Sri Alamelumanga Smarana (Manasa Smarami) – శ్రీ అలమేలుమంగా స్మరణ (మనసా స్మరామి)


పద్మనాభప్రియా అలమేలుమంగా
అలమేలుమంగా మనసా స్మరామి

పద్మావతీ దేవి అలమేలుమంగా
పద్మనాభప్రియా అలమేలుమంగా
పద్మోద్భవా అలమేలుమంగా
పద్మాలయా దేవి అలమేలుమంగా

సుప్రసన్నా అలమేలుమంగా
సముద్రతనయా అలమేలుమంగా
సురపూజితా అలమేలుమంగా
సరోజహస్తా దేవి అలమేలుమంగా

సౌభాగ్యదాయిని అలమేలుమంగా
సరసిజనయనా అలమేలుమంగా
సర్వజ్ఞశక్తివే అలమేలుమంగా
సర్వమయీదేవి అలమేలుమంగా

దుఃఖప్రశమనే అలమేలుమంగా
దుష్టభయంకరి అలమేలుమంగా
శక్తిస్వరూపా అలమేలుమంగా
దాంతస్వరూపిణి అలమేలుమంగా

సౌమ్యసల్లక్షణా అలమేలుమంగా
శాంతస్వరూపిణి అలమేలుమంగా
సంపత్కరీదేవి అలమేలుమంగా
సర్వతీర్థస్థిత అలమేలుమంగా

ఆద్యన్తరహితా అలమేలుమంగా
ఆదిశక్తివే అలమేలుమంగా
అతీతదుర్గా అలమేలుమంగా
అనంతనిత్యా అలమేలుమంగా

మంత్రమూర్తే దేవి అలమేలుమంగా
మహోదరీ దేవీ అలమేలుమంగా
శ్రీమహాపూజ్యా అలమేలుమంగా
శ్రీమహాశక్తి అలమేలుమంగా

పద్మాసనస్థితా అలమేలుమంగా
పద్మమాలాధర అలమేలుమంగా
పంచకోశాత్మికా అలమేలుమంగా
పద్మసుందరీ దేవి అలమేలుమంగా

విశ్వజననీ దేవి అలమేలుమంగా
విద్యాధిదేవతా అలమేలుమంగా
విస్తారరూపా అలమేలుమంగా
వసుంధరా దేవి అలమేలుమంగా

హేమమాలిని అలమేలుమంగా
హరిహృదయవాసిని అలమేలుమంగా
హంసారూఢా అలమేలుమంగా
హిరణ్యవర్ణా అలమేలుమంగా

చిద్రూపిణి దేవి అలమేలుమంగా
చిచ్ఛక్తివే అలమేలుమంగా
చంద్రవదనా అలమేలుమంగా
చతుర్భుజా దేవి అలమేలుమంగా

చారుదరహాసిని అలమేలుమంగా
చంద్రస్వరూపిణి అలమేలుమంగా
సాంద్రకరుణా దేవి అలమేలుమంగా
సాధుపరిపాలిని అలమేలుమంగా

పద్మసుందరి దేవి అలమేలుమంగా
పంచబ్రహ్మాత్మికా అలమేలుమంగా
పంచవక్త్రా దేవి అలమేలుమంగా
పరమాత్మికా అలమేలుమంగా

దారిద్ర్యధ్వంసిని అలమేలుమంగా
ధనధాన్యకారిణి అలమేలుమంగా
దుర్భిక్షధ్వంసిని అలమేలుమంగా
ధర్మనిలయా దేవి అలమేలుమంగా

క్షీరాబ్ధిసంభవ అలమేలుమంగా
కరుణామయి దేవి అలమేలుమంగా
కమలాయతాక్షి అలమేలుమంగా
కమలనాభప్రియ అలమేలుమంగా

శుక్లమాల్యాంబరా అలమేలుమంగా
శతరూప దేవి అలమేలుమంగా
మాయాస్వరూపిణి అలమేలుమంగా
మంత్రరంజని దేవి అలమేలుమంగా

సర్వాత్మికా దేవి అలమేలుమంగా
పంచభూతాత్మికా అలమేలుమంగా
జగత్ స్థితికారిణి అలమేలుమంగా
జగత్పరిపాలిని అలమేలుమంగా

రాకేందువదనా అలమేలుమంగా
రాజ్యలక్ష్మీ దేవి అలమేలుమంగా
నవదుర్గమాతా అలమేలుమంగా
నాదస్వరూపిణి అలమేలుమంగా

బ్రహ్మజనని అలమేలుమంగా
బ్రహ్మాణి దేవి అలమేలుమంగా
భాగ్యాబ్ధిచంద్రికా అలమేలుమంగా
భవభంజని దేవి అలమేలుమంగా

సర్వమంగళ దేవి అలమేలుమంగా
సుఖకర్తృనయనా అలమేలుమంగా
సర్వమంత్రేష్టా అలమేలుమంగా
సర్వబ్రాహ్మ్యస్థిత అలమేలుమంగా

ముక్తినిలయా అలమేలుమంగా
మృత్యుభంజనా అలమేలుమంగా
శ్రీమహాభోగా అలమేలుమంగా
శ్రీమహాదుర్గా అలమేలుమంగా

శ్రీమహాభాగా అలమేలుమంగా
మలభంజనీ దేవి అలమేలుమంగా
బలవర్ధిని దేవి అలమేలుమంగా
ధర్మసంవర్ధిని అలమేలుమంగా

క్రోధ క్షతా దేవి అలమేలుమంగా
లోభదహనా దేవి అలమేలుమంగా
మోహస్వరూపిణి అలమేలుమంగా
సృష్టిస్వరూపా అలమేలుమంగా

బ్రహ్మవిస్తారిణీ అలమేలుమంగా
బ్రహ్మాండగర్భిణీ అలమేలుమంగా
భద్రస్వరూపా అలమేలుమంగా
భ్రమరాంబవే నీవు అలమేలుమంగా

కమలగర్భోద్భవా అలమేలుమంగా
కాలస్వరూపిణి అలమేలుమంగా
కామ్యవరదా దేవి అలమేలుమంగా
కరుణామయి దేవి అలమేలుమంగా

వేదమంత్రాత్మికా అలమేలుమంగా
వేదవిజ్ఞాన అలమేలుమంగా
విష్ణువక్షస్థితా అలమేలుమంగా
వీరలక్ష్మీ దేవి అలమేలుమంగా

విష్ణుపత్నీ అలమేలుమంగా
విష్ణుస్వరూపిణి అలమేలుమంగా
వేదార్థరూపా అలమేలుమంగా
విశ్వజనని దేవి అలమేలుమంగా


మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed