ధ్యానం –
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాది లక్ష్యమ్ |
ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం
సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి ||
ఓం శ్రీసాయినాథాయ నమః ధ్యానం సమర్పయామి ||
ఆవాహనం –
ఆగచ్ఛ సద్గురు దేవ స్థానే చాత్ర స్థిరో భవ |
యావత్ పూజాం కరిష్యామి తావత్త్వం సన్నిధౌ భవ ||
ఓం శ్రీసాయినాథాయ నమః ఆవాహయామి ||
ఆసనం –
అమూల్యరత్నసారం చ నిర్మితం విశ్వకర్మణా |
ఆసనం చ ప్రసన్నం చ సాయినాథ ప్రగృహ్యతామ్ ||
ఓం శ్రీసాయినాథాయ నమః ఆసనం సమర్పయామి ||
పాద్యం –
సాయినాథ నమస్తేఽస్తు సంసారార్ణవతారక |
పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ ||
ఓం శ్రీ సాయినాథాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి ||
అర్ఘ్యం –
పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీజలమ్ |
శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం సాయిసద్గురుమ్ ||
ఓం శ్రీ సాయినాథాయ నమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి ||
ఆచమనం –
పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా |
గృహ్యతాం సాయినాథం చ రమ్యమాచమనీయకమ్ ||
ఓం శ్రీసాయినాథాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ||
పంచామృత స్నానం –
స్నానం పంచామృతైర్దేవ గృహాణ సుఖదాయక |
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ ప్రణవప్రియ ||
ఓం శ్రీసాయినాథాయ నమః పంచామృతస్నానం సమర్పయామి ||
స్నానం –
గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః |
స్నానం కురుష్వ సద్గురుం సాయినాథం నమోఽస్తు తే |
ఓం శ్రీసాయినాథాయ నమః శుద్ధోదకస్నానం సమర్పయామి ||
వస్త్రం –
శ్వేతాంబరధరం దేవం స్వర్ణతంతు సమన్వితమ్ |
హరిద్వర్ణ శిరస్త్రం చ సాయినాథ ప్రగృహ్యతామ్ ||
ఓం శ్రీసాయినాథాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
మృదువస్త్రం (శాలువా) –
రాంకవం పాటలం వర్ణం మృదువస్త్రం సునిర్మలమ్ |
సౌవర్ణలక్షణం చైవ సాయినాథ ప్రగృహ్యతామ్ ||
ఓం శ్రీసాయినాథాయ నమః మృదువస్త్రం సమర్పయామి |
చందనం –
కస్తూరీ కుంకుమైర్యుక్తం ఘనసారేణ మిశ్రితమ్ |
మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీసాయినాథాయ నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి |
అక్షతలు –
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ |
గృహాణ పరమానంద సాయినాథ నమోఽస్తు తే ||
ఓం శ్రీసాయినాథాయ నమః అక్షతాన్ సమర్పయామి |
పుష్పసమర్పణం –
తురీయవనసంభూతం నానాగుణమనోహరమ్ |
ఆనంద సౌరభం పుష్పం గృహ్యతాం సాయిసద్గురుమ్ ||
ఓం శ్రీ సాయినాథాయ నమః పుష్పాణి సమర్పయామి |
అథాంగ పూజా –
ఓం శిరిడీనివాసాయ నమః – పాదౌ పూజయామి |
ఓం భక్తావనప్రతిజ్ఞాయ నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం సర్వాపన్నివారకాయ నమః – జంఘే పూజయామి |
ఓం సర్వశుభప్రదాయ నమః – జానునీ పూజయామి |
ఓం సర్వభూతహితేరతాయ నమః – ఊరూ పూజయామి |
ఓం ఆపద్బాంధవాయ నమః – కటిం పూజయామి |
ఓం సర్వమతసారభూతాయ నమః – ఉదరం పూజయామి |
ఓం భక్తిప్రబోధకాయ నమః – వక్షస్థలం పూజయామి |
ఓం మహాద్భుతప్రదర్శకాయ నమః – బాహూన్ పూజయామి |
ఓం దీపప్రియాయ నమః – కంఠం పూజయామి |
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః – కర్ణౌ పూజయామి |
ఓం సత్యతత్త్వభోధకాయ నమః – వక్త్రం పూజయామి |
ఓం నిరాడంబరాయ నమః – దంతాన్ పూజయామి |
ఓం సర్వాభీష్టప్రదాయ నమః – నాసికాం పూజయామి |
ఓం సర్వమంగళకరాయ నమః – నేత్రౌ పూజయామి |
ఓం త్రికాలజ్ఞాయ నమః – శిరః పూజయామి |
ఓం శ్రీసాయినాథాయ నమః – సర్వాణ్యాంగాని పూజయామి |
అష్టోత్తర శతనామావళిః –
శ్రీ సాయి అష్టోత్తర శతనామావళిః చూ. ||
ధూపం –
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరమ్ |
సాయినాథ నమస్తుభ్యం గృహాణ వరదో భవ ||
ఓం శ్రీసాయినాథాయ నమః ధూపమాఘ్రాపయామి ||
దీపం –
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం సాయినాథ నమోఽస్తు తే ||
