Read in తెలుగు / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సాయి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.]
శిరిడీవాసా సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం ||
త్రిమూర్తిరూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి
దర్శనమియ్య గరావయ్య ముక్తికి మార్గం చూపుమయా || ౧ ||
శిరిడీవాసా సాయిప్రభో ||
కఫిని వస్త్రము ధరియించి భుజముకు జోలీ తగిలించి
నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో
కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
శిరిడీ గ్రామం నీ వాసం భక్తుల మదిలో నీ రూపం || ౨ ||
శిరిడీవాసా సాయిప్రభో ||
చాంద్ పాటిల్ ను కలుసుకుని ఆతని బాధలు తెలుసుకుని
గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలములను
అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం || ౩ ||
శిరిడీవాసా సాయిప్రభో ||
బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం || ౪ ||
శిరిడీవాసా సాయిప్రభో ||
నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితిని
అభయమునిచ్చి బ్రోవుమయా ఓ శిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి || ౫ ||
శిరిడీవాసా సాయిప్రభో ||
ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహమ్మారీ నాశం కాపాడి శిరిడీ గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలిగించి || ౬ ||
శిరిడీవాసా సాయిప్రభో ||
భక్త భీమాజీకి క్షయరోగం నశియించే ఆతని సహనం
ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి
దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం || ౭ ||
శిరిడీవాసా సాయిప్రభో ||
కరుణాసింధూ కరుణించు మాపై కరుణ కురిపించు
సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును
ముస్లిం అనుకొని నిను మేఘూ తెలుసుకుని ఆతని బాధ
దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము || ౮ ||
శిరిడీవాసా సాయిప్రభో ||
డాక్టరుకు నీవు రామునిగా బల్వంతకు శ్రీదత్తునిగా
నిమోనుకరకు మారుతిగా చిదంబరకు శ్రీగణపతిగా
మార్తాండకు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగా జోషికి దర్శనము నిచ్చిన శ్రీసాయి || ౯ ||
శిరిడీవాసా సాయిప్రభో ||
రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు బాబా మాకవి వేదాలు
శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి || ౧౦ ||
శిరిడీవాసా సాయిప్రభో ||
అందరిలోన నీ రూపం నీ మహిమ అతి శక్తిమయం
ఓ సాయి మేము మూఢులము ఒసగుమయా మాకు జ్ఞానమును
సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము || ౧౧ ||
శిరిడీవాసా సాయిప్రభో ||
భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయీ ధ్యానం చేయండి ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి
సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి || ౧౨ ||
శిరిడీవాసా సాయిప్రభో ||
మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి సాయి మన సద్గురువండి || ౧౩ ||
శిరిడీవాసా సాయిప్రభో ||
వందనమయ్యా పరమేశా ఆపద్బాంధవ సాయీశా
మా పాపములూ కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము దరిచేర్చోయీ
మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం || ౧౪ ||
శిరిడీవాసా సాయిప్రభో ||
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ||
ధూప ఆరతి >>
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సాయి స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ సాయిబాబా స్తోత్రాలు చూడండి.
గమనిక : రాబోయే మహాశివరాత్రి సందర్భంగా "శ్రీ శివ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Thanku
om sai ram
Om sai ram
Om sai ram
???om sai ram???
om sai ram
Sacchidananda sadguru Sainath Maharaj ki jai
Sacchidananda sadguru Sainath Maharaj ki jai
Om sairam
om sai ram
??????Jai SaiRam??????
om sai sri sai jayjaya sai
Good lyrics. Thank you ??
Om sai ram sai baba ekkadunna dharmaga undali krishna darmanni vadala kodadu.
om sai ram
Ome SaiRam
om sai ram