Sri Mahalakshmi Ashtakam (with Telugu Meanings) – శ్రీ మహాలక్ష్మ్యష్టకం



// శ్లోకాలు – తాత్పర్యం //

ఇంద్ర ఉవాచ |
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే || ౧ ||

ఇంద్ర ఉవాచ: శ్రీపీఠమున నివసించేదానా, దేవతలచే పూజింపబడే మహా మాయాస్వరూపిణీ! చేతులలో శంఖము, చక్రము, గదను ధరించిన ఓ మహాలక్ష్మీ! నీకు నమస్కారము.

నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || ౨ ||

గరుడ వాహనాన్ని అధిరోహించినదానా, కోలాసురుడనే రాక్షసుడికి భయం కలిగించేదానా, సమస్త పాపాలను హరించే ఓ మహాలక్ష్మీ! నీకు నమస్కారము.

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి |
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || ౩ ||

అంతా తెలిసినదానా (సర్వజ్ఞురాలివి), కోరిన వరాలనిచ్చేదానా, దుష్టులకు భయాన్ని కలిగించేదానా, సమస్త దుఃఖాలను తొలగించే ఓ మహాలక్ష్మీ! నీకు నమస్కారము.

సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని |
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || ౪ ||

సిద్ధిని (విజయాన్ని), బుద్ధిని ప్రసాదించేదానా, భుక్తిని (సుఖాలను) మరియు ముక్తిని (మోక్షాన్ని) ఇచ్చేదానా, మంత్ర స్వరూపిణివైన ఓ మహాలక్ష్మీ! నీకు నమస్కారము.

ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి |
యోగజే యోగసంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే || ౫ || [యోగజ్ఞే]

ఆది మరియు అంతము లేనిదానా (శాశ్వతురాలివి), ఆదిశక్తివి, మహేశ్వరివి, యోగము నుండి పుట్టిన ఓ మహాలక్ష్మీ! నీకు నమస్కారము.

స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తే మహోదరే |
మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || ౬ ||

స్థూల, సూక్ష్మ రూపములలో ఉన్నదానా, భయంకరమైన రౌద్ర రూపము కలదానా, మహాశక్తివి, గొప్ప ఉదరము కలదానా (బ్రహ్మాండాన్ని కడుపులో ఉంచుకున్న తల్లి), మహా పాపాలను హరించే ఓ మహాలక్ష్మీ! నీకు నమస్కారము.

పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి |
పరమేశి జగన్మాతర్మహాలక్ష్మి నమోఽస్తు తే || ౭ ||

పద్మముపై ఆసీనురాలై ఉన్నదానా, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణివి, పరమేశ్వరివి, జగన్మాతవైన ఓ మహాలక్ష్మీ! నీకు నమస్కారము.

శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే |
జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మి నమోఽస్తు తే || ౮ ||

తెల్లని వస్త్రాలను ధరించినదానా, నానావిధ అలంకారములతో శోభిల్లేదానా, జగత్తు అంతటా వ్యాపించి ఉన్న జగన్మాతవైన ఓ మహాలక్ష్మీ! నీకు నమస్కారము.

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః |
సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || ౯ ||

ఈ మహాలక్ష్మ్యష్టకాన్ని భక్తితో పఠించేవారు సర్వ సిద్ధులను పొందుతారు. వారికి రాజ్యము (అధికారము/గౌరవము) ప్రాప్తిస్తుంది.

ఏకకాలం పఠేన్నిత్యం మహాపాపవినాశనమ్ |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః || ౧౦ ||

రోజుకు ఒకసారి పఠిస్తే మహా పాపాలు నశిస్తాయి. రోజుకు రెండుసార్లు పఠించేవారికి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది.

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనమ్ |
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా || ౧౧ ||

రోజుకు మూడుసార్లు పఠిస్తే మహా శత్రువులు నశిస్తారు. అమ్మవారు ఎల్లప్పుడూ ప్రసన్నురాలై, శుభాలను ఇస్తూ వరాలను ప్రసాదిస్తుంది.

ఇతి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ ||


మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed