Yajurveda Samidadhanam (Agnikaryam) – యజుర్వేదీయ సమిదాధానం (అగ్నికార్యం)


(ఆచమనం చేసి ప్రాణాయామం చేయండి)
ఆచమ్య ||
ప్రాణానాయమ్య ||

సంకల్పః –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ …… సగోత్రః …… నామధేయోఽహం మమ ఆయుర్వర్చో యశో బలాభివృద్ధ్యర్థం ప్రాతరగ్నికార్య/సాయమగ్నికార్య అగ్నికార్య సమిదాధానం కరిష్యే |
(అక్షతలు, కొంచెం నీళ్ళు అరివేణంలో విడవండి)

అగ్ని ప్రజ్వలనమ్ –
(అగ్నిని వెలిగించండి)
భూర్భువస్సువరోమ్ |

పరిమార్జనమ్ –
ఓం పరి॑త్వాగ్నే॒ పరి॑మృజా॒మ్యాయు॑షా చ॒ ధనే॑న చ | సు॒ప్ర॒జాః ప్ర॒జయా॑ భూయాసగ్ం
సు॒వీరో॑ వీ॒రైస్సు॒వర్చా॒ వర్చ॑సా సు॒పోష॒: పోషై”స్సు॒గృహో॑ గృ॒హైస్సు॒పతి॒: పత్యా॑ సుమే॒ధా మే॒ధయా॑ సు॒బ్రహ్మా బ్ర॑హ్మచా॒రిభి॑: | ఇతి పరిమృజ్య ||
(కొన్ని అక్షతలు, నీళ్ళతో అగ్ని చుట్టూ ప్రదక్షిణ మార్గంలో విడవండి)

అలంకరణమ్ –
(పుష్పాక్షతలు తీసుకుని తూర్పు నుండి ఎనిమిది దిక్కులలో అగ్ని చుట్టూ వేయండి)
౧. ఓం అగ్నయే నమః | (తూర్పు)
౨. ఓం హుతవహాయ నమః | (ఆగ్నేయం)
౩. ఓం హుతాశనే నమః | (దక్షిణం)
౪. ఓం కృష్ణవర్త్మనే నమః | (నైరృతి)
౫. ఓం దేవముఖాయ నమః | (పశ్చిమం)
౬. ఓం సప్తజిహ్వాయ నమః | (వాయవ్యం)
౭. ఓం వైశ్వానరాయ నమః | (ఉత్తరం)
౮. ఓం జాతవేదసే నమః | (ఈశాన్యం)
ఇత్యలంకృత్య ||

పూర్వపరిషేచనమ్ –
(ఇక్కడ ఇవ్వబడిన దిక్కుల మధ్యలో నీళ్ళు చల్లండి)
ఓం అది॒తేఽను॑మన్యస్వ | (దక్షిణం వైపు, నైరృతి నుండి ఆగ్నేయం వరకు)
అను॑మ॒తేఽను॑మన్యస్వ | (పశ్చిమం వైపు, నైరృతి నుండి వాయవ్యం వరకు)
సర॑స్వ॒తేఽను॑మన్యస్వ | (ఉత్తరం వైపు, వాయవ్యం నుండి ఈశాన్యం వరకు)
దేవ॑సవిత॒: ప్రసు॑వ | (చుట్టూ, ఈశాన్యం నుండి ప్రదక్షిణగా ఈశాన్యం వరకు)

హోమమ్ –
(ఒకొక్క సమిధ తీసుకుని ఆవునేతిలో ముంచి హోమము చేయండి)
౧. ఓం అ॒గ్నయే॑ స॒మిధ॒మాహా”ర్షం బృహ॒తే జా॒తవే॑దసే॒ యథా॒త్వమ॑గ్నే స॒మిధా॑ సమి॒ధ్యస॑
ఏ॒వం మా॒మాయు॑షా॒ వర్చ॑సా స॒న్యామే॒ధయా” ప్ర॒జయా॑ ప॒శుభి॑ర్బ్రహ్మవర్చ॒సే నా॒న్నాద్యే॑న॒ సమే॑ధయ॒స్స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
౨. ఓం ఏధో”ఽస్యేధిషీ॒ మహి॒ స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
౩. ఓం స॒మిద॑సి సమే॒ధిషీ॒ మహి॒ స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
౪. ఓం తేజో॑ఽసి॒ తేజో॒ మయి॑ధేహి॒ స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
౫. ఓం అపో॑ అ॒ద్యాన్వ॑చారిష॒గ్॒o రసే॑న॒ సమ॑సృక్ష్మహి | పయ॑స్వాగ్ం అగ్న॒ ఆగ॑మ॒o తం మా॒ సగ్ం సృ॑జ॒ వర్చ॑సా॒ స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
౬. ఓం సమ్మా”గ్నే॒ వర్చ॑సా సృజ ప్ర॒జయా॑ చ॒ ధనే॑న చ॒ స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
౭. ఓం వి॒ద్యున్మే॑ అస్య దే॒వా ఇన్ద్రో॑ వి॒ద్యాత్స॒హర్షి॑భి॒స్స్వాహా” | ఇంద్రాయ ఇదం న మమ ||
౮. ఓం అ॒గ్నయే॑ బృహ॒తే నాకా॑య॒ స్వాహా” | అగ్నయే బృహతే నాకాయేదం న మమ ||
౯. ఓం ద్యావా॑ పృథి॒వీభ్యా॒గ్॒ స్వాహా” | ద్యావాపృథివీభ్యాం ఇదం న మమ ||
౧౦. ఓం ఏ॒షా తే॑ అగ్నే స॒మిత్తయా॒ వర్ధ॑స్వ॒ చాప్యా॑యస్వ చ॒ తయా॒హం వర్ధ॑మానో
భూయాసమా॒ప్యాయ॑మానశ్చ॒ స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
౧౧. ఓం యోమా”గ్నే భా॒గినగ్॑o స॒న్తమథా॑భా॒గం చికీ”ర్షత్యభా॒గమ॑గ్నే॒ తం కు॑రు॒ మామ॑గ్నే భా॒గిన॑o కురు॒ స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
౧౨. ఓం స॒మిధ॑మా॒ధాయా”గ్నే॒ సర్వ॑వ్రతో భూయాస॒గ్గ్॒ స్వాహా” || అగ్నయ ఇదం న మమ ||
ప్రాయశ్చిత్త హోమమ్ –
౧౩. ఓం భూస్స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
౧౪. ఓం భువ॒స్స్వాహా” | వాయవ ఇదం న మమ ||
౧౫. ఓం సువ॒స్స్వాహా” | సూర్యాయ ఇదం న మమ ||
౧౬. ఓం భూర్భువ॒స్సువ॒స్స్వాహా” | ప్రజాపతయ ఇదం న మమ ||

ఉత్తరపరిషేచనమ్ –
(ఇక్కడ ఇవ్వబడిన దిక్కుల మధ్యలో నీళ్ళు చల్లండి)
ఓం అది॒తేఽన్వ॑మగ్గ్‍స్థాః | (దక్షిణం వైపు, నైరృతి నుండి ఆగ్నేయం వరకు)
అను॑మ॒తేఽన్వ॑మగ్గ్‍స్థాః | (పశ్చిమం వైపు, నైరృతి నుండి వాయవ్యం వరకు)
సర॑స్వ॒తేఽన్వ॑మగ్గ్‍స్థాః | (ఉత్తరం వైపు, వాయవ్యం నుండి ఈశాన్యం వరకు)
దేవ॑సవిత॒: ప్రాసా॑వీః | (చుట్టూ, ఈశాన్యం నుండి ప్రదక్షిణగా ఈశాన్యం వరకు)

అగ్న్యుపస్థానమ్ –
(అగ్నికి నమస్కారం చేస్తూ ఇవి చదవండి)
ఓం యత్తే॑ అగ్నే॒ తేజ॒స్తేనా॒హం తే॑జ॒స్వీ భూ॑యాస॒మ్ |
యత్తే॑ అగ్నే॒ వర్చ॒స్తేనా॒హం వ॑ర్చ॒స్వీ భూ॑యాస॒మ్ |
యత్తే॑ అగ్నే॒ హర॒స్తేనా॒హగ్ం హ॑ర॒స్వీ భూ॑యాసమ్ || ౧ ||

మయి॑ మే॒ధాం మయి॑ ప్ర॒జాం మయ్య॒గ్నిస్తేజో॑ దధాతు |
మయి॑ మే॒ధాం మయి॑ ప్ర॒జాం మయీన్ద్ర॑ ఇన్ద్రి॒యం ద॑ధాతు |
మయి॑ మే॒ధాం మయి॑ ప్ర॒జాం మయి॒ సూర్యో॒ భ్రాజో॑ దధాతు || ౨ ||

