Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
వరదానకరాబ్జాయ వటమూలనివాసినే |
వదాన్యాయ వరేణ్యాయ వామదేవాయ మంగళమ్ || ౧ ||
వల్లీశవిఘ్నరాజాభ్యాం వందితాయ వరీయసే |
విశ్వార్తిహరణాయాఽస్తు విశ్వనాథాయ మంగళమ్ || ౨ ||
కళ్యాణవరదానాయ కరుణానిధయే కలౌ |
కమలాపతికాంతాయ కల్పరూపాయ మంగళమ్ || ౩ ||
సర్వారిష్టవినాశాయ సర్వాభీష్టప్రదాయినే |
సర్వమంగళరూపాయ సద్యోజాతాయ మంగళమ్ || ౪ ||
ఈతిభీతినివారాయ చేతిహాసాఽభివాదినే |
ఈషణాత్రయహారాయ చేశానోర్ధ్వాయ మంగళమ్ || ౫ ||
అతిసౌమ్యాఽతిరుద్రాయ అవిరుద్ధాయ శూలినే |
అమలాయ మహేశాయ అఘోరేశాయ మంగళమ్ || ౬ ||
దూర్వాసాదిప్రపూజ్యాయ దుష్టనిగ్రహకారిణే |
దూరీకృతాయ దుఃఖానాం ధూళిధారాయ మంగళమ్ || ౭ ||
హృదయాంబుజవాసాయ హరాయ పరమాత్మనే |
హరికేశాయ హృద్యాయ హంసరూపాయ మంగళమ్ || ౮ ||
కకుద్వాహాయ కల్పాయ కల్పితానేకభూతినే |
కమలాలయవాసాయ కరుణాక్షాయ మంగళమ్ || ౯ ||
నకారాయ నటేశాయ నందివిద్యావిధాయినే |
నదీచంద్రజటేశాయ నాదరూపాయ మంగళమ్ || ౧౦ ||
మకారాయ మహేశాయ మందహాసేనభాసినే |
మహనీయ మనోరమ్య మాననీయాయ మంగళమ్ || ౧౧ ||
శివాయ శక్తినాథాయ సచ్చిదానందరూపిణే |
సులభాయ సుశీలాయ శికారాద్యాయ మంగళమ్ || ౧౨ ||
వసిష్ఠాదిభిరర్చ్యాయ విశిష్టాచారవర్తినే |
విష్ణుబ్రహ్మాదివంద్యాయ వకారాఖ్యాయ మంగళమ్ || ౧౩ ||
యతిసేవ్యాయ యామ్యాయ యజ్ఞసాద్గుణ్యదాయినే |
యజ్ఞేశాయ యమాంతాయ యకారాంతాయ మంగళమ్ || ౧౪ ||
అరుణాచలపూజ్యాయ తరుణారుణభాసినే |
కలికల్మషనాశాయ మంగళం గురుమూర్తయే || ౧౫ ||
గురుమూర్తేరిదం స్తోత్రం సుప్రభాతాభిదం శుభమ్ |
పఠతాం శ్రీరవాప్నోతి భుక్తిముక్తిప్రదేరితా || ౧౬ ||
ఇతి శ్రీ గురుమూర్తి మంగళ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


