Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
గిరితనయాసుత గాంగపయోదిత గంధసువాసిత బాలతనో
గుణగణభూషణ కోమలభాషణ క్రౌంచవిదారణ కుందతనో |
గజముఖసోదర దుర్జయదానవసంఘవినాశక దివ్యతనో
జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే || ౧ ||
ప్రతిగిరిసంస్థిత భక్తహృదిస్థిత పుత్రధనప్రద రమ్యతనో
భవభయమోచక భాగ్యవిధాయక భూసుతవార సుపూజ్యతనో |
బహుభుజశోభిత బంధవిమోచక బోధఫలప్రద బోధతనో
జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే || ౨ ||
శమధనమానిత మౌనిహృదాలయ మోక్షకృదాలయ ముగ్ధతనో
శతమఖపాలక శంకరతోషక శంఖసువాదక శక్తితనో |
దశశతమన్మథ సన్నిభసుందర కుండలమండిత కర్ణవిభో
జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే || ౩ ||
గుహ తరుణారుణచేలపరిష్కృత తారకమారక మారతనో
జలనిధితీరసుశోభివరాలయ శంకరసన్నుత దేవగురో |
విహితమహాధ్వరసామనిమంత్రిత సౌమ్యహృదంతర సోమతనో
జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే || ౪ ||
లవలికయా సహ కేలికలాపర దేవసుతార్పిత మాల్యతనో
గురుపదసంస్థిత శంకరదర్శిత తత్త్వమయప్రణవార్థవిభో |
విధిహరిపూజిత బ్రహ్మసుతార్పిత భాగ్యసుపూరక యోగితనో
జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే || ౫ ||
కలిజనపాలన కంజసులోచన కుక్కుటకేతన కేలితనో
కృతబలిపాలన బర్హిణవాహన ఫాలవిలోచనశంభుతనో |
శరవణసంభవ శత్రునిబర్హణ చంద్రసమానన శర్మతనో
జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే || ౬ ||
సుఖదమనంతపదాన్విత రామసుదీక్షిత సత్కవిపద్యమిదం
శరవణ సంభవ తోషదమిష్టదమష్టసుసిద్ధిదమార్తిహరమ్ |
పఠతి శృణోతి చ భక్తియుతో యది భాగ్యసమృద్ధిమథో లభతే
జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే || ౭ ||
ఇతి శ్రీఅనంతరామదీక్షిత కృతం షణ్ముఖ షట్కమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See Details – Click here to buy
మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.