Sri Vishwakarma Ashtakam 3 – శ్రీ విశ్వకర్మాష్టకం


శ్రీకరార్చిత సత్యశాశ్వత లోకనిర్మిత నిర్జరా
పాకశాసనపద్మజాది సురాసురార్చిత భాస్కరా |
ఏకమేవ బ్రహ్మమూర్తి పినాకసంస్థిత శంకరా
శోకవర్జిత శంభునామక విశ్వకర్మ జగత్ప్రభో || ౧ ||

సర్వనాయక సర్వదాయక సర్వసాక్షి మహేశ్వరా
సర్వరాజిత సర్వపూజిత సర్వకార్య ధురంధరా |
సర్వశిక్షక సర్వభక్షక సర్వరక్షక శ్రీకరా
సర్వసద్గుణ సర్వనామక విశ్వకర్మ జగత్ప్రభో || ౨ ||

స్వర్ణరూప సువర్ణలోక సమస్తకాంతి మనోహరా
వర్ణరాజిత వర్ణవర్జిత వర్ణరాజ విధాకరా |
వర్ణవాచక వర్ణసంభవ వర్ణవేదజటాధరా
వర్ణవర్ణాతీత వర్ణన విశ్వకర్మ జగత్ప్రభో || ౩ ||

మంత్రవిగ్రహ మంత్రసంగ్రహ మంత్రమాయజ సంహరా
మంత్రచేతన మంత్రనూతన మంత్రసంశయ శేఖరా |
మంత్రరాజిత మంత్రపూజిత వేదవేద్య విశారదా
మంత్రబంధుర మంత్రనామక విశ్వకర్మ జగత్ప్రభో || ౪ ||

హారఘోర విదారదూర శ్రమణ నిస్వన మంజులా
ధీరవార్ధి గభీరమాయా మంద్రితాశ్రిత చిత్కళా |
సూరిత్వష్టృ విహారకల్ప విచారకారణ సత్ఫలా
మేరు నిర్మిత మేరునామక విశ్వకర్మ జగత్ప్రభో || ౫ ||

విశ్వచారణ విశ్వపూరిత విశ్వధారణ నిశ్చయా
విశ్వభూషణ విశ్వతోరణ విశ్వపోషణ విస్మయా |
విశ్వతారణ విశ్వకారణ విశ్వధారణ లీలయా
విశ్వహారణ విశ్వనామక విశ్వకర్మ జగత్ప్రభో || ౬ ||

మంగళాకర మంగళాధర మంగళాసన పంచకా
మంగళస్థిత మంగళప్రద మంగళాంగ విరాజితా |
మంగళాయత భీషదాయక మంగళాకర నామకా
మంగళాయజ తుంగనామక విశ్వకర్మ జగత్ప్రభో || ౭ ||

కల్పపావన కల్పజీవన కల్పభావ నమోస్తు తే
కల్పపాలన కల్పఖేలన కల్పజాజ్ఞ నమోస్తు తే |
కల్పనాకృత కల్పసంయుత కల్పకల్ప నమోస్తు తే
కల్పితాండజ కల్పనామక విశ్వకర్మ జగత్ప్రభో || ౮ ||

ఇతి శ్రీ విశ్వకర్మాష్టకమ్ ||


గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed