయ నమః (కుడి భుజము)


మరిన్ని శ్రీ గాయత్రీ స్తోత్రములు చూడండి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

5 thoughts on “Achamanam Mantra in Telugu

  1. స్తోత్ర నిధి వెబ్సైట్ చాలా ఉపయోగకరంగా ఉంది. ఆంగ్లం లో చెప్పాలంటే ‘వర్చువల్ గురు’ అని చెప్పవచ్చు. అక్కడ అక్కడ సూక్ష్మమైన సవరణలు అవసరమేమో, అని తెలుస్తూ ఉంది. సవరణలు తెలిపే విధానం (ఫార్మాట్) ఉన్నట్లు అయితే తెలుపగలరు.

  2. స్త్రోత్రనిధి చాలా ఉపయోగం గా ఉంది. నిత్యనైమిత్తిక విధులు చేసే వారికి, నేర్చుకోవాలనే ఆసక్తి వున్నవారికి, అన్ని దేవతా మూర్తులకు సంబంధిత స్త్రోత్రాలు ఒకేచోట ఇవ్వబడ్డాయి. సంకలన కర్తలకు ధన్యవాదములు.

  3. hi,
    This is a very useful website. Almost all doubts will be cleared regarding the stotras. Recently I have observed that in most of the words the ra vattu is not getting printed ( for visual) properly. for example sarvaalankaara is been printed as savraalankaara… ( I don’t know if I made it clear). I haven’t checked with other languages. It is for all the words with the half ra sound which comes first.

  4. This is because of the latest Safari update on iPhone and iPad. Please enable reading mode in Safari or switch to another browser such as Chrome/Firefox.

స్పందించండి

error: Not allowed
%d bloggers like this: