Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
రక్తాంభోరుహదర్పభంజనమహాసౌందర్యనేత్రద్వయం
ముక్తాహారవిలంబిహేమముకుటం రత్నోజ్జ్వలత్కుండలమ్ |
వర్షామేఘసమాననీలవపుషం గ్రైవేయహారాన్వితం
పార్శ్వే చక్రధరం ప్రసన్నవదనం నీలాద్రినాథం భజే || ౧ ||
ఫుల్లేందీవరలోచనం నవఘనశ్యామాభిరామాకృతిం
విశ్వేశం కమలావిలాసవిలసత్పాదారవిందద్వయమ్ |
దైత్యారిం సకలేందుమండితముఖం చక్రాబ్జహస్తద్వయం
వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం లక్ష్మీనివాసాలయమ్ || ౨ ||
ఉద్యన్నీరదనీలసుందరతనుం పూర్ణేందుబింబాననం
రాజీవోత్పలపత్రనేత్రయుగళం కారుణ్యవారాంనిధిమ్ |
భక్తానాం సకలార్తినాశనకరం చింతాబ్ధిచింతామణిం
వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం నీలాద్రిచూడామణిమ్ || ౩ ||
నీలాద్రౌ శంఖమధ్యే శతదళకమలే రత్నసింహాసనస్థం
సర్వాలంకారయుక్తం నవఘనరుచిరం సంయుతం చాగ్రజేన |
భద్రాయా వామభాగే రథచరణయుతం బ్రహ్మరుద్రేంద్రవంద్యం
వేదానాం సారమీశం సుజనపరివృతం బ్రహ్మతాతం స్మరామి || ౪ ||
దోర్భ్యాం శోభితలాంగలం సముసలం కాదంబరీచంచలం
రత్నాఢ్యం వరకుండలం భుజబలైరాక్రాంతభూమండలమ్ |
వజ్రాభామలచారుగండయుగళం నాగేంద్రచూడోజ్జ్వలం
సంగ్రామే చపలం శశాంకధవళం శ్రీకామపాలం భజే || ౫ ||
ఇతి శ్రీ జగన్నాథ పంచకమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.