౧. వడ్డన చేస్తున్నప్పుడు
అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ || ౧
బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా || ౨
ఓం స॒హ నా॑వవతు | స॒హ నౌ॑ భునక్తు | స॒హ వీ॒ర్య॑o కరవావహై |
తే॒జ॒స్వినా॒వధీ॑తమస్తు॒ మా వి॑ద్విషా॒వహై” ||
ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: || ౩
౨. పరిషేచనమ్
ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ || ౧
(కుడిచేతిలో నీళ్ళు తీసుకుని విస్తరిలోని పదార్థములపై జల్లండి)
స॒త్యం త్వ॒ర్తేన॒ పరి॑షించామి || ౨ (ప్రాతః)
[ ఋ॒తం త్వా॑ స॒త్యేన॒ పరి॑షించామి | (రాత్రి) ]
(విస్తరి చుట్టూ ఈశాన్యం నుండి ఈశాన్యం వరకు ప్రదక్షిణ మార్గంగా నీళ్ళు తిప్పండి)
అ॒మృత॑మస్తు | అ॒మృతో॒ప॒స్తర॑ణమసి || ౩
(కుడిచేతిలో కొంచెం నీరు తీసుకుని త్రాగండి)
(తరువాత ఎడమచేతిలో ఉన్న పంచపాత్రలోని నీరు కొంచెం భూమి మీద పోసి, పంచపాత్ర పక్కన పెట్టి, విస్తరిని ఎడమచేతి మధ్యవేలితో నొక్కిపెట్టి ఉంచండి)
(ఈ క్రింది మంత్రములు చదువుతూ కుడిచేతి అనామిక-మధ్యమ వ్రేళ్ళతో విస్తరిలోని నెయ్యి వేసిన అన్నం మెతుకులు ఒకటి రెండు తీసుకుని, పంటికి తగలకుండా నాలుకమీద వేసుకుని మ్రింగుతూ ఉండండి)
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” |
ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
బ్రహ్మ॑ణి మ ఆ॒త్మామృ॑త॒త్వాయ॑ || ౪
(ఎడమచేయి విస్తరి మీద నుంచి తీసి, ఇంతకుముందు క్రింద వేసిన నీళ్ళను స్పృశించి, విస్తరిలోని భోజన పాదార్థాలను స్వీకరించడం ప్రారంభించండి)
౩. ఉత్తరాపోశనమ్
(ఎడమచేతితో పంచపాత్రలోని నీరు కొంచెం కుడి అరచేతిలో పోసుకుని, ఇది చదివి, సగము వరకు తాగండి)
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి స్వాహా” || ౧
(మిగిలిన సగం నీళ్ళను, ఈ శ్లోకం చదువుతూ, విస్తరి చుట్టూ ఈశాన్యం నుండి ఈశాన్యం వరకు అప్రదక్షిణముగా చల్లుతూ విడిచిపెట్టండి)
రౌరవేఽపుణ్యనిలయే పద్మార్బుద నివాసినామ్ |
అర్థినాముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు || ౨
౪. భోజనము తరువాత
(మహానారాయణోపనిషత్ ౭౦)
శ్ర॒ద్ధాయా”o ప్రా॒ణే నివి॑శ్యా॒మృత॑గ్ం హు॒తమ్ |
ప్రా॒ణమన్నే॑నాప్యాయస్వ || ౧
శ్ర॒ద్ధాయా॑మపా॒నే నివి॑శ్యా॒మృత॑గ్ం హు॒తమ్ |
అ॒పా॒నమన్నే॑నాప్యాయస్వ || ౨
శ్ర॒ద్ధాయా”o వ్యా॒నే నివి॑శ్యా॒మృత॑గ్ం హు॒తమ్ |
వ్యా॒నమన్నే॑నాప్యాయస్వ || ౩
శ్ర॒ద్ధాయా॑ముదా॒నే నివి॑శ్యా॒మృత॑గ్ం హు॒తమ్ |
ఉ॒దా॒నమన్నే॑నాప్యాయస్వ || ౪
శ్ర॒ద్ధాయా॑గ్ం సమా॒నే నివి॑శ్యా॒మృత॑గ్ం హు॒తమ్ |
స॒మా॒నమన్నే॑నాప్యాయస్వ || ౫
అన్నదాతా సుఖీభవ || ౬
మరిన్ని శ్రీ గాయత్రీ స్తోత్రములు చూడండి.
గమనిక : రాబోయే మహాశివరాత్రి సందర్భంగా "శ్రీ శివ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
chala bagundhi….i have learnt the manthra from this site and providing this link to others
Very useful for people like me