Sri Shankara Ashtakam – శ్రీ శంకరాష్టకమ్



[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

శీర్షజటాగణభారం గరలాహారం సమస్తసంహారమ్ |
కైలాసాద్రివిహారం పారం భవవారిధేరహం వన్దే || ౧ ||

చన్ద్రకలోజ్జ్వలఫాలం కణ్ఠవ్యాలం జగత్త్రయీపాలమ్ |
కృతనరమస్తకమాలం కాలం కాలస్య కోమలం వన్దే || ౨ ||

కోపేక్షణహతకామం స్వాత్మారామం నగేన్ద్రజావామమ్ |
సంసృతిశోకవిరామం శ్యామం కణ్ఠేన కారణం వన్దే || ౩ ||

కటితటవిలసితనాగం ఖణ్డితయాగం మహాద్భుతత్యాగమ్ |
విగతవిషయరసరాగం భాగం యజ్ఞేషు బిభ్రతం వన్దే || ౪ ||

త్రిపురాదికదనుజాన్తం గిరిజాకాన్తం సదైవ సంశాన్తమ్ |
లీలావిజితకృతాన్తం భాన్తం స్వాంతేషు దేవానాం వన్దే || ౫ ||

సురసరిదాప్లుతకేశం త్రిదశకులేశం హృదాలయావేశమ్ |
విగతాశేషక్లేశం దేశం సర్వేష్టసమ్పదాం వన్దే || ౬ ||

కరతలకలితపినాకం విగతజలాకం సుకర్మణాం పాకమ్ |
పరపదవీతవరాకం నాకఙ్గమపూగవన్దితం వన్దే || ౭ ||

భూతవిభూషితకాయం దుస్తరమాయం వివర్జితాపాయమ్ |
ప్రమథసమూహసహాయం సాయం ప్రాతర్నిరన్తరం వన్దే || ౮ ||

యస్తు పదాష్టకమేతద్బ్రహ్మానన్దేన నిర్మితం నిత్యమ్ |
పఠతి సమాహితచేతాః ప్రాప్నోత్యన్తే స శైవమేవ పదమ్ || ౯ ||

ఇతి శ్రీమత్పరమహంస స్వామిబ్రహ్మానన్దవిరచితం శ్రీశంకరాష్టకమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed