Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
అస్య శ్రీమాతంగీ కవచమంత్రస్య మహాయోగీశ్వరఋషిః అనుష్టుప్ ఛందః శ్రీమాతంగీశ్వరీ దేవతా శ్రీమాతంగీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||
నీలోత్పలప్రతీకాశామంజనాద్రిసమప్రభామ్ |
వీణాహస్తాం గానరతాం మధుపాత్రం చ బిభ్రతీమ్ || ౧ ||
సర్వాలంకారసంయుక్తాం శ్యామలాం మదశాలినీమ్ |
నమామి రాజమాతంగీం భక్తానామిష్టదాయినీమ్ || ౨ ||
ఏవం ధ్యాత్వా జపేన్నిత్యం కవచం సర్వకామదమ్ |
ఓం | శిఖాం మే శ్యామలా పాతు మాతంగీ మే శిరోఽవతు || ౩ ||
లలాటం పాతు చండేశీ భ్రువౌ మే మదశాలినీ |
కర్ణౌ మే పాతు మాతంగీ శంఖీ కుండలశోభితా || ౪ ||
నేత్రే మే పాతు రక్తాక్షీ నాసికాం పాతు మే శివా |
గండౌ మే పాతు దేవేశీ ఓష్ఠౌ బింబఫలాధరా || ౫ ||
జిహ్వాం మే పాతు వాగీశీ దంతాన్ కల్యాణకారిణీ |
పాతు మే రాజమాతంగీ వదనం సర్వసిద్ధిదా || ౬ ||
కంఠం మే పాతు హృద్యాంగీ వీణాహస్తా కరౌ మమ |
హృదయం పాతు మే లక్ష్మీర్నాభిం మే విశ్వనాయికా || ౭ ||
మమ పార్శ్వద్వయం పాతు సూక్ష్మమధ్యా మహేశ్వరీ |
శుకశ్యామా కటిం పాతు గుహ్యం మే లోకమోహినీ || ౮ ||
ఊరూ మే పాతు భద్రాంగీ జానునీ పాతు శాంకరీ |
జంఘాద్వయం మే లోకేశీ పాదౌ మే పరమేశ్వరీ || ౯ ||
ప్రాగాదిదిక్షు మాం పాతు సర్వైశ్వర్యప్రదాయినీ |
రోమాణి పాతు మే కృష్ణా భార్యాం మే భవవల్లభా || ౧౦ ||
శంకరీ సర్వతః పాతు మమ సర్వవశంకరీ |
మహాలక్ష్మీర్మమ ధనం విశ్వమాతా సుతాన్ మమ || ౧౧ ||
శ్రీమాతంగీశ్వరీ నిత్యం మాం పాతు జగదీశ్వరీ |
మాతంగీ కవచం నిత్యం య ఏతత్ ప్రపఠేన్నరః || ౧౨ ||
సుఖిత్వా సకలాన్ లోకాన్ దాసీభూతాన్ కరోత్యసౌ |
ప్రాప్నోతి మహతీం కాంతిం భవేత్ కామశతప్రభః || ౧౩ ||
లభతే మహతీం లక్ష్మీం త్రైలోక్యే చాపి దుర్లభామ్ |
అణిమాద్యష్టసిద్ధోఽయం సంచరత్యేష మానవః || ౧౪ ||
సర్వవిద్యానిధిరయం భవేద్వాగీశ్వరేశ్వరః |
బ్రహ్మరాక్షసవేతాలభూతప్రేతపిశాచకైః || ౧౫ ||
జ్వలన్వహ్న్యాదివత్త్రస్తైర్వీక్ష్యతే భూతపూర్వకైః |
పరమం యోగమాప్నోతి దివ్యజ్ఞానం సమశ్నుతే || ౧౬ ||
పుత్రాన్ పౌత్రానవాప్నోతి శ్రీర్విద్యాకాంతి సంయుతాన్ |
తద్భార్యా దుర్భగా చాపి కాంత్యా రతిసమా భవేత్ || ౧౭ ||
సర్వాన్ కామానవాప్నోతి మహాభోగాన్ సుదుర్లభాన్ |
ముక్తిమంతే సమాప్నోతి సాక్షాత్పరశివో భవేత్ || ౧౮ ||
ఇతి శ్రీ మహాగమరహస్యే దత్తాత్రేయ వామదేవ సంవాదే సప్తమపరిచ్ఛేదే శ్రీ మాతంగీ కవచమ్ |
మరిన్ని శ్రీ శ్యామలా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.