Vinaro Bhagyamu – వినరో భాగ్యము విష్ణు కథ


వినరో భాగ్యము విష్ణు కథ |
వెనుబలమిదివో విష్ణు కథ ||

ఆదినుండి సంధ్యాదివిధులలో
వేదంబయినది విష్ణు కథ |
నాదించీనిదె నారదాదులచే
వీధి వీధులనే విష్ణు కథ ||

వదలక వేదవ్యాసులు నుడిగిన
విదిత పావనము విష్ణు కథ |
సదనంబయినది సంకీర్తనయై
వెదకిన చోటనే విష్ణు కథ ||

గొల్లెతలు చల్లలు గొనకొని చిలకగ
వెల్లివిరియాయె విష్ణు కథ |
యిల్లిదే శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లి గొలిపె నీ విష్ణు కథ ||


గమనిక: "శ్రీ కాళికా స్తోత్రనిధి" విడుదల చేశాము. కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Not allowed