Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీ హరిహర అష్టోత్తరశతనామావళిః>>
గోవిన్ద మాధవ ముకున్ద హరే మురారే
శమ్భో శివేశ శశిశేఖర శూలపాణే |
దామోదరాఽచ్యుత జనార్దన వాసుదేవ
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || ౧ ||
గఙ్గాధరాఽన్ధకరిపో హర నీలకణ్ఠ
వైకుణ్ఠ కైటభరిపో కమఠాఽబ్జపాణే |
భూతేశ ఖణ్డపరశో మృడ చణ్డికేశ
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || ౨ ||
విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే
గౌరీపతే గిరిశ శఙ్కర చన్ద్రచూడ |
నారాయణాఽసురనిబర్హణ శార్ఙ్గపాణే
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || ౩ ||
మృత్యుఞ్జయోగ్ర విషమేక్షణ కామశత్రో
శ్రీకాన్త పీతవసనాఽమ్బుదనీల శౌరే |
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || ౪ ||
లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య
శ్రీకణ్ఠ దిగ్వసన శాన్త పినాకపాణే |
ఆనన్దకన్ద ధరణీధర పద్మనాభ
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || ౫ ||
సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ
బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శఙ్ఖపాణే |
త్ర్యక్షోరగాభరణ బాలమృగాఙ్కమౌలే
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || ౬ ||
శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే
భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ |
చాణూరమర్దన హృషీకపతే మురారే
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || ౭ ||
శూలిన్ గిరీశ రజనీశకలావతంస
కంసప్రణాశన సనాతన కేశినాశ |
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || ౮ ||
గోపీపతే యదుపతే వసుదేవసూనో
కర్పూరగౌర వృషభధ్వజ ఫాలనేత్ర |
గోవర్ధనోద్ధరణ ధర్మధురీణ గోప
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || ౯ ||
స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే
కృష్ణాఽనిరుద్ధ కమలాకర కల్మషారే |
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప
త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి || ౧౦ ||
అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం
సన్దర్భితాం లలితరత్నకదమ్బకేన |
సన్నాయకాం దృఢగుణాం నిజకణ్ఠగతాం యో
కుర్యాదిమాం స్రజమహో స యమం న పశ్యేత్ || ౧౧ ||
గణావూచుః –
ఇత్థం ద్విజేన్ద్ర నిజభృత్యగణాన్సదైవ
సంశిక్షయేదవనిగాన్స హి ధర్మరాజః |
అన్యేఽపి యే హరిహరాఙ్కధరా ధరాయాం
తే దూరతః పునరహో పరివర్జనీయాః || ౧౨ ||
అగస్త్య ఉవాచ –
యో ధర్మరాజ రచితాం లలితప్రబన్ధాం
నామావళిం సకలకల్మషబీజహన్త్రీమ్ |
ధీరోఽత్ర కౌస్తుభభృతః శశిభూషణస్య
నిత్యం జపేత్ స్తనరసం న పిబేత్స మాతుః || ౧౩ ||
ఇతి శృణ్వన్కథాం రమ్యాం శివ శర్మా ప్రియేఽనఘామ్ |
ప్రహర్షవక్త్రః పురతో దదర్శ సరసీం పురీమ్ || ౧౪ ||
ఇతి శ్రీస్కన్దమహాపురాణే కాశీఖణ్డపూర్వార్ధే యమప్రోక్తం శ్రీహరిహరాష్టోత్తర శతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ||
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.