మాన॑స్తో॒కే తన॑యే॒ మా న॒ ఆయు॑షి॒ మా నో॒ గోషు॒ మానో॒ అశ్వే॑షు రీరిషః |
వీ॒రాన్మానో॑ రుద్ర భామి॒తో వ॑ధీర్హ॒విష్మ॑న్తో॒ నమ॑సా విధేమతే || ౩ ||

భస్మ గ్రహణ మంత్రః –
(ఒక సమిధతో అగ్నిహోత్రం లోపల ఉన్న భస్మను కొంచెం తీసుకోండి)
త్ర్యా॒యు॒షం జ॒మద॑గ్నేః క॒శ్యప॑స్య త్ర్యాయు॒షమ్ |
యద్దే॒వానా”o త్ర్యాయు॒షం తన్మే॑ అస్తు త్ర్యాయు॒షమ్ ||

భస్మధారణమ్ –
(తీసుకున్న భస్మను కొంచెం ఆవునేతితో తడిచేసి, ఎడమ అరచేతిలో పూసుకుని, కుడి చేతి ఉంగరపు వేలితో తీసుకుంటూ క్రింద ఇవ్వబడిన స్థానాలలో బొట్టు పెట్టుకోండి).
భస్మనా శిరో లలాట వక్షఃస్థల స్కంధేషు తిలకాని కుర్యాత్ |
౧. మే॒ధా॒వీ భూ॑యాసమ్ | ఇతి లలాటే | (లలాటం)
౨. తే॒జ॒స్వీ భూ॑యాసమ్ | ఇతి దక్షిణభుజే | (కుడిభుజం)
౩. వ॒ర్చ॒స్వీ భూ॑యాసమ్ | ఇతి వామభుజే | (ఎడమభుజం)
౪. బ్ర॒హ్మ॒వ॒ర్చ॒సీ భూ॑యాసమ్ | ఇతి హృదయే | (హృదయం)
౫. ఆ॒యు॒ష్మాన్ భూ॑యాసమ్ | ఇతి నాభిదేశే | (నాభి)
౬. అ॒న్నా॒దో భూ॑యాసమ్ | ఇతి కంఠే | (కంఠం)
౭. య॒శ॒స్వీ భూ॑యాసమ్ | ఇతి పృష్ఠే | (వీపు)
౮. సర్వ॑సమృ॒ద్ధో భూ॑యాసమ్ | ఇతి శిరసి | (శిరస్సు)

హస్తాభ్యాం అగ్నౌ సమిధమాధాయ |
ఓం పున॑స్త్వాది॒త్యా రు॒ద్రా వస॑వ॒స్సమి॑న్ధతా॒o పున॑ర్బ్ర॒హ్మాణో॑ వసునీథయ॒జ్ఞైః | ఘృ॒తేన॒ త్వం త॒నువో॑ వర్ధయస్వ స॒త్యాస్స॑న్తు॒ యజ॑మానస్య॒ కామా॒స్స్వాహా” | అగ్నయ వసునీథాయేదం న మమ ||
(భస్మ తీసుకున్న సమిధను నేతిలో ముంచి అగ్నిలో వేయండి)

ప్రార్థనా –
(లేచి నిలబడి, దండము తీసుకుని, నమస్కరిస్తూ ఇది చెప్పండి)
ఓం స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం
విద్యాం బుద్ధిం శ్రియం బలమ్ |
ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన |
శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి ||

ప్రవర –
(ప్రవర చెప్పుకోండి)
చతుస్సాగర పర్యన్తం గోబ్రాహ్మణేభ్యశ్శుభం భవతు |
…… ఋషేయ ప్రవరాన్విత …… సగోత్రః ……సూత్రః …… శాఖాధ్యాయీ …… శర్మాఽహం భో అభివాదయే ||

అర్పణమ్ –
(కూర్చుని ఆచమనం చేసి నమస్కారం చేస్తూ ఇవి చదవండి)
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపోహోమ క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే హుతాశనమ్ ||

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన |
యద్ధుతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||

అనేన మయా కృతేన ప్రాతరగ్నికార్య/సాయమగ్నికార్య సమిదాధానేన భగవాన్ సర్వాత్మకః యజ్ఞేశ్వరస్సుప్రీణాతు |

(అక్షతలు నీటిలో సహా తీసుకుని పళ్ళెంలో విడిచిపెట్టండి)
ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు | ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: |


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed