Paluke Bangaramayena – పలుకే బంగారమాయెనా


పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా ||

పలుకే బంగారమయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరవ చక్కని తండ్రి
పలుకే బంగారమాయెనా ||

ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి
పలుకే బంగారమాయెనా ||

రాతినాతిగ జేసి భూతలమున
ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి
పలుకే బంగారమాయెనా ||

ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు
పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి
పలుకే బంగారమాయెనా ||

శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాదా
కరుణించు భద్రాచలవర రామదాస పోష
పలుకే బంగారమాయెనా ||


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Paluke Bangaramayena – పలుకే బంగారమాయెనా

స్పందించండి

error: Not allowed