ఓం శ్రీసాయినాథాయ నమః దీపం దర్శయామి ||
నైవేద్యం –
సర్వభక్షైశ్చ భోజ్యైశ్చ రసైః షడ్భిః సమన్వితమ్ |
నైవేద్యం తు మయా దత్తం గృహాణ తత్త్వబోధక ||
ఓం శ్రీసాయినాథాయ నమః నైవేద్యం సమర్పయామి |
తాంబూలం –
పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీ దళైర్యుతమ్ |
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీసాయినాథాయ నమః తాంబూలం సమర్పయామి ||
నీరాజనం –
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైః స్థితమ్ |
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ ||
ఓం శ్రీ సాయిసమర్థాయ నమః కర్పూరనీరాజనం సమర్పయామి ||
మంత్రపుష్పం –
హరిః ఓం | యజ్ఞేన యజ్ఞమయజంత దేవా-
-స్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమానః సచంత
యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః || ౧ ||
ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే
నమో వయం వైశ్రవణాయ కుర్మహే |
స మే కామాన్ కామకామాయ మహ్యం
కామేశ్వరో వైశ్రవణో దధాతు |
కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః || ౨ ||
ఓం స్వస్తి | సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం
సమంతపర్యాయీ స్యాత్ సార్వభౌమః సార్వాయుషాన్ ఆతాదాపరార్ధాత్
పృథివ్యై సముద్రపర్యంతాయాః ఏకరాళితి || ౩ ||
తదప్యేష శ్లోకోఽభిగీతో మరుతః పరివేష్టారో మరుత్తస్యావసన్ గృహే |
ఆవిక్షితస్య కామప్రేర్విశ్వేదేవాః సభాసద ఇతి || ౪ ||
శ్రీనారాయణ వాసుదేవాయ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ||
ఓం శ్రీసాయినాథాయ నమః పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |
ఆత్మప్రదక్షిణ నమస్కారం –
యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీసాయినాథ ప్రభో |
ఓం శ్రీసాయినాథాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
సాష్టాంగ నమస్కారం –
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ||
ఓం శ్రీసాయినాథాయ నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి |
సాయిప్రార్థన –
౧. హే సాయి పరమేశ్వరా! పరమపావనా! పరమకళ్యాణగుణాచరణా! పాపహరణా! మీకు వందనములు.
౨. ప్రతిదినము మేము ఎవరికిని బాధకలుగ చేయకుండునట్లు మమ్ములను ఆశీర్వదించుము సాయినాథా!
౩. మేము చేసిన పాపములను క్షమించుము మహేశ్వరా!
౪. మాలో ఐకమత్యము వృద్ధిచేసి మమ్ములను సన్మార్గములో నడిపించుము కరుణానిధి!
౫. మీ అనంతశక్తి నుండి ఒక అణుమాత్రపుశక్తిని మాకు ప్రసాదించుము దయాకరా!
౬. మా లక్ష్యమును శీఘ్రముగా చేరునట్లు మమ్ములను అనుగ్రహింపుము మధుసూదనా!
స్వస్తి ప్రార్థన –
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః |
గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాః సమస్తా సుఖినో భవంతు ||
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ
దేశోఽయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయః |
అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః
నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతమ్ ||
క్షమా ప్రార్థనా –
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కృపానిధే |
యత్పూజితం మయా సాయి పరిపూర్ణం తదస్తు తే |
సమర్పణం –
అనయా మయా కృత ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సాయినాథ సద్గురుః సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ||
తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం శ్రీ సాయినాథ పాదోదకం పావనం శుభమ్ ||
శ్రీ సాయినాథాయ నమః ప్రసాదం శీరసా గృహ్ణామి |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
మరిన్ని పూజా విధానాలు మరియు వ్రతములు చూడండి.
గమనిక : రాబోయే మహాశివరాత్రి సందర్భంగా "శ్రీ శివ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Can you please send this document in pdf to my mail ID. [email protected]
This puja is available in Stotranidhi app. Please download