Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సరస్వతీ స్తోత్రనిధి” మరియు “ప్రభాత స్తోత్రనిధి” పుస్తకాలలో ప్రింటు చేశాము.]
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైః సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిఃశేషజాడ్యాపహా || ౧ ||
దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభైరక్షమాలాం దధానా
హస్తేనైకేన పద్మం సితమపి చ శుకం పుస్తకం చాపరేణ |
భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాఽసమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా || ౨ ||
సురాసురైః సేవితపాదపంకజా
కరే విరాజత్ కమనీయపుస్తకా |
విరించిపత్నీ కమలాసనస్థితా
సరస్వతీ నృత్యతు వాచి మే సదా || ౩ ||
సరస్వతీ సరసిజకేసరప్రభా
తపస్వినీ సితకమలాసనప్రియా |
ఘనస్తనీ కమలవిలోలలోచనా
మనస్వినీ భవతు వరప్రసాదినీ || ౪ ||
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || ౫ ||
సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః || ౬ ||
నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |
విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః || ౭ ||
శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః || ౮ ||
ముక్తాలంకృతసర్వాంగ్యై మూలాధారే నమో నమః |
మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః || ౯ ||
మనోన్మని మహాయోగే వాగీశ్వరి నమో నమః |
వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః || ౧౦ ||
వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః || ౧౧ ||
సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞే తే నమో నమః || ౧౨ ||
యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః |
దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః || ౧౩ ||
అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః |
చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః || ౧౪ ||
అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః |
అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః || ౧౫ ||
జ్ఞానవిజ్ఞానరూపాయై జ్ఞానమూర్తే నమో నమః |
నానాశాస్త్రస్వరూపాయై నానారూపే నమో నమః || ౧౬ ||
పద్మదా పద్మవంశా చ పద్మరూపే నమో నమః |
పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశిని || ౧౭ ||
మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః |
బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః || ౧౮ ||
కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః |
కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః || ౧౯ ||
సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్ సిద్ధిరుచ్యతే |
చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి || ౨౦ ||
ఇత్థం సరస్వతీస్తోత్రమగస్త్యమునివాచకమ్ |
సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ || ౨౧ ||
ఇతి అగస్త్యముని ప్రోక్త శ్రీ సరస్వతీ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము (శ్లోకాలు మాత్రమే), ఈ క్రింది రెండు పుస్తకాలలో ప్రింటు చేశాము.
మరిన్ని శ్రీ సరస్వతీ స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
3 thoughts on “Sri Saraswati Stotram (Agastya Krutam) – శ్రీ సరస్వతీ స్తోత్రం (అగస్త్య కృతం)”
స్పందించండి
వ్యాఖ్యానించడానికి మీరు తప్పనిసరిగా ప్రవేశించి ఉండాలి.




చాలా మంచి ఉపయోగకర విషయాలను పొందుపరచినారు… ధన్యవాదములు… వేలైతే వీరభద్ర అష్టోత్తరమును జేర్చగలరు….
Great Job Krishna Garu! Saluting your efforts…
దేశం లోని సరస్వతీ క్షేత్రాల సమాచారాన్ని అందిస్తే చాలా బాగుంటుంది . కాశ్మీర్ లోని సరస్వతీ శక్తి పీఠ ఆవిర్భావ కథ , వర్త మాన కాలం లో ఈ క్షేత్రం ఎలా ఉంది ?
దేవి ప్రసాదించే ఫలితాలు , పరిహారాలు కూడా పొందుపరిస్తే బాగుంటుంది.